amp pages | Sakshi

పులిరాజా కబళిస్తోంది!

Published on Thu, 07/27/2017 - 03:02

రాష్ట్రంలో పెరుగుతున్న హెచ్‌ఐవీ బాధితులు
 
ఇప్పటికీ ప్రపంచాన్ని వణికిస్తున్న ‘హ్యూమన్‌ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్‌ (హెచ్‌ఐవీ)’ భూతం చాప కింద నీరులా మెల్లమెల్లగా కబళిస్తోంది. దేశవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది దీని బారిన పడుతుండగా.. మన రాష్ట్రంలోనూ ఈ మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఏటా సుమారు 12 వేల మందికిపైగా హెచ్‌ఐవీ బారిన పడుతున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఇక హెచ్‌ఐవీ ముదిరిపోయి ‘ఎయిడ్స్‌ (అక్వైర్డ్‌ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్‌)’ దశకు చేరిన వేలాది మంది దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు.
–సాక్షి, హైదరాబాద్‌ 

ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవీ బాధితులు 36.70 కోట్లు
భారత దేశంలో హెచ్‌ఐవీ బాధితులు 21.17లక్షలు
తెలంగాణలో హెచ్‌ఐవీ బాధితులు 2.01లక్షలు
చికిత్స పొందుతున్న వారు 69,901 
చికిత్స పొందుతున్న వారిలో పిల్లలు 2,804
ప్రత్యేక బ్లడ్‌ బ్యాంకులు 134
హెచ్‌ఐవీకి కారణమయ్యే హైరిస్క్‌ గ్రూపు 1,87,864
సెక్స్‌ వర్కర్లు,ట్రాన్స్‌ జెండర్లు 66,588
సమగ్ర అవగాహన, చికిత్స కేంద్రాలు 852
పరీక్షలు,మందుల పంపిణీ కేంద్రాలు 101
 
చాప కింద నీరులా... 
హెచ్‌ఐవీ సోకిన వారిలో చాలా మందికి తగిన చికిత్స అందడం లేదు. తమకు హెచ్‌ఐవీ ఉన్నట్లు బయటికి తెలిస్తే వెలివేతకు గురవుతామన్న ఆందోళన, హెచ్‌ఐవీ మందులు అత్యంత ఖరీదు కావడం, పేదరికం, హెచ్‌ఐవీ సోకినా కొంతకాలం వరకూ గుర్తించకపోవడం వంటి కారణాలతో.. చికిత్స చేసుకునే రోగుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో వారి ద్వారా హెచ్‌ఐవీ మరింత మందికి సోకుతోంది. పదేళ్ల కిందటితో పోల్చితే హెచ్‌ఐవీ కేసుల నమోదు సంఖ్య తగ్గినా... ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే ఉండడం ఆందోళనకరం. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌లను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా కృషి చేస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. 
 
చికిత్స అందుతున్నది కొందరికే..
తెలంగాణలో 2,01,167 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నట్లు అంచనా. కానీ అందులో 69,901 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. దీనికితోడు ఏటా కొత్తగా 12 వేల మంది వరకు హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు. రాష్ట్రంలోని చాలా కేంద్రాల్లో హెచ్‌ఐవీ బాధితులకు చికిత్స కేంద్రాలు ఉన్నాయి. ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహిస్తారు. హెచ్‌ఐవీ బాధితులకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్‌ రోగులకు ప్రతి నెల రూ.వెయ్యి పింఛనుగా అందిస్తోంది.
 
ఎంతగా ప్రయత్నిస్తున్నా..
హెచ్‌ఐవీ నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టాయి. ఇందుకోసం భారీగా నిధులు కూడా ఖర్చు చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీ (ఏసీఎస్‌)లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (న్యాకో) ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తున్నాయి. ప్రజల్లో హెచ్‌ఐవీపై అవగాహన కల్పన, మందుల పంపిణీ, చికిత్స అందిస్తున్నాయి. హెచ్‌ఐవీ వ్యాప్తికి కారణమయ్యే సెక్స్‌ వర్కర్లు, ట్రాన్స్‌ జెండర్లు, స్వలింగ సంపర్కుల వివరాలను నమోదు చేస్తున్నాయి.
 
ప్రతి రక్త నమూనా పరిశీలన
హెచ్‌ఐవీ వ్యాప్తిలో రక్త మార్పిడి ప్రక్రియ కూడా కీలకంగా మారింది. బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల రక్తం, బ్లడ్‌ బ్యాంకులకు చేరుతున్న రక్తం వంటివాటిని ఎవరికైనా ఎక్కించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా పరీక్షించక పోతుండ డంతో హెచ్‌ఐవీ సంక్రమిస్తోంది. దీంతో ఇటీవల ప్రతి రక్త నమూనానూ తప్పనిసరిగా హెచ్‌ఐవీ పరీక్ష చేసేలా చర్యలు చేపట్టారు. ఇలా ఏటా సగటున 20 లక్షల రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు.
 
తెలంగాణలో హెచ్‌ఐవీ పరిస్థితి.. (2016–17లో)
నిర్ధారణ కోసం మొత్తం రక్త పరీక్షలు 19,32,987
ఏసీఎస్‌ ఆధ్వర్యంలో సేకరించిన నమూనాలు 6,74,324
అవసరార్థం ఇచ్చిన రక్త నమూనాలు 4,05,527
రక్తదానం చేసిన వారి నమూనాలు  2,68,797
హెచ్‌ఐవీగా నిర్ధారించినవి 11,403
గర్భిణుల రక్త నమూనాలు 6,71,925
హెచ్‌ఐవీగా నిర్ధారణ అయినవి 655
పంపిణీ చేసిన కండోమ్‌లు 38,70,276

#

Tags

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)