amp pages | Sakshi

వారఫలాలు

Published on Sun, 04/15/2018 - 00:57

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కుటుంబంలో చికాకులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. సేవా, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులు చేపడతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. నేర్పుగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం కొంత మందగించినా ఉపశమనం కలుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకుంటారు. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. గృహ నిర్మాణం, కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులు సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు సంస్థల ఏర్పాటులో విజయం. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. సోదరులతో వివాదాలు. నేరేడు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు మరింత ఉత్సాహం. పనులలో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కవచ్చు. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో వివాదాలు. ఆరోగ్యభంగం. తెలుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ప్రారంభంలో నెలకొన్న సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి పిలుపు రావచ్చు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారులకు ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగల అవకాశం. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. వివాదాలు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరమైన విషయాలు క్రమేపీ అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో విభేదాలు తొలగి, సంతోషంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ప్రముఖుల పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ పూజలు చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగులకు హోదాలు ఉత్సాహాన్నిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఎంతటి పనైనా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆలో^è నలు అమలు చేస్తారు. ఇంటాబయటా ఎదురుండదు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. వాహనాలు, భూములు కొంటారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. కళారంగం వారికి సత్కారాలు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఆరోగ్య, కుటుంబ సమస్యలు క్రమేపీ తొలగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కోరుకున్న మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలకు మరింత అనుకూల సమయం. వారం ప్రారంభంలో ధనవ్యయం. పసుపు, గులాబి రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనులు నిదానంగా పూర్తి కాగలవు. బంధువుల తాకిడి పెరుగుతుంది. కుటుంబంలో నెలకొన్న చికాకులు క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నా అవసరాలు తీరతాయి.  కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. పారిశ్రామికవర్గాలకు విదేశీ సంస్థల నుంచి పిలుపు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఒత్తిడులు. నేరేడు, లేత నీలం రంగులు. ఉత్తరదిశప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. నలుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకథారాస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అన్నింటా విజయాలే. ఆర్థికంగా బలం చేకూరుతుంది. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. స్థిరాస్తి  విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారి యత్నాలు సఫలం. వారం చివరిలో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం. గులాబి, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో (15 ఏప్రిల్‌ నుంచి  21 ఏప్రిల్, 2018 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈవారం అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరుగుతుంటాయి. చాలా సంతోషంగా ఉంటారు. మీ జీవితాశయాన్ని చేరుకోవడానికి మొదటి అడుగు మీకై మీరే వెయ్యాలని గుర్తుంచుకోండి. మీకు బాగా ఇష్టమైన వాళ్లు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లు గ్రహిస్తారు. ఇది మీలో ఒక రకమైన అశాంతిని రగిలిస్తుంది. అన్నింటినీ మరిచిపోయి ఒక గొప్ప అవకాశాన్ని అందుకోవడానికి కష్టపడండి. ఆలోచనలు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచేలా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : గులాబి 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. జీవితాశయం వైపుకు ఎప్పట్నుంచో అడుగులు వేయాలనుకున్నా అందుకు ఇప్పుడు అన్ని ద్వారాలు తెరుచుకుంటాయి. రాబోయే రోజుల్లో మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే వేదిక దొరుకుతుంది. మీ జీవితాన్ని మలుపుతిప్పే ఓ వ్యక్తిని కలుసుకుంటారు. ప్రేమ జీవితం ఆందోళనకరంగా ఉంటుంది. కొత్తగా మిమ్మల్ని మీరు అన్వేషించుకుంటూ ముందుకు వెళ్లండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.
కలిసివచ్చే రంగు : పర్పుల్‌ 

