amp pages | Sakshi

రాహుల్, ఏచూరిపై కేసు

Published on Mon, 02/29/2016 - 03:10

124 (ఏ), 156 (3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు

 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి. రాజాలతోపాటు జేఎన్‌టీయూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌లపై రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాల మేరకకు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది.

అఫ్జల్‌గురుకు మద్దతుగా దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా జేఎన్‌టీయూ విద్యార్థి కన్హయ్య కుమార్  ప్రవర్తించాడని, ఇతనికి మద్దతుగా రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, సీతారాం ఏచూరి, డి.రాజాలు నిలిచారని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన న్యాయవాది జనార్ధన్‌గౌడ్ రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో రాహుల్ గాంధీతో సహా పలువురిపై కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు సరూర్‌నగర్ పోలీసులను ఆదేశించింది. పిటీషన్‌లో పేర్కొన్న వారందరిపై ఐపీసీ 124ఏ, 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పూర్తి నివేదిక అందించాలని కోర్టు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.

Videos

Play Offs లోకి ఆర్సిబీ

ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి

మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు

పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు

టీడీపీపై బొత్స సెటైర్లు

వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు

సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..

కేబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..

Photos

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)