amp pages | Sakshi

దొంగను పట్టేశారు

Published on Fri, 06/29/2018 - 01:02

జీన్స్, టీ షర్ట్, స్కూటీ, మెడలో ఓ స్లిమ్‌ బ్యాగ్‌ లేదా హెవీగా బ్యాక్‌ప్యాక్‌... ఇదీ ఈ తరం కాలేజీ అమ్మాయిల డ్రెసింగ్‌. ఇలాంటి అమ్మాయిలే పూనమ్‌ శరణ్, జ్యోతి చౌహాన్‌లు. వీళ్లను చూసిన ఓ జేబుదొంగకు ‘వీళ్లేంటి ఆఫ్‌ట్రాల్‌ అమ్మాయిలే కదా’ అనుకున్నాడు. ‘మేము అమ్మాయిలమే కానీ, ఆఫ్‌ట్రాల్‌ అమ్మాయిలం కాదు’ అని నిరూపించారీ ఇద్దరమ్మాయిలు.

వీళ్ల ధైర్యం, తెగువ, సమయస్ఫూర్తికి అల్వార్‌ జిల్లా ఎస్‌పీ కూడా ముచ్చటపడ్డాడు. వాళ్లను పోలీస్‌ స్టేషన్‌కి పిలిపించి ఇద్దరికీ పూలబొకేలు ఇచ్చి మరీ అభినందించారు. చెరో వెయ్యి రూపాయలిస్తూ... ‘ఆడపిల్లలు ఇలా ఉంటే సమాజంలో సమస్యలు అన్నీ వాటికవే సర్దుకుంటాయి. ఆకతాయిలు, చిల్లర దొంగలకు మీరొక పాఠం కావాలి. దొంగతనం చేయాలని చాచిన చేతులు మిమ్మల్ని చూసి జంకుతో వెనక్కి వెళ్లిపోవాలి’ అంటూ అమ్మాయిలను ప్రశంసల్లో ముంచెత్తారు.

వాళ్లు చేసిందేమిటి?
అది రాజస్తాన్‌లోని ఆల్వార్‌ నగరం. పూనమ్‌ శరణ్, జ్యోతి చౌహాన్‌ గడచిన శనివారం సాయంత్రం కోచింగ్‌ సెంటర్‌ నుంచి స్కూటీ మీద ఇంటికి వెళ్తున్నారు. పూనమ్‌ బండి నడుపుతోంది, జ్యోతి వెనుక ఉంది. ఒక ఆకతాయి బైక్‌ మీద వీళ్లను వెంబడించాడు. స్కూటీకి దగ్గరగా వచ్చి జ్యోతి చేతిలోని స్మార్ట్‌ ఫోన్‌ లాక్కుని తన బైక్‌ వేగం పెంచి ముందుకు వెళ్లిపోయాడు. క్షణకాలంలోనే తేరుకున్నారీ అమ్మాయిలు.

దొంగతనం జరినట్లు చుట్టు పక్కల వాళ్ల దృష్టిలో పడేటట్లు పెద్దగా అరుస్తూనే అతడి బైక్‌ను అనుసరించారు. బైక్‌ మీదున్న వ్యక్తిని రెండు కిలోమీటర్ల దూరం వెంబడించారు. జిడి గర్ల్స్‌ కాలేజ్‌ రోడ్డులోకి వెళ్లింది బైక్‌. కాలేజ్‌ దగ్గర ఆ రోడ్డు ఎండ్‌ అవుతుంది. డెడ్‌ఎండ్‌ కారణంగా బైక్‌ ముందుకు వెళ్లడానికి దారి లేదు, వెనక్కు తిరగడానికి వీల్లేకుండా స్థానిక ఇళ్లలోని వాళ్లంతా గుమిగూడిపోయారు. వాళ్లలో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేటప్పటికే ఆ అమ్మాయిలు స్థానికుల సహాయంతో బైక్‌ మీదున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

పౌరులే పోలీసులు
ఇదంతా తెలుసుకున్న జిల్లా ఎస్‌పీ రాహుల్‌ ప్రకాశ్‌... ఫోన్‌ అపహరణకు పాల్పడిన ఇక్బాల్‌ను అదుపులోకి తీసుకుని... పూనమ్, జ్యోతిల ధైర్యసాహసాలకు గాను వారిని స్టేషన్‌కి పిలిపించి ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి చొరవ తీసుకోవాలని చెప్పారు రాహుల్‌ ప్రకాశ్‌. ప్రతి ఒక్కరిలో పోలీస్‌ ఉంటాడు. తమలోని పోలీసింగ్‌ నైపుణ్యాన్ని నిద్రపుచ్చకుండా చైతన్యంగా ఉంచుకోవాలి. నిజానికి పౌరులే మంచి పోలీసులు. ఈ అమ్మాయిలు చూపించిన ధైర్యం, చొరవ ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి’ అని సందేశమిచ్చారు.  
– మంజీర

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