amp pages | Sakshi

70 ఏళ్లు వస్తున్నా బాబుకు సిగ్గు లేదు: కొడాలి నాని

Published on Wed, 05/18/2016 - 14:29

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 70 ఏళ్ల వయస్సు వస్తున్నా సిగ్గు, శరం లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గురువారం ఆయన కర్నూలు జలదీక్షలో ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

దమ్ము, ధైర్యముంటే ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటిముందు ధర్నా చేయడానికి ముందుకు రావాలని, తాము కూడా వస్తామని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ జలదీక్ష ఎందుకు చేస్తున్నారో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. కానీ సీఎం చంద్రబాబు, మంత్రులకు మాత్రం తెలియడంలేదని ఎద్దేవా చేశారు. రోజుకు తెలంగాణ ప్రభుత్వం 20 - 30 వేల క్యూసెక్కుల నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నా కళ్లుండి చంద్రబాబు ప్రశ్నించలేకపోతున్నారన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ప్రధాని మోదీని ధైర్యంగా అడగలేక గాలి తిరుగుళ్లు తిరుగుతూ.. మోదీ దగ్గర చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నారని విమర్శించారు.

తెలంగాణ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం వైఎస్ జగన్ పోరాట యోధుడిలా దీక్ష చేస్తున్నారని కితాబిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సిగ్గు లేకుండా అభివృద్ధి పేరుతో టీడీపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితేనే వాళ్ల నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. అలా అయితే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా అని కొడాలి నాని అన్నారు. దమ్ముంటే సోనియాగాంధీని వైఎస్ జగన్ ఎదిరించి పోరాడినట్లు, చంద్రబాబు మోదీని ఎదిరించి పోరాడాలని సూచించారు.

చంద్రబాబు వారం రోజుల విదేశీ యాత్రల పేరుతో పనామా పేపర్ల అంశాన్ని సెటిల్ చేసుకున్నట్లు ఆరోపించారు. ఇప్పటికే ఆయన బినామీ ప్రసాద్ పేరు పనామా పేపర్లలో ఉందని నాని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా వచ్చిందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమేనన్నారు. కృష్ణా జిల్లాలో కాలువల నిర్మాణం కోసం వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని.. టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డుపడే ప్రయత్నం చేసినా ఆయన దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు.

గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం తానే చేసినట్లు చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని అన్నారు. ప్రకాశం, పులిచింతల, నాగార్జున సాగర్లకు నీరు ఎలా అందిస్తారో అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్ జగన్ దీక్షను మంత్రులు విమర్శలు చేయడంపై నాని తీవ్రంగా తప్పుపట్టారు. డ్రామా దీక్షలంటే చంద్రబాబు హాయాంలో 70  మంది ఎమ్మెల్యేలతో కర్ణాటక ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి అక్కడ నుంచి ముంబాయి వెళ్లి తిరిగిరావడమని ఎద్దేవా చేశారు. బాబు మనిషిగా పుడితే పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని కొడాలి నాని సవాల్ విసిరారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)