amp pages | Sakshi

అప్పుడు ధైర్యంగా భోంచేశా..!

Published on Sun, 02/22/2015 - 02:08

కామెడీ క్లాస్: వేణు మాధవ్
‘సంప్రదాయం’ షూటింగ్‌లో తొలిరోజు నుంచే నటన విషయంలో ఎలాంటి బెరుకూ లేకుండా అల్లుకుపోయాను కానీ.. షూటింగ్ స్పాట్‌లో కొన్ని భయాలు వెంటాడాయి. అది కూడా భోజనంతో ముడిపడినవి. మధ్యాహ్నం లంచ్ సమాయానికి ‘బ్రేక్’ అనే మాట వినిపించింది.. అలా ఎవరన్నారో కానీ, అందరూ భోజనాల మీదపడ్డారు. నాకూ ఆకలేస్తోంది. అయితే అందరిలాగా చొరవగా వెళ్లలేకపోయా... ఎందుకంటే అక్కడ భోంచేస్తే చార్జ్ చేస్తారేమో అనే సందేహం నన్ను ఆపేసింది. రేటు ఎక్కువ ఉంటుందేమో.. మనకు ఇవ్వాల్సిన డబ్బులోంచి ఈ అన్నం బిల్లు అంతా కట్ చేస్తారేమో అనే సందేహం మనసులో పెరిగిపెద్దదైంది.

దీంతో అక్కడ తినలె.. నాకు అకౌంట్ ఉన్న మెస్ దగ్గరకెళ్లి తినొచ్చా. మొదటి రోజు.. రెండో రోజు.. మూడో రోజు... లంచ్‌కు బ్రేక్ ఇవ్వగానే అక్కడ నుంచి మాయం అయ్యేవాడిని. ఎవరితోనూ కమ్యూనికేట్ అయ్యి.. నా డౌట్‌ను క్లారిఫై చేసుకోలేదు. ప్రొడక్షన్ మేనేజర్ ఒకరు మాత్రం ఈ విషయంలో నన్ను గమనించినట్టున్నారు. బయటకు వెళ్లి తినొస్తున్నాననే విషయాన్ని అర్థం చేసుకున్నారాయన. నా మనసులో భావాన్ని కూడా ఆయన ఎలా పసిగట్టారో కానీ.. నాలుగోరోజు లంచ్‌కని బైక్ తీస్తుంటే ‘వేణూ.. ఇక్కడే తిను, ఏం చార్జ్ చెయ్యరులే...’ అన్నారు. అప్పటికి అసలు విషయం అర్థమై, ధైర్యంగా భోజనం చేశా!
 
వద్దంటే... వద్దన్నా

1995లో రవీంద్రభారతిలో రచయిత దివాకర్‌బాబుకు సన్మానం. ఆకృతి అనే సంస్థ నిర్వహించిన ఆ కార్యక్రమంలో నా మిమిక్రీ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. అది నా జీవితాన్నే మలుపుతిప్పే ప్రదర్శన అవుతుందని నేను అనుకోలేదు. ముందు వరసలోనే దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారు, నిర్మాత అచ్చిరెడ్డిగారు కూర్చున్నారు. నేను కొన్ని స్కిట్స్ చేశాను. ప్రోగ్రామ్ అయిపోయాకా.. ఉదయ్‌భాస్కర్ అని ఒకాయన వచ్చి కలిశాడు. ‘నేను ఎస్వీ కృష్ణారెడ్డి గారికి మేనేజర్‌ను,రేపు ఒకసారి మా ఆఫీస్‌కు రాగలరా...’ అని అడిగారు. మిమిక్రీ ప్రోగ్రామ్ కోసమే అయ్యుంటుందిలే అని.. ‘సరే’ అన్నాను.

