amp pages | Sakshi

రాయడమంటే ప్రేమలేఖ రాసినట్టు

Published on Mon, 08/28/2017 - 01:11

♦ ఐదు ప్రశ్నలు

పరవస్తు లోకేశ్వర్‌ ‘షహర్‌నామా: హైద్రాబాద్‌ వీధులు–గాథలు’ వెలువడిన నేపథ్యంలో ఆయనతో సాక్షి సాహిత్యం ప్రతినిధి జరిపిన చిరు సంభాషణ:

ఈ ‘షహర్‌నామా’ రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
పుట్టిందీ పెరిగిందీ ఇక్కడే. ఈ గల్లీల్ల గాలికి తిరిగిన. 1990 వరకు ఓల్డ్‌ సిటీలనే ఉన్న. మా ఫాదర్‌ ఉర్దూ పండితుడు. చాలామంది ముస్లిం మిత్రులు ఉండేవారు. అదంతా మనసులవుండి రాయాలనిపించింది. కుశ్వంత్‌సింగ్‌ ‘దిల్లీ’ మీదా, అబ్దుల్‌ హలీమ్‌ షరర్‌ ‘లఖ్‌నవూ’ మీదా రాసినట్టు నాకు కూడా హైదరాబాద్‌ మీద రాయాలనిపించింది. నరేంద్ర లూథర్‌ కూడా రాసిండు. ఆయన పంజాబీ అయ్యుండి రాసుడు గొప్ప విషయం. అయితే నన్ను నేను ఈ భూమిపుత్రుణ్నని అనుకుంట. నేను రాస్తే మరింత సహజంగా వస్తుందనుకున్నా.

సమాచార సేకరణ ఎలా చేశారు?
ప్రత్యేకంగా రీసెర్చ్‌ చేసిందేమీ లేదు. చిన్నప్పటినుంచీ హైద్రాబాద్‌ గురించి చదువుతనే ఉన్న, వింటనే ఉన్న, పామరజనులతోటి మాట్లాడుతనే ఉన్న. ఆ కథలు, ముచ్చట్లు, జ్ఞాపకాలు నా మనసులో ఉన్నయి కాబట్టి అవలీలగా రాయగలిగిన. పైగా నాకు పెద్ద పర్సనల్‌ లైబ్రరీ ఉంది. రాయడానికి కూర్చున్నప్పుడు చరిత్రకు సంబంధించిన వాటిల్లో ఏమైనా తప్పులు రాకుండా ఉండటం కోసం మాత్రం క్రాస్‌చెక్‌ చేసుకున్న.

‘హైద్రాబాద్‌ వీధులు–గాథలు’ రాయడంలో ఉన్న ఆనందం ఏమిటి?
చాలామంది ఒక రచన చేయడమంటే ప్రసవవేదన పడటం అని పెద్ద పెద్ద మాటలు చెప్తరు. నాకు రాయడం అంటే ప్రియురాలికి ప్రేమలేఖ రాస్తున్నంత హాయిగా ఉంటది. ఇదే కాదు, ‘సలాం హైద్రాబాద్‌’ రాసినా, చత్తీస్‌ఘడ్, సిల్క్‌రూట్, యూరప్‌ యాత్రలు... ఏది రాసినా సింగిల్‌ స్ట్రోక్‌లో రాసిన. రాసినంక ఒక్క అక్షరం కూడా మార్చుకోను. పేపర్‌ మీద పెన్ను పెట్టడం కంటే ముందే ప్రతి వాక్యం, ప్రతి పదం రిహార్సల్‌ చేసుకుంట. మళ్లీ సవరింపులు, కుదింపులు, కొట్టివేతలు, ఫెయిర్‌ కాపీలు ఉండవు. అతిశయోక్తి అనుకోవద్దు, నా రచనా పద్ధతి ఇది.

అసలు హైదరాబాద్‌ ఏమిటి మీకు?
ప్రపంచంల ఏ నగరం కూడా ప్రేమ కోసం నిర్మించబడలేదు. జాతీయం, అంతర్జాతీయం ఏదైనా తీసుకోండి. ఒక ప్రియుడు ఒక ప్రియురాలికి కానుక ఇద్దామని నిర్మించిన నగరం ఇది. ఖైరున్నీసా, మహ్‌ లఖా బాయి, విఖారుల్‌ ఉమ్రా... ఇట్లా ఎన్నో ప్రేమలు కనబడుతాయి. చలం అంటాడు: ప్రేమ అనేది వ్యక్తిగత విషయం కాదు, స్త్రీ పురుషుల మధ్య ప్రేమ సమాజ ఔన్నత్యానికి దారి తీయాలి, అని. ఆ ప్రేమల వల్ల ఒక పురానాపూల్‌ దక్కింది, ఒక వికార్‌ మంజిల్‌ దక్కింది. ఒక చార్మినార్‌ దక్కింది. ‘హైద్రాబాద్‌ కీ హవా ఏక్‌ లాఖ్‌ కీ దవా’ అంటరు. ఇంత మంచి వాతావరణం ఎక్కడా ఉండదు. గేట్‌వే ఆఫ్‌ సౌతిండియా. అన్ని మతాలు, ప్రాంతాల వాళ్ల కడుపు నింపే అన్నపూర్ణ. హైదరాబాద్‌ అంటే ఇవన్నీ.

పాత భాగ్యనగర ప్రేమికుడిగా కొత్త హైదరాబాద్‌ మార్పులను ఎలా చూస్తారు?
అంగీకరించక తప్పదు. అందుకే పాత వైభవాన్ని తలచుకుని ఆనందపడటం! ఇప్పటి తరానికి అప్పటి గొప్పతనం ఏమిటో చెప్పడం కోసమే ఆ చరిత్రను రికార్డ్‌ చేసిన.



(షహర్‌నామా: హైద్రాబాద్‌ వీధులు– గాథలు; పేజీలు: 208; వెల: 110; ప్రతులకు: గాంధి ప్రచురణలు, 12–2–709/5/1/సి, నవోదయ కాలనీ, హైదరాబాద్‌–28. ఫోన్‌: 9160680847)

#

Tags

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)