amp pages | Sakshi

ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్ కె.ఎం.జోసెఫ్

Published on Wed, 05/04/2016 - 03:16

- ఉత్తరాఖండ్ హైకోర్టు నుంచి బదిలీపై త్వరలో ఉమ్మడి హైకోర్టుకు
- ఏసీజే జస్టిస్ బొసాలేకు మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి
- సుప్రీంకోర్టుకు జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్
- సిఫార్సులు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

 
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కుట్టియిల్ మాథ్యూ జోసెఫ్ బదిలీపై రానున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని తప్పుపడుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు సైతం న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయంటూ సంచలన తీర్పునిచ్చి వార్తల్లో నిలిచారు. ఈమేరకు సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా రాష్ట్రపతికి సిఫార్సులు పంపింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.కె.మాథ్యూ కుమారుడైన జస్టిస్ జోసెఫ్‌కు వివాదరహితుడిగా పేరుంది.
 
 
 జస్టిస్ జోసెఫ్ 1958 జూన్ 17న కేరళలోని కొచ్చిలో జన్మించారు. కొచ్చిలోని కేంద్రీయ విద్యాలయం, తరువాత ఢిల్లీలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. తరువాత చెన్నై లయో లా కాలేజీలో చేరారు. ఎర్నాకుళంలోని ప్రభుత్వ ‘లా’ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1982లో న్యాయవాదిగా నమోదయ్యారు. మొదట ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1983లో ప్రాక్టీస్‌ను కేరళకు మార్చారు. ప్రముఖ న్యాయవాది వర్గీస్ ఖల్లియత్ వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 2004 అక్టోబర్ 14న కేరళ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 జూలై 18న ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వస్తున్నారు.
 
 జస్టిస్ బొసాలేకు పదోన్నతి..
 ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు పదోన్నతి కల్పించింది. మరోవైపు మధ్యప్రదేశ్, అలహాబాద్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్, జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్‌భూషణ్‌లకూ పదోన్నతి లభించింది. ఈ ముగ్గురిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. జస్టిస్ అజయ్ ఖాన్విల్కర్, జస్టిస్ ధనుంజయ్ చంద్రచూడ్‌లిద్దరూ మహారాష్ట్రకు చెందినవారు. వాస్తవానికి ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బొసాలేకు ప్రధాన న్యాయమూర్తిగా కొంతకాలం క్రితమే పదోన్నతి రావాల్సి ఉంది.
 
 అయితే ఈయన కూడా మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కావడం, అప్పటికే మహారాష్ట్రకు చెందిన జస్టిస్ అజయ్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌లిద్దరూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కొనసాగుతుండటంతో జస్టిస్ బొసాలే పదోన్నతి ఆలస్యమైంది. ఒకే రాష్ట్రానికి చెందిన ముగ్గురు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించడం సంప్రదాయానికి విరుద్ధం కావడంతో ఇప్పటి వరకు జస్టిస్ బొసాలే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానే కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ అజయ్ ఖాన్విల్కర్, జస్టిస్ ధనుంజయ్ చంద్రచూడ్‌లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడంతో ప్రధాన న్యాయమూర్తి అయ్యేందుకు జస్టిస్ బొసాలేకు మార్గం సుగమమైంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)