amp pages | Sakshi

బైక్ లాంగ్వేజ్

Published on Wed, 08/20/2014 - 00:29

రోడ్డుమీద వెళ్తుంటే... ఎదురుగా ఉన్న బైక్ వెనకాల కొటేషన్ కంట్లో పడగానే... అయితే నవ్వు... లేదంటే ఆలోచన. కొటేషన్ కాస్త తేడాగా కనిపిస్తే... ఆ బైక్‌పై కుర్రాడిని కాస్త కోపంగా చూడ్డం... వీడు.. వీడి పైత్యం అన్నట్టు. నిజమే...‘ఇట్స్ మై డాడ్ రోడ్’ అనే కొటేషన్ చూస్తే ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందా! ‘మామ్ టోల్డ్ టు డ్రైవ్ స్లో. బట్ మై గర్ల్‌ఫ్రెండ్ ఆస్క్ టు డ్రైవ్ ఫాస్ట్!’ ఇలా రాసుకున్న కుర్రాడ్ని చూసి అయ్యోపాపం పిల్లాడికి ఎంత కష్టం వచ్చిందన్నట్టు పెడతాం మొహం. ‘ఇఫ్ యు ఫాలో మి ఇట్స్ హెవెన్. ఇఫ్ యు ఓవర్‌టేక్ మి దెన్ ఇట్స్ హెల్’... చదవగానే ఎవరికైనా ఒళ్లు మండుతుంది. అంటే వీడి వెనకాలే తోకలా వెళ్లాలన్నమాట. ఏ... అతన్ని దాటి ముందుకెళితే నరకానికెళ్లిపోతామా..! కచ్చితంగా అతని వెనకున్నవారు కాస్త స్పీడుపెంచి వాడ్ని అద్దంలో నుంచి కొద్దిగా వెటకారంగా చూస్తూ ఓవర్‌టేక్ చేస్తారు. ఇంతకీ.. ఏమిటీ కొటేషన్లు, ఎందుకీ కవిత్వాలు అంటే... కుర్రకారు తమ కలాన్ని ఝులిపించడానికి బైక్‌లను వేదికలుగా మలుచుకునే పనిలో పడ్డారు. దాంతో రోడ్లపై కళ్లకు కమ్మని కవిత్వాలు, కవ్వించే కొత్త వాక్యాలు కనిపిస్తున్నాయి.

మామ్ గిఫ్ట్...

బైక్ నంబర్ ప్లేట్ కింద కనిపించే వాటిల్లో అధిక కొటేషన్లు... మామ్ గిఫ్ట్ లేదంటే డాడ్ గిఫ్ట్. ఇంకా అంటే ‘ఐ లవ్ ఇండియా’. కుర్రాళ్లు కొత్త ట్రెండ్‌లకు వెల్‌కమ్ చెబుతూ... కొటేషన్లు రాసుకుని స్టిక్కర్ షాపుల వుుందు క్యూ కడుతున్నారు.

 ‘ముఖ్యంగా కాలేజీ అబ్బాయిలు... బైక్ కొటేషన్లపై ఎక్కవ ఆసక్తి చూపిస్తున్నారు. కొందరయితే నెలకోసారి కొటేషన్లను మార్చేస్తున్నారు. అదేంటంటే...ఫ్రెండ్‌కి నచ్చలేదు, గర్ల్‌ఫ్రెండ్‌కి నచ్చలేదు అంటున్నారు. కొందరు ప్రత్యేకంగా దేశభక్తికి సంబంధించిన కొటేషన్లు, దైవభక్తికి సంబంధించిన కొటేషన్లు తీసుకొస్తారు’ అంటూ తన షాపు దగ్గరకొచ్చే అబ్బాయిల విషయాలు చెప్పారు బాలనగర్‌లోని న్యూస్టయిల్ స్టిక్కర్ షాపు యజమాని అఖిల్.

అదో... సరదా

మంచి వాక్యాలయితే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఇబ్బందికరంగా ఉండే కొటేషన్ల గురించి అబ్బాయిలను అడిగితే... అలాంటివి చదివి ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కదా అంటారు. ‘హెల్ ఈజ్ ఫుల్... సో ఐయామ్ బ్యాక్’ ఎంత స్పెషల్‌గా ఉందండీ అంటాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే రాహుల్. అదేం బాగుందిరా... నేను చెబుతాను విను... ‘యువర్ విలేజ్ కాల్డ్, దేర్ ఇడియట్ ఈజ్ మిస్సింగ్’ అంటాడు కార్తిక్. ఇలా కుర్రాళ్ల కవిత్వంపై ఇంటర్నెట్ ప్రభావం కూడా బాగానే ఉంటోంది. ‘బంపర్ స్టిక్కర్స్’ అనే సైట్‌లో బైక్‌లపై ఎలాంటి స్లోగన్స్ రాసుకోవాలో, కార్లపై ఎలాంటివి అతికించుకోవాలో వివరంగా ఉంటుంది.

సిటీ ప్లస్  ఫొటోలు: జి.రాజేష్
 

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)