amp pages | Sakshi

అన్నింటా అపజయాలా?

Published on Sun, 01/28/2018 - 01:56

కొందరు తమ తమ రంగాల్లో ఎంతగా కృషి సాగిస్తున్నా వరుస అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. దీర్ఘకాలం ఇలాంటి పరిస్థితి కొనసాగడం వల్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ప్రతిష్ఠ మసకబారుతుంది. ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. చివరకు ఆరోగ్యం కూడా మందగిస్తుంది. ప్రతికూలతలను అధిగమించి, విజయాలు సాధించాలంటే...
సూర్య ఆరాధన వల్ల అపజయాలు తొలగుతాయి. ఏదైనా ఆదివారం నుంచి ఆదిత్యహృదయం పఠించడం ప్రారంభించాలి. ప్రతిరోజూ పదకొండుసార్లు చొప్పున పదకొండు రోజుల పాటు అంతరాయం లేకుండా ఆదిత్యహృదయ పఠనం కొనసాగించాలి. సూర్య ప్రీతి కోసం పూజలో ఎర్రని పూలు ఉపయోగించాలి. రాగిపాత్రలో తీర్థాన్ని సమర్పించాలి.
 ఏదైనా సోమవారం లేదా శనివారం రోజున సూర్యోదయ వేళలో జమ్మిచెట్టు వేరును సేకరించాలి. ఆ వేరును శుభ్రపరచి పూజలో ఉంచాలి. పూజ ముగిసిన తర్వాత దానిని ఎరుపుదారంతో కట్టి మెడలో తాయెత్తులా ధరించాలి.
 పసుపు, కుంకుమపువ్వు ముద్దలా నూరి, దానిని పూజ సమయంలో తిలకంలా ధరించాలి.
 పేద బాలికలకు ఆర్థిక సహాయం చేయడం వల్ల ఫలితముంటుంది.
 చిన్న వెండిపూసలు రెండింటిని తయారు చేసి, వాటిని పూజలో ఉంచిన తర్వాత ఎల్లప్పుడూ పర్సులో భద్రపరచుకోవాలి.

– పన్యాల జగన్నాథదాసు

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)