amp pages | Sakshi

పేరెంట్స్‌కు బీపీ... నాకూ రావచ్చా?

Published on Mon, 06/29/2015 - 22:48

హైబీపీ కౌన్సెలింగ్
నా వయసు 35. మా కుటుంబంలో తల్లిదండ్రులకు హైబీపీ ఉంది. ఇది నాకు కూడా వస్తుందా? దీన్ని నివారించడానికి నేనేం చేయాలో చెప్పండి.
- నాగరాజు, కూసుమంచి


మీ తల్లిదండ్రులకూ, మీ రక్తసంబంధీకులకూ, మీకు చాలా దగ్గరి బంధువులకు అధిక  రక్తపోటు ఉంటే మీకు కూడా వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువే. అయితే, మీ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవడం ద్వారా కుటుంబంలో హైబీపీ చరిత్ర ఉన్నప్పటికీ దీన్ని చాలావరకు నివారించుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది చాలా సులభం. అది...
- ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తీసుకోవాలి. అందులో మీరు తీసుకునే సోడియమ్ పాళ్లు 1500 మి.గ్రా.కు మించకుండా చూసుకోవాలి.
- మీరు శారీరక శ్రమను ఇష్టపడుతూ చేయండి. నడక వంటి వ్యాయామాలు దీనికి బాగా ఉపకరిస్తాయి.
- బరువు పెరగకుండా చూసుకోండి. మీ ఎత్తుకు మీరెంత బరువుండాలో దానికి మించకుండా నియంత్రించుకుంటూ ఉండండి.
- పొగాకు వాడకాన్ని పూర్తిగా మానేయండి.
- ఆల్కహాల్ పూర్తిగా మానేయండి.
 
హైబీపీ ఉన్నవారు ఎప్పుడూ కాస్త చాలా ఒత్తిడితో బాధపడుతున్నట్లుగా (నర్వస్‌గా), చెమటలు పడుతున్నట్లుగా, నిద్రపట్టకుండా ఉండే లక్షణాలతో కనిపిస్తుంటారు కదా. నాకు పైన పేర్కొన్న లక్షణాలేమీ లేవు. కానీ హైబీపీ ఉందేమోనన్న సందేహం వెంటాడుతోంది. నాకు బీపీ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?
- సురేశ్, హైదరాబాద్


చాలామందికి హైబీపీ ఉన్నట్లే తెలియదు కానీ వాళ్లలో చాలామందికి ఆ వ్యాధి ఏళ్లతరబడి ఉంటుంది. అందుకే దీన్ని ‘సెలైంట్ కిల్లర్’ అంటుంటారు. మీకు లక్షణాలు కనిపించనంత మాత్రాన బీపీ లేదని నిర్ధారణ చేసుకోకండి. మీ రక్తనాళాలు పాడైపోయాక గానీ ఆ లక్షణాలు బయటకు కనిపించవు. మీరు ఒకసారి డాక్టర్‌ను కలిసి బీపీ పరీక్షింపజేసుకోండి.
 
డాక్టర్ సుధీంద్ర ఊటూరి,
కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)