amp pages | Sakshi

'ఈ'మ్యూజియానికి 'ఆ' గుర్తింపు

Published on Mon, 06/02/2014 - 23:01

తాజాగా...
 
ఢిల్లీ సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్స్‌లోకి ఒకసారి అడుగు పెడితే చాలు...టాయిలెట్లకు సంబంధించి 4,500ల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర కళ్లకు కడుతుంది. ఈరకమైన మ్యూజియం ప్రపంచంలో ఎక్కడా లేదు. తాజాగా టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలో పది భిన్నమైన మ్యూజియం’ జాబితాలో సులభ్ మ్యూజియం చోటు చేసుకుంది.

 1992లో నిర్మించిన ఈ మ్యూజియానికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది.విదేశీ పర్యాటకులు, విద్యార్థులకు ఇదొక ప్రధాన ఆకర్షణగా మారింది. రకరకాల వింత ఆకారాలలో ఉన్న టాయిలెట్లతో పాటు ఎలక్ట్రికల్, సోలార్ మోడల్ టాయిలెట్లు కూడా మ్యూజియంలో ఉన్నాయి.

 ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డ్ డావిన్సి గీసిన ఫ్లష్ టాయ్‌లెట్ స్కెచ్‌లు మరో ఆకర్షణ. ‘టాయ్‌లెట్స్ మ్యానర్స్’ అంటే ఏమిటో కూడా ఈ మ్యూజియాన్ని దర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వస్తువులు చేర్చడం ఈ మ్యూజియం ప్రత్యేకత.

 ఫతేపూర్ సిక్రి, అంబర్ ఫోర్ట్, గోల్కోండ ఫోర్ట్‌లలో తొలిరోజులలో, హరప్పా నాగరికత కాలంలో మరుగుదొడ్లు ఎలా ఉండేవో కూడా ఈ మ్యూజియంలో కొలువు తీరిన ఛాయాచిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు.

 ‘‘నాగరిక సమాజాలలో మరుగుదొడ్లు అనేవి శుభ్రతకు సంబంధించిన ముఖ్య సాధనాలుగా ఉండేవి. మరుగుదొడ్ల గురించి మాట్లాడుకోవడం ఏమిటి? అనే స్థాయి నుంచి వాటి గురించి పూర్తి స్థాయిలో మాట్లాడుకునే పరిస్థితి కలిపించడానికే ఈ ప్రయత్నం చేశాను. మరుగుదొడ్ల మీద మరింత అవగాహన పెంచడానికి, రకరకాల ప్రశ్నలు మదిలో మొలకెత్తడానికి ఈ మ్యూజియం ఉపయోగపడుతుంది’’ అంటున్నాడు ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దిన బిందేశ్వర్ పాఠక్.

Videos

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