amp pages | Sakshi

లీకువీరుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకరే!

Published on Wed, 07/27/2016 - 17:40

అది 2014 సంవత్సరం. మెడికల్ పీజీ ప్రవేశపరీక్ష పేపర్ లీకైన విషయం పెద్ద ఎత్తున సంచలనం రేపింది. అందులో కీలక నిందితుడు రాజగోపాల రెడ్డి. అతడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేసి, తర్వాత విడుదల చేశారు.

కట్ చేస్తే.. 2016 సంవత్సరం.. తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ 2 మెడికల్ ఎంట్రన్స్ పేపర్ లీకైందని సీఐడీ నిర్ధారించింది. ఇందులోనూ కీలక నిందితుడు రాజగోపాలరెడ్డే!! అప్పుడూ ఇప్పుడూ కూడా అదే వ్యక్తి మెడికల్ ప్రవేశపరీక్ష పేపర్లను లీక్ చేస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ విషయం తాజాగా తెలంగాణ సీఐడీ విచారణలో తేలింది.

ఎంసెట్ పేపర్ లీకేజి విషయంలో ఇప్పటివరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో గతంలో నిందితుడైన రాజగోపాలరెడ్డితో పాటు కన్సల్టెన్సీ యజమాని విష్ణు, దళారీ రమేష్లతో పాటు.. తిరుమల్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిలో విష్ణుకు ఒక కన్సల్టెన్సీ ఉంది. దాని ద్వారా వేరే రాష్ట్రాలలో ఉన్న వైద్య కళాశాలలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో మేనేజిమెంటు కోటా సీట్లు ఇప్పిస్తానంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో బేరాలు కుదుర్చుకునేవాడని అంటున్నారు. ఈ నలుగురితో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఈ కేసులో ఉన్నారని, వాళ్లు పరారీలో ఉన్నారని సమాచారం.

కేసు ఛేదించిందిలా...
సీఐడీ అధికారులు ముందుగా బ్రోకర్ల కాల్ డేటా సేకరించారు. ర్యాంకులు వచ్చిన పిల్లల తల్లిదండ్రుల కాల్ డేటా కూడా చూస్తే రెండూ కలిశాయి. వాళ్లిద్దరు కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నట్లు తేలింది. జేఎన్టీయూ సిబ్బంది ఇద్దరి పేర్లు కూడా ఈ కాల్ డేటాలో వచ్చాయి. ఒకరు ప్రొఫెసర్, మరొకరు నాన్ టీచింగ్ స్టాఫ్ అని తెలిసింది. లీకేజి స్కాం విలువ 50 కోట్లు, కాగా.. మొత్తం 74 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తు వివరాలన్నింటినీ ముఖ్యమం‍త్రి కేసీఆర్కు డీజీపీ అందజేశారు.

లీకు ఎలా చేశారంటే...
బెంగళూరు కేంద్రంగా మొత్తం వ్యవహారం నడిచింది. రాజగోపాలరెడ్డి (63) ఉషా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. మేనేజిమెంట్ కోటాలో వైద్యసీట్ల విక్రయానికి దళారీగా వ్యవహరించేవాడు. అక్రమ మార్గంలో మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నాడంటూ బెంగళూరులో కూడా ఇతడిపై నాలుగు కేసులు ఉన్నాయి. ఢిల్లీలో పేపర్ల ముద్రణ జరుగుతుందని ముందే తెలిసిన రాజగోపాలరెడ్డి.. హైదరాబాద్లో ఉన్న కన్సల్టెన్సీ ద్వారా ఎంబీబీఎస్ కోచింగ్ సెంటర్లలో బాగా స్థితిమంతులైన పిల్లల వివరాలు సేకరించి, వాళ్ల తల్లిదండ్రులతో బేరం కుదుర్చుకున్నాడు. సాధారణంగా ఇలాంటి ప్రధానమైన పరీక్షలకు మూడు సెట్ల పేపర్లను సిద్ధం చేస్తారు. ఏ సెట్ను ఉపయోగించేదీ ఆరోజు ఉదయమే ప్రకటిస్తారు. అందుకే మొత్తం మూడు సెట్ల పేపర్లనూ లీక్ చేయించాడు. ఏ సెట్ వచ్చినా వాటిలోని ప్రశ్నలన్నీ తెలుసు కాబట్టి.. సులభంగా ర్యాంకులు సాధించేలా ఆ విద్యార్థులను రెండురోజుల పాటు బెంగళూరులో సిద్ధం చేశారు. సరిగ్గా పరీక్షరోజు ఉదయమే వాళ్లను విమానాల్లో హైదరాబాద్ రప్పించారు. దాంతో ముందు అనుకున్నట్లుగానే మంచి ర్యాంకులు వచ్చాయి.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)