amp pages | Sakshi

మళ్లీ పులిరాజ పంజా

Published on Sun, 07/24/2016 - 03:46

రాష్ట్రంలో రోజూ 100 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్!
- గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువగా నమోదు
- ప్రతీనెలా 120 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ ఉన్నట్టు నిర్ధారణ
- చాపకింద నీరులా విస్తరిస్తోన్న వ్యాధి
 గడిచిన 12 నెలల్లో హెచ్‌ఐవీ టెస్టులు చేసింది 7.94 లక్షల మందికి
 హెచ్‌ఐవీ సోకినవారి సంఖ్య 23,960
 హెచ్‌ఐవీ సోకిన గర్భిణులసంఖ్య 996

 
 సాక్షి, హైదరాబాద్ : పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా? ఒకప్పుడు అన్ని టీవీ చానళ్లలో, రోడ్లపక్కన హోర్డింగ్‌లపైన, పత్రికల్లో భారీ ప్రకటనలు హోరెత్తిన విషయం గుర్తుంది కదూ! హెచ్‌ఐవీపై ప్రజల్ని చైతన్యం చేస్తూ జారీ అయిన అవి అప్పట్లో రాష్ట్రంలో  చర్చనీయాంశమయ్యాయి కూడా. అంతేకాదు.. ఎయిడ్స్ నిరోధం కోసం ప్రభుత్వపరంగా పెద్ద ఎత్తున చర్యలు కొనసాగాయి. నిధుల కేటాయింపూ జరిగింది.

 మరిప్పుడో.. : పులిరాజా వస్తున్నాడహో.. అంటూ జాగృతపరిచే ప్రకటనలు లేవు. హోర్డింగ్‌లలో ప్రకటనల్లేవు. కరపత్రాల్లేవు.ఆస్పత్రుల్లోనూ వ్యాధి గురించి చెప్పే గోడరాతల్లేవు. కేంద్ర నిధులు చిక్కిపోయాయి. దీంతో ఎయిడ్స్ నివారణ చర్యలు అంతంతమాత్రమయ్యాయి.

 దీని ఫలితం.. : రాష్ట్రంలో పులిరాజు మళ్లీ విజృంభించాడు. రాష్ట్రంలో హెచ్‌ఐవీ-ఎయిడ్స్ మరలా జడలు విప్పుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రోజూ 100మందికిపైనే హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్టు సాక్షాత్తూ ప్రభుత్వ తాజా సర్వేలోనే వెల్లడవడం గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రోజూ 70వేల నుంచి లక్షమందికి హెచ్‌ఐవీ టెస్టులు నిర్వహిస్తుంటే 100 నుంచి 125 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలుతోంది. అత్యధికంగా గుంటూరు, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో ఉన్నట్టు వెల్లడైంది. ప్రతీనెలా 120 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణవుతోంది.

 నిధుల్లేక.. మందులు కొనట్లేదు: హెచ్‌ఐవీ-ఎయిడ్స్ నివారణ చర్యల్లో ప్రధానమైంది పరీక్షలు. తర్వాత మందుల సరఫరా కీలకం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరిగా రావట్లేదు. ఏడాదికి దాదాపు రూ.80 కోట్ల వరకు రావాల్సివుంటే 2015-16లో వచ్చింది రూ.20 కోట్లే. ఈ ఏడాది ఇవీ ఇంతవరకూ రాలేదు. ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్(ఐసీటీసీ)లలో హెచ్‌ఐవీ బాధితులకు పరీక్షలు నిర్వహిద్దామంటే.. కనీసం సిరంజీలు, సూదులు(నీడిల్స్) లేని పరిస్థితి నెలకొంది. హెచ్‌ఐవీ సోకిన గర్భిణులకు పుట్టే బిడ్డలకు హెచ్‌ఐవీ సోకకుండా ఇవ్వాల్సిన నెవరపిన్ సిరప్‌లు 9నెలలుగా లేవు.

హెచ్‌ఐవీ సోకిన గర్భిణులకు డెలివరీ చెయ్యాలంటే కావాల్సిన గ్లౌజ్‌లుసైతం ప్రభుత్వాసుపత్రుల్లో లేవు. గతంలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి(ఏపీశాక్స్) హెచ్‌ఐవీ బాధితులకు తమ నిధులతో మందులు కొనేది. ఇప్పుడు ఏపీశాక్స్ నుంచి నిధులు రాకపోవడంతో రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ కొనట్లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రుల్లో మందులడిగితే.. మీరే కొనుక్కోండని చెబుతున్నారు. దీనివల్ల ప్రధానంగా టెస్ట్ కిట్‌లు లేక వేలాదిమంది వైద్యపరీక్షలకు దూరమవుతున్నారు. హెచ్‌ఐవీ ఉన్నా టెస్టులు చేయకపోవడం వల్ల తెలుసుకోలేక జీవితాన్ని కోల్పోతున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో హెచ్‌ఐవీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. సరైనవిధంగా వైద్యపరీక్షలు జరిగితే హెచ్‌ఐవీ సోకినవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యం లేదు.
 
 రిజిస్టర్లూ లేవు..
 సాధారణంగా హెచ్‌ఐవీ టెస్టు చెయ్యాలంటే  రోగినుంచి అనుమతి పత్రం తీసుకున్నాకే పరీక్ష చెయ్యాలి. లేదంటే చెయ్యకూడదు. అయితే అలాంటి కన్సంట్ లెటర్లు తీసుకోవడం లేనేలేదు. అంతేకాదు.. హెచ్‌ఐవీ సోకిన బాధితుల వివరాలు నమోదుకు రిజిస్టర్లు కూడా లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం హెచ్‌ఐవీ నివారణ చర్యలపై మరింత శ్రద్ధ పెడితే మేలు. లేకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది.

Videos

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)