amp pages | Sakshi

నన్నడగొద్దు ప్లీజ్‌

Published on Tue, 11/21/2017 - 00:01

నేను నా సహచర విద్యార్థి అయిన ఓ అమ్మాయిని గత ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నాను. మా కులాలు వేరు. తనకు చాలా కుల పిచ్చి. అదే తన సమస్య అని చెబుతోంది. నా ప్రేమ గురించి చెప్పినప్పుడల్లా నన్ను దూరం పెట్టడం, నా నంబర్‌ని బ్లాక్‌ చెయ్యడం, మళ్లీ కొంతకాలానికి పలకరించడం చేస్తోంది. నేను ఎన్ని సంవత్సరాలయినా తనకోసం ఎదురు చూడటానికి సిద్ధంగా ఉన్నాను. తను నా కోసం వస్తుంది అంటారా?? – సంతోష్‌

మై డియర్‌ దుఃఖం...!‘ఏంటి సార్‌ సంతోష్‌ని పట్టుకుని డియర్‌ దుఃఖం అంటున్నారు?’అమ్మాన్నాన్నలు పెట్టిన పేరుకు మీనింగే మార్చేస్తున్నాడు..!‘మీనింగ్‌ మార్చడం ఏంటి సార్‌?’అరే.. వద్దురా బాబు అని అమ్మాయి అన్ని సిగ్నల్స్‌ ఇస్తుంటే...‘అబ్బాయిలు వద్దంటే వదిలేస్తారా సార్‌????’వదలక... ఏం చేస్తారు?‘వదిలేస్తే వాళ్లు అబ్బాయిలు ఎందుకు అవుతారు.. మీకు ఉత్తరాలు ఎలా వస్తాయి సార్‌??’ అంత సెల్ఫిష్‌ అయితే ఎలా నీలూ.. మన బిజినెస్‌ కోసం లవర్స్‌ లైఫ్‌ని వాడుకుంటామా???‘వద్దు సార్‌ మీరు ఈ ‘‘ఐ యామ్‌ గుడ్‌ ఫెలో’’ కథలు చెప్పకండి సార్‌..! మీ రీడర్స్‌ ఎవరూ ఫూల్స్‌ కాదు సార్‌..!! ఎక్కడ వెటకారంతో కొట్టాలో.. ఎక్కడ ఎమోషన్‌తో గ్రిప్‌లోకి తెచ్చుకోవాలో.. ఎక్కడ లవ్‌గా మాట్లాడి ఆకట్టుకోవాలో... అలా సమాధానాలు ఇస్తారని అందరికీ తెలుసు సార్‌! మీకు చాలా ఉత్తరాలు వస్తాయి కాబట్టే మీ బిజినెస్‌ రన్‌ అవుతుందని.. లేకపోతే పేపర్‌లో ఈ కాలమ్‌ కూడా ఎత్తేస్తారని మీరు ఆడే ట్రిక్స్‌ అందరికీ తెలుసు సార్‌..!! అయినా మీరేమైనా డాక్టరా..? మీరు చెప్పింది చేస్తే లవ్‌ వర్కౌట్‌ అవుతుందా? అంతా ఎంటర్‌టైన్మెంట్‌ అని చదువుతున్నారు.. మిగతావాళ్లు బాధ పంచుకోవడానికి రాస్తున్నారు.. సార్‌!’

నీ ప్రాబ్లమ్‌ ఏంటి నీలూ...? ఇవ్వాళ్ల అరటిపండ్లు లేవా? ఫుల్‌గా నా మీదే కాన్సంట్రేషన్‌ పెట్టి నా తొక్క తీస్తున్నావ్‌????‘మరీ.. సంతోషుని పట్టుకుని మిస్టర్‌ దుఃఖం అంటే కాలదా సార్‌?’ఒక పక్క సార్‌.. సార్‌ అంటావు ఇంకో పక్క సాచి సాచి కొడతావు..! సరే, నువ్వు చెప్పు దుఃఖం.... సారీ సంతోష్‌కి ఏం చెప్పాలో..?‘సాక్షి పేపర్‌లో మిమ్మల్ని పీకి నాకు ఈ కాలమ్‌ ఇచ్చినప్పుడు నేను చెబుతా.. నేను ఆన్సర్‌ ఇస్తే మీరు క్రెడిట్‌ కొడితే.. నాకేమొస్తుంది సార్‌? ముందే నన్ను సెల్ఫిష్‌ అన్నారుగా.. నా జాబ్‌ నేను చేస్తా.. ఇప్పుడు నా జాబ్‌ అరటిపండు ఇవ్వడం. లేదంటే తొక్క తియ్యడం. మీరే చెప్పండి సార్‌!’ సంతోషాన్ని వెతుక్కుంటూ పర్వతాలను పిండి చెయ్యొచ్చుసముద్రాలనైనా చిలికించచ్చు కానీ వద్దంటున్న అమ్మాయి.. వద్దనుకుంటున్నా అమ్మాయి ప్రేమ కోసం.. వన్‌ సైడ్‌ లవర్‌ ఏం పీకినా.. దుఃఖమే  మిగులును!విశ్వదాభి రామ.. నీలు మంచి భామ!!‘వద్దు సార్‌ నాకు బటర్‌ రాయకండి. మీకు ఇవ్వాళ్ల నో అరటిపండు..! నేను సెల్ఫిష్‌ కదా నేనే తినేస్తా!!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్,హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Videos

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)