amp pages | Sakshi

డజనుకు రెండు డజన్ల మేలు

Published on Thu, 05/30/2019 - 01:49

అరటిపండు అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. మిగతా పండ్లతో పోలిస్తే ఒకింత చవక కూడా.  ఇందులోని అనేక రకాల పోషకాలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. అరటితో ఆరోగ్యానికి కలిగే లాభాల్లో కొన్ని..!

►అరటిపండులో పొటాషియమ్‌ ఎక్కువ. పొటాషియమ్‌ అధిక రక్తపోటు (హైబీపీ)ని నియంత్రిస్తుంది. అందుకే హైబీపీ ఉన్నవారికి అరటిపండు చాలా మేలు చేస్తుంది. ఇందులోని పొటాషియమ్‌ మన మూత్రపిండాల ఆరోగ్య నిర్వహణకు కూడా బాగా తోడ్పడుతుంది

►అరటిపండులో అనేక రకాల ఖనిజలవణాలు ఉంటాయి. ఈ వేసవికాలంలో ఒంట్లో ఖనిజలవణాలు తగ్గి మాటిమాటికీ కండరాలు పట్టేస్తున్న వారు అరటిపండు తింటే మంచిది. అందులోని ఖనిజలవణాల కారణంగా అరటిపండ్లు తింటే ఆ సమస్య తగ్గుతుంది. ఈ కారణం వల్లనే బాగా చెమటను కోల్పోయే ఆటగాళ్లు తాము కోల్పోయే ఖనిజలవణాలను భర్తీ చేసుకోడానికి ఆటమధ్యలో తరచూ అరటిపండు తింటుండటం మనం టెన్నిస్, బ్యాడ్‌మింటన్‌ లాంటి ఆటల్లో చూస్తుంటాం. వ్యాయామం తర్వాత రెండు అరటిపండ్లు తింటే వ్యాయామ సమయంలో కోల్పోయిన శక్తి త్వరగా భర్తీ అవుతుంది. అంతేగాక వ్యాయామ అనంతరం మనకు  సమకూరే ఆరోగ్యాన్ని చాలాకాలం పాటు పదిలంగా కొనసాగేలా చూస్తుంది

►అరటి పండులోని  విటమిన్‌ సి, విటమిన్‌ బి6... గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడతాయి

►ఆస్తమా ఉన్నవారు అరటిపండు తినకూడదనే అభిప్రాయం ఉంది. కానీ అది కేవలం అపోహ మాత్రమే. కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనం ప్రకారం... చిన్నప్పుడు అరటిపండ్లు పుష్కలంగా తిని పెరిగిన పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశాలు 34 శాతం తగ్గుతాయని నిరూపణ అయ్యింది

►అరటిపండు జీర్ణశక్తిని పెంచి, ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేలా చూస్తుంది. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండ్లు మలబద్దకం లాంటి సమస్యలనూ నివారిస్తాయి

►అరటిపండులోని అమైనో యాసిడ్స్‌ అద్భుతమైన జ్ఞాపకశక్తికి, మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)