amp pages | Sakshi

గుండె కవాటాల సమస్య గురించి చెప్పండి... 

Published on Wed, 05/16/2018 - 00:37

కార్డియాలజీ కౌన్సెలింగ్‌
నా వయసు 58 ఏళ్లు. గత కొద్దికాలంగా నేను ఆయాసం, పొడిదగ్గు, గుండెలో దడగా ఉండటం, ఛాతీలో నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్‌సు సంప్రదిస్తే కొన్ని పరీక్షలు జరిపి, నేను గుండె కవాటాల్లో సమస్యతో బాధపడుతున్నట్లుగా చెప్పారు. గుండె కవాటాల సమస్యలు వాటి చికిత్స విధానాల గురించి దయచేసి వివరంగా చెప్పండి.
– ఎస్‌. గురునాథరావు, నరసరావుపేట 

మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీలో హార్ట్‌ ఫెయిల్యూర్‌ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. గుండెలో నాలుగు కవాటాలు (వాల్వ్స్‌) ఉంటాయి. అవి ట్రైకస్పిడ్‌ వాల్వ్, పల్మనరీ వాల్వ్, మైట్రల్‌వాల్వ్, అయోర్టిక్‌ వాల్వ్‌. ఈ నాలుగు కవాటాల్లో ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు. అవి... 1) కవాటం సన్నబడటం (స్టెనోసిస్‌), 2) కవాటం లీక్‌ కావడం (రిగర్జటేషన్‌). దీనికి కారణం... కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు. అయితే మరికొందరిలో రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌తోనూ, ఇంకొందరిలో పుట్టుకతోనే ఇలాంటి సమస్యలు రావచ్చు. సాధారణంగా మీరు పేర్కొన్న లక్షణాలతో ఈ సమస్య కొందరిలో వ్యక్తమయితే... ఇంకొందరిలో మాత్రం సమస్య వచ్చిన వాల్వ్‌ను బట్టి నిర్దిష్టంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు ట్రైకస్పిడ్‌ వాల్వ్‌ లీక్‌ సమస్య ఉన్నవారిలో కాళ్ల వాపు కనిపిస్తుంది. మైట్రల్‌ వాల్వ్‌ సన్నబడితే స్పృహతప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో సమస్య ఉన్న వాల్వ్‌ను స్పష్టంగా చూసేందుకు   ట్రాన్స్‌ఈసోఫేసియల్‌ ఎకో కార్డియోగ్రామ్‌ అనే పరీక్ష అవసరం కావచ్చు. 

ఇక చికిత్స విషయానికి వస్తే కవాటాల (వాల్వ్స్‌) సమస్యకు చాలావరకు మందులతోనే చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే... రోగి పరిస్థితిని బట్టి శస్త్రచికిత్స అవసరమవుతుంది. అంటే మైట్రల్‌వాల్స్‌ సన్నగా మారితే అలాంటి రోగుల్లో బెలూన్‌ వాల్వులోప్లాస్టీ అనే శస్త్రచికిత్స చేసి, సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు. అయితే మిగతా కవాటాలు సన్నగా మారి లీక్‌ అవుతుంటే ఈ వాల్వులో ప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాదు. అలాంటప్పుడు వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ అన్నదే పరిష్కారం. గుండె కవాటాలను మార్చి కృత్రిమ కవాటాలను అమర్చే క్రమంలో రెండు రకాల కవాటాలను ఉపయోగించవచ్చు. మెకానికల్‌ వాల్వ్‌ అనేది ఉపయోగించినప్పుడు ఒక ప్రతికూతల ఉంటుంది. అలాంటి రోగులకు జీవితాంతం రక్తాన్ని పలచబార్చే ‘ఎసిట్రోమ్‌’ మందులు వాడాల్సి ఉంటుంది. ఇక టిష్యూ కవాటాల విషయానికి వస్తే, ఇవి ఇతర జంతువుల కండరాలతో రూపొందించినవి. ఇవి వాడిన వారిలో రక్తాన్ని పలుచబార్చే ‘ఎసిట్రోమ్‌’ వంటి మందులు వాడాల్సి అవసరం ఉండదు. ఈ టిష్యూ వాల్వ్‌లు 15 ఏళ్ల వరకు పనిచేస్తాయి. ప్రస్తుం కవాటాలకు వచ్చే సమస్యలను పరిష్కరించడానికి శస్త్రచికిత్స కన్నా వాల్వ్‌ రిపేర్‌ చేయడానికి అత్యంత ప్రాధాన్యం వస్తున్నారు. ఎందుకంటే వాల్వ్‌ను రిప్లేస్‌ చేయడం కంటే ప్రకృతి ఇచ్చిన స్వాభావికమైన మన కవాటమే మెరుగైనది. అందుకే ఇప్పుడు వైద్యనిపుణులు కవాటం మరమ్మతుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా ఇలా ఉన్న వాల్వ్‌నే రిపేర్‌ చేసినట్లయితే, జీవితాంతం ‘ఎసిట్రోమ్‌‘ వాడాల్సిన పనిలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న వాల్వ్‌ను ప్రత్యేకంగా మైగ్రల్, ట్రైకస్పిడ్‌ వాల్వ్‌ల విషయంలో రిపేర్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. 

తరచూ ఛాతీనొప్పి  ఎందుకు? 
మా నాన్నగారి వయసు 60 ఏళ్లు. బరువు 90 కిలోలు. గత మూడు నెలలుగా ఛాతీలో నొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్‌ను సంప్రదిస్తే కరొనరీ యాంజియోగ్రామ్‌ అనే పరీక్ష నిర్వహించి, గుండెకు సంబంధించిన వ్యాధి ఏమీ లేదని చెప్పారు. ఇది కండరాలకు సంబంధించిన నొప్పి అని తేల్చారు. అయితే ఆయన ఛాతీలో నొప్పికి కారణం ఏమిటో తెలియడం లేదు. దయచేసి మా నాన్నగారి విషయంలో తగిన సలహా ఇవ్వండి.  – విజయరావు, చిత్తూరు  
సాధారణంగా ఛాతీలో నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. ఛాతీ భాగంలో కండరాలు, ఆహారనాళం, ఊపిరితిత్తులు, దాని పొరలు... ఇలా అనేక అంతర్గత భాగాలు ఉంటాయి. మీ నాన్నగారి విషయంలో కరొనరీ యాంజియోగ్రామ్‌ ద్వారా ఇది గుండెకు సంబంధించిన సమస్య కాదని నిర్ధారణ అయ్యింది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బహుశా అది గ్యాస్ట్రయిటిస్‌ సమస్య కావచ్చు. అయితే నిర్దిష్టంగా సమస్యను నిర్ధారణ చేయడానికి ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. 
- డాక్టర్‌ అనూజ్‌ కపాడియా, 
ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్, 
కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