amp pages | Sakshi

మిమ్మల్ని ‘బుట్ట’లో వేసేస్తుంది!

Published on Sun, 07/27/2014 - 00:38

ఈసారి మీరు షాప్‌కి వెళ్లినప్పుడు... ‘చెఫ్ బాస్కెట్’ ఇవ్వమని అడగండి. ఒక స్టీలు బుట్టను మీ చేతిలో పెడ తారు. చూడ్డానికి ఇది మామూలు బుట్టలానే అనిపిస్తుంది కానీ... దీని వల్ల ఉన్న ఉపయోగాలేమిటో తెలిస్తే మీరు బుట్టలో పడిపోతారు. దాన్ని వెంటనే కొనేస్తారు.
 
కజ్జికాయలు, గవ్వలు, చిప్స్, ఫింగర్ చిప్స్ లాంటి వాటిని నూనెలో డీప్ ఫ్రై చేస్తాం కదా! వాటిని కడాయిలోంచి తీసేటప్పుడు బోలెడంత నూనె వచ్చేస్తూ ఉంటుంది. అవి తింటే మన గుండెకు మనమే స్పాట్ పెట్టుకున్నట్టు అవుతుంది. పైగా నూనె కూడా బాగా వృథా అయిపోతుంది. అందుకే ఈ చెఫ్ బాస్కెట్ ఇంట్లో ఉండి తీరాలి. వేయించాలనుకున్నవాటిని ఈ బుట్టలో వేసి, నూనె వేసిన కడాయిలో ఉంచాలి. వేగాక తీసేటప్పుడు పెద్దగా నూనె రాదు. బుట్టని కాసేపు ఏదైనా గిన్నె మీద పెడితే... అంటుకున్న కాస్తో కూస్తో నూనె కూడా కారిపోతుంది. పదార్థాలు పొడిగా ఉంటాయి. నూనె కూడా ఆదా!

 ఈ చెఫ్ బాస్కెట్‌తో మరో రెండు ఉపయోగాలున్నాయి. స్టాండులా మార్చి పండ్లు, కూరగాయలు దాచుకోవచ్చు... ఆవిరి మీద కూరగాయలవీ ఉడికించుకోవచ్చు (ఫొటోలు 1,2). ఉపయోగించనప్పుడు శుభ్రంగా కడిగి, చక్కగా మడత పెట్టేసి దాచేసుకోవచ్చు (ఫొటో3). ఇన్ని ఉపయోగాలున్నాయి కదా అని ధర బోలెడంత ఉంటుందని భయపడక్కర్లేదు. కేవలం 150 రూపాయలకే వచ్చేస్తుంది. ఆన్‌లైన్లో అయితే రూ. 100 లోపే!

Videos

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)