amp pages | Sakshi

సీతాకోక పూలు

Published on Sat, 04/23/2016 - 21:55

ఇంటికి - ఒంటికి
‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున...  లిప్‌స్టిక్ పెదాలకే ఎందుకు వేసుకోవాలి అని అడుగుతాడు. పెదాలకి మాత్రమే వేసుకోవాలని చివరకు డిసైడ్ చేస్తాడు. మరి నెయిల్ పాలిష్ కూడా అంతేనా గోళ్లకు మాత్రమే వేసుకోవాలా? అది కేవలం అందుకే పనికొస్తుందా? లేదు. నెయిల్ పాలిష్ గోళ్లకు మాత్రమే కాదు... మన ఇంటికి కూడా అందాన్ని తెస్తుంది. ఎలా అంటారా... ఒక్కసారి పక్కనున్న ఫొటోలపై ఓ లుక్కేయండి. అవన్నీ నెయిల్ పాలిష్‌తో చేసినవే. ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ నుంచి ఒంటికి పెట్టుకునే ఫ్యాషన్ జ్యూయెలరీ వరకు అన్నింటికీ నెయిల్ పాలిష్ హంగును అద్దారు. కావాలంటే ఇవన్నీ మీరు కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే...
 
కావలసినవి: సులువుగా వంకులు తిరిగే సన్నని వైరు, రంగు రంగుల నెయిల్ పాలిష్‌లు (కొంచెం చిక్కబడినవి. అలాంటివి లేక పోతే నెయిల్ పాలిష్ సీసా మూత తీసి గాలి తగిలేలా పెడితే చిక్క బడుతుంది), క్విక్ డ్రై నెయిల్ పాలిష్ స్ప్రే (మార్కెట్లో దొరుకుతుంది; లేకున్నా ఫర్వాలేదు), కత్తెర, పెన్ లేదా సన్నని రాడ్, పట్టకారు
 
తయారీ విధానం: ముందుగా తీగను పెన్ లేదా రాడ్‌కు చుట్టాలి. అది ఒక పూరేకులాగా అవుతుంది. పెన్/రాడ్‌ను రింగ్ లోంచి బయటికి తీసేసి, ఆ రేకుకు పక్కనే మరో రేకులా చేయాలి. ఇలా తీగను తిప్పుకుంటూ పక్కపక్కనే అయిదు రేకులు వచ్చేలా చేసు కుని, దాన్ని పువ్వు ఆకారంలోకి తీసుకురావాలి. తర్వాత నెయిల్ పాలిష్‌ను తీగల మీద పూసుకుంటూ పోవాలి.

మొదట పలుచగా ఉన్నా కాసేపటికి దళసరి అవుతుంది. అప్పుడు దానిపై డ్రై నెయిల్ పాలిష్ స్ప్రే చల్లాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత, మళ్లీ రెండో కోటింగ్ వేస్తే రంగు బాగా కనిపిస్తుంది. ఇలా రంగురంగుల పూలు చేసు కుని వాటితో నెక్లెస్‌లు, బ్రేస్‌లెట్లు, ఉంగరాలు, హెయిర్ క్లిప్పులు చేసుకో వచ్చు. పూలగుత్తులు చేసుకుని ఫ్లవర్‌వాజుల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడిదో ఫ్యాషన్. మీరూ దీన్ని అనుసరించి చూడండి!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)