amp pages | Sakshi

ఆన్‌లైన్‌ ఎంప్లాయ్‌మెంట్‌లో.. భారత్‌ టాప్‌

Published on Sun, 07/30/2017 - 02:23

ఫ్రీలాన్సింగ్‌.. ఆన్‌లైన్‌ జాబ్స్‌.. పేరు ఏదైనా ఉద్దేశం ఒకటే. ఇంట్లో కూర్చొని నచ్చిన సమయంలో.. మెచ్చిన విభాగంలో పనిచేసే అవకాశం. ఇది ఇప్పుడు నిరుద్యోగ యువతకు చక్కటి ఆదాయ మార్గం.. శాశ్వత ఉద్యోగం లభించలేదనే వేదన నుంచి ఉపశమనం కల్పిస్తున్న సాధనం. భారత యువత ఈ అవకాశాన్ని శరవేగంగా అందిపుచ్చుకుంటోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన.. ఆక్స్‌ఫర్డ్‌ ఇంటర్నెట్‌ ఇన్‌స్టిట్యూట్‌ రూపొందించిన తాజా నివేదికలో ఇది స్పష్టమైంది. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ నుంచి ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ వరకు.. ఆన్‌లైన్‌ ఎంప్లాయ్‌మెంట్‌లో భారతదేశం నెం.1గా నిలిచిందని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా విభాగాల వారీగా ఫ్రీలాన్సింగ్‌ అవకాశాలపై విశ్లేషణ..

ఫుల్‌టైమ్‌ జాబ్స్‌ కష్టమే
ప్రస్తుత పరిస్థితుల్లో ఫుల్‌టైమ్‌ జాబ్స్‌ దొరకడం అంత తేలికేమీకాదు. అత్యాధునిక టెక్నాలజీ, జాబ్‌ మార్కెట్‌ పోటీ పరిస్థితుల కారణంగా ఫుల్‌టైమ్‌ కొలువులకు కోతపడటం ఖాయంగా కనిపిస్తోంది.    
 నిపుణుల అభిప్రాయం.

అనువుగా ఫ్రీలాన్సింగ్‌
ఫుల్‌టైమ్‌ జాబ్స్‌ పరంగా ఓ వైపు ఒడిదొడుకులు ఎదుర్కొంటుంటే.. మరోవైపు ఫ్రీలాన్సింగ్‌  ఉద్యోగాల కల్పనలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. అగ్రరాజ్యం అమెరికాను సైతం తోసిరాజని నెం.1 స్థానాన్ని దక్కించుకుంది.    
– ఆక్స్‌ఫర్డ్‌ ఇంటర్నెట్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక

ఈ రెండు విశ్లేషణలు ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌లో వాస్తవ పరిస్థితికి నిదర్శనం అంటున్నారు నిపుణులు. కొంత ఆశ్చర్యంగా అనిపించినా.. ‘ఆక్స్‌ఫర్డ్‌ ఇంటర్నెట్‌ ఇన్‌స్టిట్యూట్‌’ విడుదల చేసిన ‘ఆన్‌లైన్‌ లేబర్‌ ఇండెక్స్‌’ చూశాక అంగీకరించాల్సిందే. ఓవైపు లక్షల సంఖ్యలో యువత  ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో ఖాళీగా ఉండకుండా చేతికందిన అవకాశాలతో ఆన్‌లైన్‌లో ఫ్రీలాన్సింగ్‌ ద్వారా ఉపాధి మార్గాలు వెతుక్కుంటోంది.

సాఫ్ట్‌వేర్‌ టు ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌
ఆక్స్‌ఫర్డ్‌ ఇంటర్నెట్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించిన నివేదికలో ఆన్‌లైన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ పరంగా భారత్‌ టాప్‌లో ఉంది. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ నుంచి ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ వరకు పలు విభాగాల్లో ముందంజలో నిలిచింది. ఆఫీసులో ఏసీ గదుల్లో పనిచేయాలని ఉవ్విళ్లూరే సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలోనే ఆన్‌లైన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అత్యధికంగా ఉండటం విశేషం. ఆన్‌లైన్‌ విధానంలో మానవ వనరులను అందించడంలో  24 శాతంతో భారత్‌ నెం.1గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్‌ 16 శాతం, అమెరికా 12 శాతం మంది ఆన్‌లైన్‌ ఉద్యోగులను అందిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

మొత్తం ఆరు విభాగాలు
ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ కల్పన పరంగా ఆక్స్‌ఫర్డ్‌ ఇంటర్నెట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆరు విభాగాల్లో సర్వే నిర్వహించింది. అవి.. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ; క్రియేటివ్‌ అండ్‌ మల్టీ మీడియా; సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సపోర్ట్‌; రైటింగ్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌; క్లరికల్‌ డేటా ఎంట్రీ; ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌.

సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ
ఎంప్లాయిమెంట్‌ వాటా: 55 శాతం
ర్యాంకింగ్‌: 1

కారణాలు: టెక్నాలజీ కంపెనీలు తమ కార్యకలాపాలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలనుకుంటున్నాయి. ఆర్థిక కారణాల దృష్ట్యా సంబంధిత సాఫ్ట్‌వేర్‌ నిపుణులను పూర్తిస్థాయిలో నియమించుకోలేక ఆన్‌లైన్‌లోనే సేవలను పొందుతున్నాయి. విదేశీ సంస్థలు.. జాబ్‌ పోర్టల్స్, సోషల్‌ నెట్‌వర్క్స్‌ ద్వారా.. ఫ్రీలాన్సర్‌లుగా పనిచేసే వారిని రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. కొన్ని విదేశీ సంస్థలు ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో భారత్‌లోని  కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఆ స్వదేశీ కంపెనీలు సరితూగే నైపుణ్యాలున్న వారిని నియమించుకుంటున్నాయి.

క్రియేటివ్‌ అండ్‌ మల్టీ మీడియా
ఎంప్లాయిమెంట్‌ వాటా : 13 శాతం
ర్యాంకింగ్‌: 2

కారణాలు: వీడియో గేమింగ్, ఆన్‌లైన్‌ డిజైనింగ్, వెబ్‌ డిజైనింగ్‌ వంటి రంగాల్లో కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయి. అంతే స్థాయిలో నిపుణుల అవసరం ఏర్పడుతోంది. వీటికి పూర్తిస్థాయి  ఉద్యోగుల కంటే ఆన్‌లైన్‌లో ఫ్రీలాన్సింగ్‌ ఎంప్లాయిస్‌ మేలని కంపెనీలు భావిస్తున్నాయి.

సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సపోర్ట్‌
ఎంప్లాయిమెంట్‌ వాటా: 12 శాతం
ర్యాంకింగ్‌: 3

కారణాలు : ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఈ–కామర్స్‌ సంస్థలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్స్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌కూ ఆన్‌లైన్‌ విధానాన్ని ఎంపిక చేసుకుంటుండటం తెలిసిందే. ఉన్నత స్థాయిలో చక్కటి మార్కెటింగ్‌ వ్యూహాలు రచించేందుకు, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించేందుకు ఈ రంగంలోని నిపుణుల సేవలను ఆన్‌లైన్‌లో పొందుతున్నాయి.

రైటింగ్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌
ఎంప్లాయిమెంట్‌ వాటా: 8 శాతం
ర్యాంకింగ్‌: 4

కారణాలు: మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్, లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ నిపుణుల అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్‌ సంస్థలు, ఇతర దేశాల్లో ప్రధాన కేంద్రాలను నెలకొల్పి స్థానికంగా కన్సల్టింగ్‌ తదితర కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ఈ విభాగంలో అవకాశాలు కల్పిస్తున్నాయి.

క్లరికల్‌ అండ్‌ డేటా ఎంట్రీ
ఎంప్లాయిమెంట్‌ వాటా: 7 శాతం
ర్యాంకింగ్‌: 5

కారణాలు: చార్టర్డ్‌ అకౌంటెంట్లు, లాయర్లు వంటి ప్రొఫెషనల్స్‌.. తమ క్లయింట్లకు డాక్యుమెంటేషన్, డేటాఎంట్రీ కోసం సొంతంగా ఆన్‌లైన్‌ విధానంలో సేవలందించే వారిని నియమించుకుంటున్నారు. కొన్ని ప్రముఖ ఆన్‌లైన్‌ జాబ్‌పోర్టల్స్‌ కూడా ఇందులో భాగస్వాములవుతున్నాయి. సంస్థలకు, వ్యక్తులకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ.. అవసరమైన డాక్యుమెంటేషన్, డేటాఎంట్రీ విధుల నిర్వహణకు ఆన్‌లైన్‌లో ప్రొఫైల్‌ రిజిస్టర్‌ చేసుకున్న వారిని నియమిస్తున్నాయి.

ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌
ఎంప్లాయిమెంట్‌ వాటా: 5 శాతం
ర్యాంకింగ్‌: 6

కారణాలు: కొత్త సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. మరెన్నో కంపెనీలు వ్యాపార విస్తరణ దిశగా అడుగులేస్తున్నాయి. మార్కెట్లో ముందుండేలా వ్యూహాలు రచించేందుకు అవసరమైన నిపుణుల సేవలను ఆన్‌లైన్‌లో ఫ్రీలాన్సింగ్‌ పద్ధతిలో పొందుతున్నాయి. అనుభవజ్ఞులు, సంబంధిత రంగంలో నిష్ణాతులైన పరిశోధకులు, ఫ్రొఫెసర్లకు ప్రాధాన్యమిస్తున్నాయి.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)