amp pages | Sakshi

ఉదయ శ్రీ కోసం..

Published on Mon, 02/23/2015 - 01:16

 ఆదివారం సాయంత్రం.. కూకట్‌పల్లి మంజీర మాల్.. ఎవరి షాపింగ్‌లో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో రాక్ బ్యాండ్ రేంజ్‌లో మ్యూజిక్
 స్టార్టయింది. అప్పటి వరకూ.. ఎవరికెవరూ సంబంధం లేదన్నట్టున్న యువతీ యువకులంతా ఒకే చోటికి చేరుకున్నారు. మ్యూజిక్‌కు తగ్గట్టుగా స్టెప్పులు వేయడం మొదలుపెట్టారు. ఈ తంతు చూసి పుర్రెకో బుద్ధి అని అనుకున్న వారంతా.. వాళ్లు వేస్తున్న చిందుల వెనుక అసలు కారణం  తెలుసుకుని కరతాళ ధ్వనులతో సపోర్ట్ గా నిలిచారు.
- శిరీష చల్లపల్లి

 ఉదయ శ్రీ కోసం..
 ప్లాష్ మాబ్.. సిటీకి కొన్నేళ్ల కిందట పరిచయమైంది. షాపింగ్ మాల్స్, మల్లీప్లెక్స్‌లు, క్రాస్‌రోడ్స్‌లో.. ఉన్నట్టుండి ఓ బృందం ఊడిపడుతుంది. ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు ఊగిపోతుంది. అదిరిపోయే ఆటపాటలతో టెంపరేచర్ హీట్ చేస్తుంది. ఒకప్పుడు
 సరదాగా కాసేపు నిర్వహించే ఈ ఈవెంట్‌కు సోషల్ రెస్పాన్సిబిలిటీ యాడ్ చేస్తోంది సిటీ యూత్. అలాంటి థీమ్‌తో పుట్టిందే
 ఆస్యా ఫౌండేషన్.

 సోషల్ పబ్లిసిటీ..
 ఈ ఫౌండేషన్ సూత్రధారి శ్రీరామ్.. శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థి. ఏడాది కిందట అదే కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని అనారోగ్యం పాలైంది. ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉన్న ఆ కుటుంబం దేవుడిదే భారం అనుకుంది. ఇది తెలిసిన శ్రీరామ్.. ఆస్యా ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. సోషల్ మీడియా ద్వారా తన స్నేహితులకు, తెలిసిన వారికి విషయాన్ని చేరవేశాడు. అందరినీ ఒకే వేదికపైకి తెచ్చి ప్లాష్ మాబ్ నిర్వహించాడు. వీరి ఆటపాటలు.. అంతకన్నా దాని వెనుకున్న అసలు నిజం తెలిసిన ఎందరో తోచిన సాయం చేశారు. ఆ మొత్తాన్ని ఆ  అమ్మాయికి అందజేశాడు. ఏడాదిగా 23 ఈవెంట్లు నిర్వహించిన ఆస్యా ఫౌండేషన్ ఆరుగురి ప్రాణాలకు అండగా నిలిచింది.

ఇన్వెస్ట్ ఎబిలిటీ..
18 నెలల పాప నిండు ప్రాణాన్ని కాపాడేందుకు తమ ఎబిలిటీని నమ్ముకుని మంజీర మాల్‌లో డ్యాన్స్ ఈవెంట్ నిర్వహించింది శ్రీరామ్ అండ్ కో. మెదక్ జిల్లాకు చెందిన ఉదయశ్రీ కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆ చిన్నారి తండ్రి సాయిలు చిరుద్యోగి. పాప వైద్యానికి రూ.ఏడు లక్షలు అవుతాయని డాక్టర్లు చెప్పారు. తల తాకట్టు పెట్టి రెండు లక్షలు వరకూ ఖర్చు చేసి వైద్యం చేయించాడు. మరో ఐదు లక్షలు కావాలి.. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇదే సమయంలో ఆ చిన్నారి పరిస్థితి తెలిసిన శ్రీరామ్.. ఫ్లాష్‌మాబ్‌కు సిద్ధమయ్యాడు.

సోషల్ మీడియా ప్రచారంతో..  పలు ఇంజినీరింగ్  కాలేజీల విద్యార్థులతో పాటు ఐటీ ఉద్యోగులు, ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ కూడా ఈ  గ్రూప్‌నకు వెన్నుదన్నుగా పదం కదిపారు. హీరో నందు, భాయ్, పూలరంగడు డెరైక్టర్ వీరభద్రం కూడా దీనికి హాజరై సపోర్ట్‌గా నిలిచారు. ఈ ఈవెంట్‌కు ఒక యాక్టర్‌గా కాకుండా మనసున్న మనిషిగా హాజరయ్యానన్నాడు హీరో నందు.  ఆ పాపకు హెల్ప్ చేయాల్సిందిగా తనూ ప్రచారం చేస్తానని చెప్పాడు. ఉదయ శ్రీ తండ్రికి కొంత మొత్తాన్ని కూడా అందజేశాడు.

 సోషల్ రెస్పాన్సిబిలిటీ..
 కొన్ని రోజుల కిందట బీవీఆర్‌ఐటీ విద్యార్థులతో సైకిల్ రైడింగ్ కూడా నిర్వహించి రూ.35 వేలు సేకరించి.. ఉదయ శ్రీ తండ్రికి అందజేసింది ఆస్యా ఫౌండేషన్. మళ్లీ వైద్యానికి డబ్బులు  అవసరం అవడంతో.. ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ‘మా టీమ్‌లో 15 మంది ఉన్నాం.. కల్చరల్ డ్యాన్స్‌తో పాటు కామెడీ స్కిట్స్ కూడా చేశాం. ఓ మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు సంతోషంగా ఉంద’ని బీవీఆర్ ఐటీ విద్యార్థిని జాహ్నవి తెలిపింది. ఆస్యా ఫౌండేషన్ కేవలం సిటీకే పరిమితం కాలేదు. పల్లెలు, తండాలకు వెళ్తోంది. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తోంది. ఉచిత వైద్య శిబిరాలనూ నిర్వహిస్తోంది.  సమాజహితమే మార్గంగా ఎంచుకున్న ఆస్యా ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుందాం.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)