amp pages | Sakshi

తీహార్‌ జైలుకు ‘దిల్‌సుఖ్‌నగర్‌’ దోషులు

Published on Sat, 01/21/2017 - 04:17

ఉరిశిక్ష పడిన ఉగ్రవాదుల తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల దోషులను ఢిల్లీలోని తీహార్‌ జైలుకు తరలించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 2014లో పేలుళ్ల అనంతరం ఈ ఐదుగురు ఉగ్రవాదు లను విచారించేందుకు నేషనల్‌ ఇన్వె స్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) హైదరాబాద్‌ రేంజ్‌ అధికారులు పీటీ వారెం ట్‌పై రాష్ట్రానికి తీసుకువచ్చారు. పే లుళ్ల కేసు విచారణ పూర్తయ్యే వరకు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల ఈ కేసులో ఐదుగురు ఉగ్రవాదులను దోషులుగా నిర్ధారించిన ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం.. వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హైదరాబాద్‌లో విచారణ పూర్తయినందున ఈ ఐదుగురి ని తాము విచారించాల్సి ఉందని ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు అక్కడి న్యాయస్థానంలో పీటీ వారెంట్‌ పొందారు.

అంతేకాకుండా నిందితులను దర్యాప్తు అధికారులు పీటీ వారెంట్‌పై తీసుకొస్తే   తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఈ మేరకు వీరిని తీహార్‌ జైలుకు తరలిం చాలని విజ్ఞప్తి చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ, డీజీపీ కి జైళ్ల శాఖ డీజీ లేఖలు రాశారు. 4 రోజుల్లోగా ఈ ఐదుగురిని తీహార్‌ జైలు కు తరలించేందుకు చర్యలు చేపడుతు న్నామని.. ఇందుకు భద్రతా చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ఈ ఐదుగురు ఉగ్రవాదులను వచ్చే వారం విమానంలో ఢిల్లీకి తరలించనున్నట్లు సమాచా రం. వారిని ఢిల్లీ స్పెషల్‌ పోలీసులు, అనంతరం మహా రాష్ట్రలోని థానే పోలీసులు విచారించనున్నారు. బెంగ ళూర్, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్, బిహార్, జైపూర్‌ పేలుళ్ల కేసులోనూ ఈ ఉగ్రవాదులే నిందితులుగా ఉండటంతో అక్కడి పోలీసులు సైతం విచారించేందుకు ప్రయత్నిస్తు న్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)