amp pages | Sakshi

త్రీమంకీస్ - 63

Published on Sat, 12/20/2014 - 23:13

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 63
 

 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
తర్వాత రైట్ టైం షాపుకి సమాంతరంగా ఉన్న ఆ బేంక్ బిల్డింగ్ దగ్గరకి వెళ్ళాడు. ఆ బేంక్ కూడా మరో రెండు రోజుల్లో ఇంకో చిరునామాకి మారుతోందనే పెద్ద బోర్డ్ గుమ్మం పక్కనే కనిపించింది. బహుశ అందుకే దుర్యోధన్ ముఠా వాళ్ళు జైల్లోంచి సొరంగాన్ని తవ్వి బయటకి వచ్చే ప్రయత్నం చేశారని కపీష్ అర్థం చేసుకున్నాడు. బేంక్‌లోకి నడిచి చూశాడు.

బేంక్ బిల్డింగ్‌లో రైట్ టైం షాపు గల బిల్డింగ్ కిటికీ వైపు బలమైన ఓ ఉక్కు తలుపు కనిపించింది. ఆ తలుపు వెనక బేంక్ స్ట్రాంగ్ రూం ఉందని ఇట్టే గ్రహించాడు. రైట్ టైం షాపులోంచి సొరంగం ఆ స్ట్రాంగ్ రూంలోకి తవ్వబడిందని కూడా ఊహించాడు. లోపలకి వెళ్ళాలనుకున్నాడు. కాని ఎలా?

ఓ పాతికేళ్ళామె చేతిలో  సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఓ బేంక్ ఆఫీసర్ వెనకే ఆ స్ట్రాంగ్ రూం వైపు వెళ్తోంది. కపీష్ సందేహించకుండా ఆమె పక్కనే నడిచాడు. ఆ ఆఫీసర్ తన తాళంతో ఆమె లాకర్ నంబర్ 220ని తాళం తీసి బయటకి వెళ్ళిపోయాడు. ఆమె తన తాళం చెవితో దాన్ని తెరిచి అందులోంచి నగలన్నీ తీసి తన హేండ్‌బేగ్‌లో వేసుకుంటూ, ఆ గదిలో పరాయి వ్యక్తి ఉన్నాడన్న స్పృహ లేకుండా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంది.

కపీష్ సొరంగం కిటికీకి ఎదురుగా ఆ సొరంగం చివర రమారమి ఎక్కడ ఉండచ్చో అంచనా వేసి, అక్కడ నేల మీద నిలబడి జేబులోంచి ఇందాకటి ఎలక్ట్రానిక్ పరికరాన్ని తీసి, గోడకి గురిపెట్టి దాని మీటని నొక్కాడు. అది గోడని తాకి వెనక్కి వచ్చి దూరం చూపించింది. ఆరడుగులు. తర్వాత దాని ఇంకో మీట నొక్కి ఈసారి తను నించున్న చోట నేల మీద గురి చూసి మళ్ళీ మీటని నొక్కాడు. లోపల రెండడుగుల కింద గుంట ఉందని దాని డిస్‌ప్లేలో రీడింగ్ కనిపించింది. తన ఊహ నిజమైంది అనుకున్నాడు.

 ఆమె నగల సంచీతో బయటకి నడిచింది. కపీష్ ఆమెతో చెప్పాడు - ‘‘లాకర్ తలుపు తాళం వేశారు కాని తాళం చెవి మర్చిపోయారు.’’
 ఆమె ‘థాంక్స్’ అని గొణిగి ఆ పని చేసి సెల్‌లో మాట్లాడుతూనే బయటకి నడిచింది. కపీష్ ఆ పరికరాన్ని ఉపయోగించి ఆ బేంక్‌కి, ఆ షాప్‌కి మధ్య గల దూరాన్ని కొలిచాడు. పది అడుగుల ఐదు అంగుళాలు. తనకి దొరికిన మేప్‌లో రాసిన దానికి సరిపోవడంతో ఆ మేప్‌లో సూచించిన ప్రదేశం అదే అని గ్రహించాడు.

