amp pages | Sakshi

శరీరంతో వినే సంగీతం

Published on Mon, 04/30/2018 - 00:41

‘ఇప్పుడే ఒకమ్మాయి మొహం మీద గుద్దాను’ అని సిడ్నీ బ్లైక్‌ అనడంతో ప్రారంభం అయ్యే ‘మేబి సమ్‌డే’ నవల కొల్లీన్‌ హూవర్‌ రాసినది. సిడ్నీ తన ఆప్తమిత్రురాలైన టోరీతో కలిసి ఒక అపార్టుమెంట్లో ఉంటుంది. స్థిరమైన ఉద్యోగం చేసుకుంటూ, సంగీతం నేర్చుకుంటుంటుంది.పెరటి బాల్కనీ నుండి రిజ్‌ గిటార్‌ వాయిస్తుండగా వింటూ –అతని సంగీతం పట్ల ఆకర్షణ పెంచుకుంటుంది. అతను పాటలు రాస్తాడు. రాత్రివేళలు తను వాయిస్తున్నప్పుడు ఆమె వింటూ, దానికనుగుణంగా పాడుతోందని రిజ్‌ గమనించి, తన మ్యూజిక్‌ బ్యాండ్‌ కోసమని, ఆమె బాణీ కట్టిన మాటలు తెలుసుకోవాలనుకుంటాడు. ఇద్దరూ ఒకరికొకరు టెక్స్‌ మెసేజిలు పంపుకోవడం మొదలెడతారు.

సిడ్నీ 22వ పుట్టినరోజునే, ఆమె బోయ్‌ఫ్రెండ్‌ హంటర్, టోరీతో వారి బాల్కనీలో శృంగారం జరుపుతుండగా రిజ్‌ చూసి, సిడ్నీకి చెప్తాడు. ఆమె హంటర్‌తో వాదన పెట్టుకుని, టోరీని చెంపదెబ్బ కొట్టి, అపార్టుమెంట్‌ వదిలి ఇద్దరు ఫ్లాట్‌మేట్లతో కలిసున్న రిజ్‌ ఇంటికి చేరుకుంటుంది. 24 ఏళ్ళ రిజ్, చెవిటివాడని సిడ్నీకి తెలుస్తుంది. అతనికి మ్యాగీ అన్న అందమైన గర్ల్‌ ఫ్రెండు ఉందని తెలిసినప్పుడు, దిగులు పడుతుంది. రిజ్, సిడ్నీ కలిసి లిరిక్స్‌ రాయడం ప్రారంభిస్తారు. ఇద్దరి మధ్యా, నోటిమాటల్లేని చమత్కారమైన సంభాషణలు జరుగుతుంటాయి.
సిడ్నీ: నీవు వినలేవని ఎందుకు చెప్పలేదు?
రిజ్‌: నీవు వినగలవని ఎందుకు చెప్పలేదు? 
సిడ్నీ పాడుతున్నప్పుడు ఆమెని పొదివి పట్టుకుని, ఆమె శారీరక కదలికలని బట్టి పాటని గ్రహించడం ప్రారంభిస్తాడు రిజ్‌. అలా ఇద్దరి మధ్యా శారీరక సాన్నిహిత్యం ఎక్కువవుతుంది. రిజ్‌ సిడ్నీకి మెసేజ్‌ చేస్తాడు: ‘మ్యాగీ కోసం నేను వంగగలను. నీకోసం విరగగలను’.

తన బోయ్‌ఫ్రెండ్‌ తనను మోసం చేసినట్టే మ్యాగీకీ అవకూడదనుకుంటుంది సిడ్నీ. గర్ల్‌ ఫ్రెండుకి గుండెజబ్బుందని తెలిసినప్పుడు, సిడ్నీని తనింట్లోంచి వెళ్ళిపొమ్మని రిజ్‌ కోరతాడు. అయితే, మ్యాగీ అతన్ని స్వీకరించదు. కొంత గడువు తరువాత రిజ్‌– సిడ్నీ ఫ్లాటుకి మారతాడు.
రచయిత్రి– సిడ్నీ, రిజ్‌ ఇద్దరి కోణాలనీ మార్చి మార్చి రాయడం వల్ల ఒకే పరిస్థితిలో ఇద్దరూ ఎలా ప్రతిస్పందించారో పాఠకులకి తెలుస్తుంది. వారి సంబంధంలో గౌరవం, నిజాయితీ, మెప్పుకోలూ ఉండటం చూస్తాం. ఎవరికీ అన్యాయం చేయకుండా ఇద్దరూ చేసే ప్రయత్నాలు బాగుంటాయి. ‘ఇద్దర్ని ఒకే సమయంలో ప్రేమించడం సాధ్యమేనా? మనం ప్రేమిస్తున్న మనిషి అవసరాలు మన అవసరాలు కాకపోతే!’ అన్న ఎన్నో ప్రశ్నలు కనబడతాయి నవల్లో. కథలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. నవల్లో కొన్ని సన్నివేశాలకి తగిన పాటలున్నాయి.

ఈ–బుక్‌లో అయితే, ఒక పాట ‘లింక్‌’ మీద నొక్కితే అది వింటూ, పుస్తకం కూడా చదివే వీలుంటుంది. పేపర్‌ బ్యాక్‌ అయితే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, పాట వినవచ్చు. లేకపోతే, ‘మేబి సమ్‌ డే’ సైట్లో కూడా వినే అవకాశం ఉంది. 2014 మార్చిలో వచ్చిన ఈ నవల ఏప్రిల్లో, ‘న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌ సెల్లర్‌’ లిస్టులో ఉండి, మళ్ళీ తిరిగి సెప్టెంబర్లో కూడా అదే లిస్టులో అగ్రస్థానం సంపాదించుకుంది. దీని ఆధారంగా వచ్చిన సినిమా ఉంది.
 సిడ్నీ, రిజ్‌ ఇద్దరి కోణాలనీ మార్చి మార్చి రాయడం వల్ల ఒకే పరిస్థితిలో ఇద్దరూ ఎలా ప్రతిస్పందించారో పాఠకులకి తెలుస్తుంది.

- కృష్ణ వేణి

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)