amp pages | Sakshi

కోరిక తీరిస్తేనే ఆకలి తీరేది!

Published on Mon, 03/12/2018 - 00:46

మానవ జాతి మీదే వెగటు పుట్టించే దారుణం ఇది. నిత్యం అంతర్యుద్ధంతో రక్తం ఓడుతున్న సిరియాలో.. కుటుంబం ఆకలి తీర్చేందుకు సరుకులకోసం సహాయక కేంద్రాలకు వెళుతున్న మహిళలపై కూడా లైంగిక దోపిడీ జరుగుతోంది! ‘నా కోరిక తీరిస్తే నీ కుటుంబం ఆకలి తీరుస్తా’నని దళారులు బేరం పెట్టడాన్ని ఐక్యరాజ్యసమితి సైతం నివ్వెరపోయి చూస్తోంది.

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) కబంధ హస్తాల నుంచి విముక్తమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సిరియాలో ఇప్పటికీ మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. నేటికీ అక్కడ కొనసాగుతున్న అంతర్యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో  వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి అందే మానవతా సహాయానికి ‘ప్రతిఫలం’గా మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నట్టుగా తాజాగా వెలుగులోకి వచ్చింది!

ఉప్పుకీ పప్పుకీ లైంగిక దోపిడీ!
ఐరాస, ఇతర అంతర్జాతీయ సేవా  సంస్థలు సిరియాకు వివిధ రూపాల్లో ఇచ్చే ఉచిత సహాయం పొందేందుకు మధ్యదళారులకు ఆ దేశ యువతులు, బాలికలు తమను తాను సమర్పించుకోవాల్సిన అమానవీయ స్థితి ఏర్పడింది! సిరియాలో కొన్ని ప్రాంతాల్లో  ఇంకా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున అక్కడకు స్వచ్ఛంద సేవా సంస్థల సిబ్బంది చేరుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఐరాస, ఇతర సంస్థలిచ్చే సహాయాన్ని బాధితులకు చేరవేసే బాధ్యతను∙మధ్యదళారులు, స్థానిక అధికారులకు అప్పగిస్తున్నారు. యుద్ధ బీభత్సం కొనసాగుతున్న  కారణంగా అక్కడి ప్రజలు.. ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలకు పూట కింత తిండితో పాటు కనీస నిత్యావసరాలు దొరకని స్థితి ఏర్పడింది. 

దీనిని అవకాశంగా తీసుకుని స్థానిక అధికారులు, మధ్యదళారి సంస్థల ప్రతినిధులు తాము అందించే సహాయానికి ప్రతిగా ఆ యువతులు తమ లైంగిక వాంఛను తీర్చేలా ఒత్తిడి తెస్తున్నారు! అందుకు అంగీకరించని బాధితులకు ఈ సహాయం అందకుండా నిలిపేస్తున్నారని, తమ దారికి వచ్చిన వారికే వాటిని ఇస్తున్నట్టుగా బీబీసీ  వెల్లడించింది. ఇలాంటి వేధింపులు, ఉల్లంఘనలు జరుగుతున్నట్టుగా మూడేళ్ల క్రితమే హెచ్చరికలొచ్చాయి. అయినా సిరియాలోని దక్షిణ ప్రాంతంలో నేటికీ ఇవి కొనసాగుతున్నాయని తాజా నివేదికలో వెల్లడైంది.

వెళ్లడానికే జంకుతున్నారు..!
సిరియాలో ఇలాంటి అనైతిక కార్యకలాపాలు పెచ్చు మీరడంతో అంతర్జాతీయ సేవా సంస్థల ద్వారా ఉచితంగా అందే సహాయాన్ని  తీసుకునేందుకు కూడా మహిళలు జంకుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో ఈ అమానవీయ పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఈ సహాయ కేంద్రాలకు వెళ్లేందుకు అక్కడి మహిళలు నిరాకరిస్తున్నట్టు  స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు బీబీసీకి వెల్లడించారు.అక్కడి మగవారి కోరికలను తీర్చాకే  ఈ సంస్థలిచ్చే సహాయాన్ని తాము  వెంట తెచ్చుకున్నామని ఇతరులు భావించే అవకాశమున్నందున ఈ సరఫరా కేంద్రాలకు వెళ్లడం లేదని కొందరు యువతులు తెలిపారు. ఇలాంటి అకృత్యాలు సాగుతున్నా కొన్ని స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోవడం లేదని ఓ ఉద్యోగి పేర్కొన్నాడు. సిరియాలో గవర్నర్ల పాలనలోని వివిధ ప్రాంతాల్లో మానవతా సహాయానికి ప్రతిగా లైంగిక దోపిడీ సాగుతున్నట్టుగా గత ఏడాదే ఐరాస జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) పరిశీలనలో తేలింది.

నివారణకు ఐరాస ప్రయత్నాలు
దక్షిణ సిరియాలో మహిళలు లైంగిక వేధింపులు, దోపిడీకి గురవుతున్నారనే  ఆరోపణలపై  యూఎన్‌ఎఫ్‌పీఏ, ఆక్స్‌ఫామ్‌ ప్రతినిధులు స్పందిస్తూ తాము స్థానిక కౌన్సిళ్ల ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని స్పష్టం చేశాయి. తమ కార్యకలాపాలు నెరపుతున్న రెండు స్వచ్ఛంద సంస్థలపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని యూఎన్‌ఎఫ్‌పీఏ తెలిపింది.

ఇలాంటి ఘటనల నివారణకు కొత్త విధానాలు ప్రవేశపెట్టినట్టు, ఎప్పటికప్పుడు ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు స్థానిక భాగస్వామ్య సంస్థలకు అవసరమైన శిక్షణనిస్తున్నట్టు ఐరాస శరణార్థుల హైకమిషనర్‌ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) ప్రతినిధి పేర్కొన్నారు.

ఆహారం కోసం స్వల్పకాల వివాహాలు!
‘‘స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే రోజువారి ఆహారం కోసం  యువతులు, అమ్మాయిలు పరిమిత కాలానికి వివాహాలు చేసుకుని అక్కడి అధికారులకు ‘సెక్సువల్‌ సర్వీసెస్‌’ అందిస్తున్నారు. సహాయాన్ని అందుకునేందుకు వచ్చే వారి ఫోన్‌ నెంబర్లు తీసుకోవడంతో పాటు వారిని ఇంటివరకు వాహనాల్లో వదిలిపెడుతున్నారు. తాము అందజేస్తున్న సహాయాలకు ప్రతిగా అధికారులు, ప్రతినిధులు కోరిక తీర్చుకుంటున్నారు’’ అని వాయిస్‌ ఫ్రం సిరియా 2018 నివేదిక వెల్లడించింది.

పురుషుల పరిరక్షణలో లేని మహిళలు, అమ్మాయిలతో పాటు భర్తను కోల్పోయిన, విడాకులు తీసుకున్న వారి పరిస్థితి మరింత అధ్వాన్నం అని పేర్కొంది. జోర్డన్‌లోని ఓ శరణార్థుల శిబిరంలో సిరియా మహిళ బృందం ఇలాంటి లైంగికదాడులకు గురైనట్లు మూడేళ్ల క్రితం మొదటిసారి బయటపడింది. దారా, క్యునీత్ర తదితర ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై తాను జరిపిన పరిశీలనల్లో ఇది యధార్థమేనని తేలిందని స్వచ్ఛంద సహాయ సలహాదారు డానియల్‌ స్పెన్సర్‌ తెలిపారు.


                                   ( నిర్బంధ వివాహ బాధితులు )

– కె.రాహుల్, సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)