 ఆగి ఉన్న ఆటో దగ్గరకి వెళ్ళి అందులో కూర్చుని డ్రైవర్‌తో చెప్పాడు - ‘‘వెళ్దాం పద.’’  ఆటో రుధిర అపార్ట్‌మెంట్‌కి చేరుకునే దాకా వాళ్ళు ఆ విషయం తప్ప ఇతర విషయాలు మాట్లాడారు. ఆటో అతనికి థాంక్స్ చెప్పి దిగాక, లిఫ్ట్‌లో సరాసరి పై అంతస్తుకి వెళ్ళి, అక్కడ నించి మెట్లెక్కి టైపైకి వెళ్ళారు. ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు ఎప్పటిలానే తూర్పు, పడమర పిట్టగోడలకి ఆనుకుని సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారు.

 ‘‘మొన్నటినించి అలానే మాట్లాడుతున్నారా?’’ వానర్ ఆశ్చర్యపోయాడు.
 ‘‘కావచ్చు. బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూంటే ఆ వయసు వారికి కాలమే తెలీదు’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘అదేం కాదు. వాళ్ళు డ్రెస్ ఛేంజ్ చేసుకున్నారు’’ కపీష్ కోప్పడ్డాడు.
 ఉత్తరం వైపు గోడ దగ్గరకి వెళ్ళాక మర్కట్ ఉత్సాహంగా అడిగాడు.
 ‘‘వానర్! నీ ప్రియురాలితో ఎలా గడిచింది? డబ్బేమైనా తీసుకున్నావా?’’
 వానర్ తన అనుభవాలన్నిటినీ ఏకరువు పెట్టి చెప్పాడు.
 ‘‘నేను డాక్టర్ మూలికకి మేక్‌డోనాల్డ్స్‌కి పిలిచి బ్రేకప్ చెప్పేస్తాను.’’
 ‘‘అక్కడకి దేనికి?’’
 ‘‘అక్కడ బరువైన ప్లేట్స్ కాని, పదునైన కత్తులు, లేదా ఫోర్క్‌లు కాని ఉండవు. పైగా వెనక దాక్కోడానికి లావుపాటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంక ఆమెకీ, నాకు కటీఫ్.’’
 ‘‘వెరీ సారీ. కాని నేనూ అంతే’’ మర్కట్ కూడా చెప్పాడు.
 ‘‘అదేం?’’
 మర్కట్ కూడా తన అనుభవాలని వివరించి చెప్పాడు.
 ‘‘కుక్కల్ని ప్రేమించే ఆమెకీ, కుక్కలంటే భయం గల నాకూ రాంరాం.’’
 ‘‘రుధిర కొద్దిగా ఇదిగా ఉంది. నేనూ ఆమెతో ఎడ్జస్ట్ కాలేను అనిపిస్తోంది’’ కపీష్ చెప్పాడు.
 ‘‘ఏం?’’
 ‘‘ఇది అని వివరించలేను. కాని ఆమె పెక్యూలియర్ కేస్ కాబట్టి మనకి ఉండటానికి ఇంకేదైనా ప్లేస్ కావాలి. ఈలోగా రుధిర ఇంటికి వెళ్ళి ఆమె సెల్‌ఫోన్‌ని కొట్టేయాలి. దాన్ని వెంటనే అమ్మితే కొంత డబ్బు సంపాదించగలం. పైగా ఆమె లేప్‌టాప్ అవసరం’’ కపీష్ చెప్పాడు.
 ‘‘ఇంతకీ ఆ బేంక్‌లోకి సొరంగం ఉందా?’’ మర్కట్ అడిగాడు.
 ‘మేప్ నిజందే. మన పంట పండింది. రైట్ టైంలోంచి ప్రుడెన్షియల్ బేంక్‌లోకి నేలలో సొరంగం తవ్వారు. బేంక్‌లో స్ట్రాంగ్ రూంలో రెండు అడుగుల కాంక్రీట్ ఉంది. సొరంగం చివరకి వెళ్ళి పైన ఉన్న దాన్ని తవ్వితే మనం బేంక్‌లో ఉంటాం.’’
 ‘‘వావ్! మన ప్లానేమిటి?’’ మర్కట్ ఉత్సాహంగా అడిగాడు.
 

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)