మిథునం (మే 21 – జూన్‌ 20)
జీవితంలో ఏదో కోల్పోయినట్లు, ఇంక ముందుకు కదల్లేమన్నట్లు మిమ్మల్ని మీరే కట్టేసుకుంటున్నారని తెలుసుకోండి. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దశలో ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని నమ్మి, ఆ దశను దాటొస్తేనే గొప్ప విజయం సొంతమవుతుందని తెలుసుకోండి. మీదైన ప్రతిభ ప్రపంచానికి పరిచయం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. వృత్తి జీవితంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న మీ ఉత్సాహాన్ని ఎప్పుడూ కోల్పోకండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
జీవితాన్ని గొప్పగా మార్చుకోవాలన్నా, చెత్తగా పాడు చేసుకోవాలన్నా అది మీ చేతుల్లోనే ఉంటుందని తెలుసుకోండి. కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా దూరం చేసుకున్నారు. ఇప్పుడు ఆ తప్పులను తల్చుకుంటూ బాధపడుతున్నారు. గతంలో జరిగిన తప్పుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ రాదని నమ్మండి. వృత్తి జీవితంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. 
కలిసివచ్చే రంగు : కాషాయ 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఈవారం ఊహించనంత సంతోషంగా గడుపుతారు. మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే ఓ గొప్ప అవకాశాన్ని సొంతం చేసుకుంటారు. కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. ఆ వ్యక్తికి తక్కువ కాలంలోనే బాగా దగ్గరవుతారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. కొత్త వ్యాపార ఆలోచన ఒకటి చేస్తారు. మీకిష్టమైన పనిని చేయడంలో గొప్ప ఆనందాన్ని పొందుతారు. అనవసర గొడవల్లో జోక్యం చేసుకోకండి. 
కలిసివచ్చే రంగు : గోధుమ 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఈవారమంతా ప్రశాంతంగా గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆత్మవిశ్వాసంతో, విజయంపై ధీమాతో పనిచేయండి. కొన్ని విషయాల్లో ఫలితాలు అందడానికి చాలాకాలం ఎదురుచూడాల్సి వస్తుందని తెలుసుకోండి. మీ చుట్టూ ఉండేవాళ్లలో కొందరు మీ ఆలోచనలను ప్రభావితం చేసే వారున్నారు. వారికి దూరంగా ఉంటూ మీదైన శైలిలో పనిచేసుకుంటూ వెళ్లండి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగానే ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : కాషాయ 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఈవారం అనుకున్న పనులేవీ సజావుగా సాగకుండా చికాకు పెట్టిస్తాయి. ప్రేమ జీవితంలో కూడా ఒడిదుడుకులు అలాగే ఉంటాయి. మీరు ప్రేమించే వ్యక్తిని దగ్గరగా కూర్చోబెట్టుకొని సమస్యలకు పరిష్కారం వెతకండి. ఒకరినొకరు ద్వేషించుకుంటూ వెళితే పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయని తెలుసుకోండి. వృత్తి జీవితం ఎప్పట్లానే బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అన్ని విషయాల్లో అబద్ధాలనే చెప్తూ ఉండే మీరు వాస్తవాన్ని అర్థం చేసుకొని, ఈ అలవాటును పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. 
కలిసివచ్చే రంగు : పీచ్‌ 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
అనుకున్న çపనులు కొన్ని ముందుకు కదలడం లేదంటే చుట్టూ లెక్కలేనన్ని విషయాలు కారణాలై తిరుగుతుంటాయని తెలుసుకోండి. ఆ కారణాలు ఏవైనా, అవన్నీ మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించేవే. పరిస్థితులకు పోరాడి ధైర్యంగా నిలబడితే విజయం మీ వెన్నంటే ఉంటుంది. వృత్తి జీవితంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే వ్యక్తి నుంచి ఒక బహుమతి అందుకుంటారు. 
కలిసివచ్చే రంగు : లేత గోధుమ 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
కొన్ని విషయాలకు, కొందరు మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నది మీకు తెలియాలి. ఎప్పట్నుంచో కలగానే మిగిలిన ఓ కోరిక త్వరలోనే తీరిపోతుంది. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. కొత్త వ్యాపార ఆలోచన ఒకటి చేస్తారు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడాన్ని మానండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. 
కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఒక గొప్ప విజయం కోసం అందరం ఎదురుచూస్తుంటాం. అందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం. అయితే ఈ ప్రయాణాన్ని కూడా ఆస్వాదిస్తేనే జీవితానికి ఒక అర్థం ఉంటుందని తెలుసుకోండి. ఇలాంటి ఒక ఆలోచన మీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. సవాళ్లకు ఎదురెళ్లి నిలబడే ధైర్యాన్ని కూడగట్టుకోండి. అదృష్టం అన్ని వేళలా మీ వెన్నంటే ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ దైవాన్ని చూసే మీ తత్వాన్ని ప్రపంచానికీ పరిచయం చేయండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : బంగారం 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఈవారమంతా మీరు కోరుకున్నట్లుగానే ప్రశాంతంగా సాగిపోతుంది. గతాన్ని గురించి ఎంత ఆలోచించినా ఉపయోగం లేదన్నది తెలుసుకోండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. అయినప్పటికీ సమస్యలన్నింటికీ ఎదురు నిలబడి మీకిష్టమైన వ్యక్తికి దగ్గరవుతారు. ఆత్మవిశ్వాసమే మీ ఆయుధమన్నది బలంగా నమ్మండి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఒక గొప్ప అవకాశం వారం చివర్లో మీ తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. 
కలిసివచ్చే రంగు : లేత నీలం 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
జీవితమంతా ఒక దగ్గర ఆగిపోయినట్టు, ఇంక ఇదే ఆఖరు అన్నట్టు కొన్నాళ్లుగా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు తయారయ్యాయి. ఆ పరిస్థితులు మారేందుకు వేసే మొదటి అడుగు ఈవారమే తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో మీరు కలలుగన్న ఒక కొత్త జీవితం వైపుకు ప్రయాణిస్తారు. మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తి ఇచ్చే సలహాలను పాటించండి. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. విహారయాత్రకు వెళతారు.
కలిసివచ్చే రంగు : నీలం 
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)