amp pages | Sakshi

టేలర్‌ కుమార్‌గారి టైమ్‌ ఆటో!

Published on Sun, 06/03/2018 - 00:04

‘‘టైమ్‌ ఆటో... టైమ్‌ ఆటో’’ చౌరస్తాలో తన ఆటో పక్కన నిల్చొని అరుస్తున్నాడు ఎలిజబెత్‌ టేలర్‌ కుమార్‌. ఈయన పేరు గురించి కొద్దిగా చెప్పుకుందాం...టేలర్‌ కుమార్‌ తండ్రి టెక్కు సోమలింగం... హాలీవుడ్‌ అందాల రాశి ఎలిజబెత్‌ టేలర్‌కు వీరాభిమాని. తనకు కూతురు పుడితే ‘ఎలిజబెత్‌ టేలర్‌’ అని పేరు పెడతానని శపథం చేశాడు. కానీకొడుకు పుట్టాడు. అయినప్పటికీ... ఎలిజబెత్‌ టేలర్‌ చివర కుమార్‌ అని చేర్చి తన శపథం నెరవేర్చుకున్నాడు.ఇప్పుడు మళ్లీ ‘టైమ్‌ ఆటో’ దగ్గరికి వద్దాం.‘‘కొత్తగా ఈ టైమ్‌ ట్రావెల్‌ ఆటో ఏందిరో... అంటే ఎక్కడా లేట్‌ చేయకుండా టైమ్‌కు తీసుకెళ్లే ఆటోనా ఏంది?’’ బుర్రగోక్కుంటూ టేలర్‌ కుమార్‌ను అడిగాడు టీస్టాల్‌ నర్సింగ్‌.‘‘ఆ మాత్రం దానికి ఇంతలా అరుస్తానా? నా ఆటో గొప్పదనం ఏమిటంటే... ఇది ఎక్కి గతంలోకి వెళ్లవచ్చు... ఫ్యూచర్‌లోకి వెళ్లవచ్చు. అమీర్‌పేట, పంజగుట్ట, ఎర్రమంజిల్‌... ఇలా రకరకాల స్టాప్‌లు ఉన్నట్లే... నా ఆటోలో సంవత్సరాల పేరుతో స్టాప్‌లు ఉంటాయి. గతంలోకి వెళితే 1920, 1930, 1940... ఇలా ఉంటాయి. ఫ్యూచర్‌లోకి వెళితే... 2019, 2020, 2040... ఇలా ఉంటాయన్నమాట... మీ ఛాయిస్‌ని బట్టి అక్కడికి నా ఆటోలో తీసుకెళతాను’’ వివరించాడు టేలర్‌ కుమార్‌.

‘‘పొద్దుగాల పొద్దుగాల షెవుల పూలు బెడుతున్నవుగదనే!’’ అని పెద్దగా నవ్వాడు నర్సింగ్‌.‘టైమ్‌ ఆటో... టైమ్‌ ఆటో’ అని రోజూ టేలర్‌ కుమార్‌ అరుస్తున్నాడేగానీ అతన్ని ఎవరూ  సీరియస్‌గా తీసుకోవడం లేదు. టేలర్‌ ఆటో అందరికీ వినోదంగా మారింది. అలాంటి రోజుల్లో ఒకరోజు...తన కారులో అటుగా వెళుతున్న ప్రఖ్యాత పారిశ్రామికవేత్త సీఆర్‌డీ కాటా, టేలర్‌ అరుపులను విని, ‘‘డ్రైవర్,,,, కారు ఒక పక్కకు ఆపు’’ అన్నాడు.  కారును ఒక పక్కన పార్క్‌ చేసిన తరువాత అతడి  ముందు నిల్చున్నాడు కాటా. అయిదారు నిమిషాల తరువాత ‘‘నీ ఆటో ఎక్కుతున్నాను పదా’’ అన్నాడు. టేలర్‌ కుమార్‌ ఆనందానికి హద్దులు లేవు. ఈలోపు ఒకడు వచ్చి...‘‘సార్‌ ఈ వెర్రివాడి మాటలు నమ్మకండి’’ అన్నాడు.‘‘వెర్రిమాటలు కాదు... వీడి కళ్లలో ఏదో నిజా/తీ కనిపిస్తుంది’’ అంటూ ఆటో ఎక్కాడు కాటా.‘‘ ఏ స్టాప్‌కు తీసుకెళ్లమంటారు సార్‌?’’ అడిగాడు టేలర్‌. ‘‘కొద్దిసేపు ఆలోచించి చెబుతాను’’ అని ఆలోచించడం మొదలు పెట్టాడు కాటా.

