కర్ణాటకలో మెగా బ్రదర్స్ ప్రచారం?

Published on Fri, 04/04/2014 - 08:23

  • కాంగ్రెస్‌కు చిరు-బీజేపీకి పవన్
  •  మెగాస్టార్ సభలు నీరుగార్చేందుకు పవర్‌స్టార్ అభిమానుల ఎత్తులు!
  •  బెంగళూరు, న్యూస్‌లైన్ : టాలీవుడ్ మెగా ఫ్యామీలి అంతర్గత పోరు కర్ణాటకలో రచ్చకెక్కనుంది. ఇందుకు లోక్‌సభ ఎన్నికలు వేదికగా మారాయి. దీంతో కొన్ని రోజుల క్రితం వరకు ఒక్కటిగా ఉన్న కర్ణాటక మెగా ఫ్యామిలీ అభిమానులు నువ్వా.. నేనా తేల్చుకుందాం రా.. అంటూ వీధిన పడుతున్నారు. ఎన్నికల ప్రచారానికి తమ అభిమాన నటుడు వస్తే పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు రంగం కూడా సిద్ధం చేసుకున్నారు.

    కాంగ్రెస్ పార్టీ తరుఫున కేంద్ర మంత్రి చిరంజీవి, బీజేపీ తరుఫున పవన్‌కళ్యాణ్ ప్రచారం చేస్తారని ఇప్పటికే కర్ణాటకలో ఊహగానాలు చెలరేగాయి. ఇందుకు అభిమానుల చర్యలు బలమిస్తున్నాయి. బెంగళూరు సెంట్రల్, ఉత్తర, దక్షిణ, గ్రామీణ జిల్లా, కోలారు, చిక్కబళ్లాపుర, తుమకూరు, బళ్లారి తదితర లోక్‌సభ నియోజకవర్గాల్లో చిరంజీవి, పవన్‌కళ్యాణ్ ప్రచారం చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

    ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షల మంది తెలుగు వారి ఓట్లను మెగా బ్రదర్స్ ప్రచారం ద్వారా కొల్లగొట్టేందుకు ఆయా పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి.  ఇది వాస్తవమేనంటూ బహిరంగంగా ప్రచారం కూడా చేసేస్తున్నారు. కాగా, గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున చిరంజీవి చేసిన ప్రచారం ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. ఆయన ప్రచారం చేసిన పలు ప్రాంతాల్లో అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

    ఈ నెల 8న చిక్కబళ్లాపురలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు మోడి హాజరుకానున్నారు. ఇదే సభలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నారని ఆయన అభిమానాలు పేర్కొంటున్నారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడం ద్వారా తెలుగు జాతి విభజనకు సహకరించిన వీరప్ప మొయిలీకి బుద్ధి చెప్పాలని పవర్‌స్టార్ అభిమానులు పిలుపునిస్తున్నారు. ఆంధ్రులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలను సైతం అడ్డుకోవాలని తీర్మానించుకున్నారు. మొత్తం మీద కర్ణాటకలో మెగా బ్రదర్స్ ప్రచారాల ‘ షో ’లకు ఎలాంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి.
     

Videos

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)