మరుసటి రోజు ఆఫీస్‌కు వెళ్లాక కృష్ణారెడ్డి గారు అడిగారు.. ‘సినిమాల్లో చేస్తావా..’ అని. నాకేం అర్థం కాలేదు.. ఎందుకంటే, అప్పటికి సినిమాల్లో చేయాలన్న ఆలోచనే లేదాయె! మిమిక్రీ ప్రోగ్రామ్ అనుకొంటే సినిమాల్లో నటిస్తావా.. అని అడుగుతున్నారేంటి అనుకొని, ఔననకుండా, కాదూ అని చెప్పకుండా ఇంటికెళ్లిపోయా. సాయంత్రం ఊర్లో ఉన్న అమ్మకు ఫోన్ చేసి... ఈ విషయాన్ని చెప్పాను. ఆమె సంబరపడి.. చెయ్యమంది. నేనేమో వద్దనుకొంటున్నానమ్మా అంటే... ఆమె సహజమైన శైలిలో కొంచెం గట్టిగా చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దని సూచించింది. అయితే అప్పటికీ నేను కుదురుకోలేదు. మనం సినిమాల్లో చేయడం ఏమిటనే భావనతోనే ఉండిపోయా. ఎలాగైనా ఈ అవకాశాన్ని వదిలేసుకోవడానికి మెదడులో ఒక మాస్టర్‌ప్లాన్ వేసుకొని మరుసటి రోజు కృష్ణారెడ్డి గారి ఆఫీసుకు వెళ్లాను.
 
‘నాకు ఒక్కో మిమిక్రీ ప్రోగ్రామ్‌కు వెయ్యి రూపాయలు ఇస్తారు. మీరు 70 రోజుల షూటింగ్ అంటున్నారు కాబట్టి డెబ్బై వేలు ఇస్తే.. చేస్తా, లేకపోతే లేదు..’ అని ఉదయ్‌భాస్కర్‌కు స్పష్టంగా చెప్పేశా. ఎందుకంటే ఎలాగూ అంత డబ్బు ఇవ్వరు, మనల్ని వదిలేస్తారు అని నా ధీమా. నిజం చెప్పాలంటే అప్పటికి నాకు ఒక్కో మిమిక్రీ ప్రోగ్రామ్‌కి ఇచ్చేది 150 రూపాయలే! సినిమాలో నటించాలనే ఆసక్తి ఏ మాత్రం లేకపోవడం వల్ల ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడమనే అస్త్రాన్ని ఉపయోగించుకొన్నా.
 
సాయంత్రం అమ్మకు ఫోన్ చేస్తే ‘ఏరా.. వాళ్ల ఆఫీసుకు వెళ్లావా’ అంది. ‘హా.. వెళ్లానమ్మా.. వాళ్లు చెప్పినట్టే చేస్తానని చెప్పొచ్చాను’ అని అమ్మకు చెప్పి ఇక సినిమా గొడవ వదిలిపోయిందనుకొని గుండెల మీద చేతులేసుకొని ఆ రోజు రాత్రి ధైర్యంగా నిద్రపోయాను.
 మరుసటి రోజు ఇంటి దగ్గరకు ఉదయ్‌భాస్కర్ వచ్చారు. ఇంట్లోకి రమ్మంటుండగానే చేతిలో పదివేల రూపాయలు పెట్టారు. ఒక్కసారి షాక్. అస్సలు ఊహించని పరిణామం అది. అది కేవలం అడ్వాన్స్ అని, మిగతా డబ్బు సినిమా పూర్తయ్యేలోపు ఇస్తామని చెప్పే సరికి... ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని స్థితి.  అలా ‘సంప్రదాయం’ సినిమాతో సినీపరిశ్రమకు పరిచయం అయ్యాను. కృష్ణగారికి అసిస్టెంట్‌గా, బ్రహ్మానందం గారితో హాస్యసన్నివేశాల్లో నటించాను. తొలి సినిమాలోనే అలా ప్రముఖులతో కలసి నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం.
రిపోర్టింగ్: బి. జీవన్ రెడ్డి
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)