సీఆర్‌డీ కాటా మరోపారిశ్రామికవేత్త బీఆర్‌డీ బీటాతో కలిసి కొత్తగా కొన్ని వ్యాపారాల్లోకి దిగాడు.అయితే, బీటా నమ్మదగిన వ్యక్తి కాదని.... మోసగాడని చాలామంది కాటాతో చెప్పారు.కానీ ఆయన వాటిని సీరియస్‌గా తీసుకోలేదు.‘‘నేనే పెద్ద మోసగాడిని.... నన్ను మోసం చేసేవాడు ఇంతవరకు పుట్టలేదు’’ అంటుండేవాడు కాటా.నిజమే. ఒకప్పుడు బూట్‌పాలిష్‌ చేసుకొని బతికే కాటప్ప... ఆ తరువాత రౌడీయిజంలోకి దిగి ‘కాటన్న’ అయ్యాడు. ఆ తరువాత ఎన్నో భూకబ్జాలు చేశాడు... ఎంతో మందిని మోసం చేసి కోటీశ్వరుడిగా ఎదిగి తన పేరును ‘సీఆర్‌డీ కాటా’గా స్టయిలిష్‌గా మార్చుకున్నాడు. కాటాకు తెలియని మోసం అంటూ లేదు...అందుకే అంటాడు...‘‘నన్ను మోసం చేసేవాడు ఇంతవరకు పుట్టలేదు’’ అని. అలాంటి కాటాకు తన ఫ్యూచర్‌ చూడాలనిపించింది.‘‘వచ్చే సంవత్సరానికల్లా... మన వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతుంది’’ అని బీటా అన్నమాట గుర్తుకు వచ్చింది. వెంటనే...‘‘2019 స్టాప్‌కు తీసుకువెళ్లు’’ అన్నాడు కాటా.‘‘అలాగే’’ అంటూ ఆటోను స్టార్ట్‌ చేశాడు టేలర్‌ కుమార్‌.

2019 సంవత్సరం. మే నెల.సమయం: ఉదయం పదకొండు గంటలు.స్థలం: ఎర్రగడ్డ, రైతు బజారు.ఆటో దిగి రైతు బజార్లోకి నడిచాడు కాటా. అక్కడ ఒక మూల ఒక వ్యక్తి మూడు బుట్టల్లో  పువ్వులు, ఆరు బుట్టల్లో  మామిడికాయలు ముందు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు.‘పువ్వులు పువ్వులోయ్‌... కాయలు కాయలోయ్‌’ అని అరుస్తున్నాడు.ఆ వ్యక్తి ఎవరో కాదు... తనే!‘అంటే 2019లో నా పొజిషన్‌ ఇదన్నమాట. మూడు పువ్వులు ఆరు కాయలు అంటే ఏమిటో అనుకున్నా... ఇప్పుడు అర్థమైంది’ అంటూ  కోపంతో పళ్లుపటపటా కొరికాడు  కాటా.తన డైరీ తెరిచి...‘వెనక్కి వెళ్లగానే... ఆ బీటా గాడి పని పట్టాలి’ అని రెడ్‌ స్కెచ్‌ పెన్‌తో పెద్ద పెద్ద అక్షరాల్లో రాసుకున్నాడు. ఎందుకో ఆ సమయంలో ఒకసారి నాస్టాల్జియా గాలి అతడిని సోకింది.‘గతంలోకి... అందులోనూ... తాను కొత్తగా హైదరాబాద్‌కు వచ్చిన రోజుల దగ్గరికి వెళ్లాలనిపించింది. 2000 సంవత్సరం డిసెంబర్‌లోకి తీసుకెళ్లు’’ అన్నాడు.‘‘మరో లచ్చరూపాయలు ఖర్చు అవుతుందండీ’’ అన్నాడు టేలర్‌ కుమార్‌.‘‘లచ్చగాకుంటే... రెండు లచ్చలు  తీసుకో’’ అన్నాడు కాటా. ఆటోను 2000 సంవత్సరం స్టాప్‌లోకి తీసుకెళ్లాడు టేలర్‌ కుమార్‌.సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ముందు...‘‘పాలీష్‌... బూట్‌ పాలీష్‌... తళతళ మెరిసే పాలీష్‌’ అని అరుస్తున్నాడు బక్కపల్చటి కుర్రాడు కాటప్ప. ‘‘అటు చూడు కుమార్‌.... ఒకప్పుడు నేను అలా ఉండేవాడిని. జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చాను. ఐయామ్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ మై సెల్ఫ్‌’’ అంటూ కర్చీప్‌తో కన్నీళ్లు తుడుచుకున్నాడు కాటా. కొద్దిసేపటి తరువాత... ‘‘ఆలస్యం చేయకుండా 2018 స్టాప్‌కి తీసుకెళ్లు. ఆ బీటాగాడి పని పట్టాలి’’ అన్నాడు పిడికిలి బిగిస్తూ కాటా. ఆటో స్టార్ట్‌ చేశాడు టేలర్‌. డుర్ర్‌ర్ర్‌ర్ర్‌... అని సౌండ్‌ వస్తుందేగానీ ఆటో ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు.‘‘ఏమైంది?’’ ఆందోళనగా అడిగాడు కాటా.‘‘ ఇది సెకండ్‌హ్యాండ్‌ టైమ్‌మిషన్‌ పార్టులతో తయారుచేసిన ఆటో అండీ. ఎప్పుడు కదులుతుందో ఏమో’’ అని తలపట్టుకున్నాడు టేలర్‌ కుమార్‌.‘ఓరీ నీ యబ్బా కడుపు మాడా, టైమ్‌ మిషన్‌లలో కూడా ఫస్ట్‌హ్యాండ్‌ సెకండ్‌హ్యాండ్‌ ఉంటాయా!!! .... ఇంతకీ మనం ముందుకు వెళతామంటావా?’’ అని ఆందోళనగా అడిగాడు కాటా.‘మన టైమ్‌ బాగుంటే కచ్చితంగా వెళతామండి... లేకుంటే కచ్చితంగా ఇక్కడే ఉంటామండి’’ అని వినయంగా బదులిచ్చాడు ఎలిజబెత్‌ టేలర్‌ కుమార్‌!
– యాకుబ్‌ పాషా 

#

Tags

Videos

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)