amp pages | Sakshi

టూరిజం హబ్‌కు గేట్‌ వేగా ఎస్‌.యానాం

Published on Sat, 03/04/2017 - 22:51

తీరంలో కలెక్టర్‌ పర్యటన
ఉప్పలగుప్తం : ఎస్‌ యానాం సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే క్రమంలో తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ శనివారం పరిశీలించి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ద్వారా పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. చిర్రయానాం నుంచి ఓడలరేవు వరకూ ఉన్న సముద్ర తీరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో రూ.రెండు వేల కోట్లతో  చిర్రయానాంలో టూరిజం హబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ప్రధాన రహదారులకు దగ్గరగా ఉన్న ఎస్‌.యానాం తీరాన్ని టూరిజం హబ్‌కు గేట్‌వేగా చెయ్యాలన్న ఎమ్మెల్యే ప్రతిపాదనపై కలెక్టర్‌ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. తీరాన్ని ఆనుకుని ఉన్న వైట్‌ శాండ్‌ బీచ్‌ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుందని, రిసార్టుల ఏర్పాటు, పర్ర ప్రాంతంలో బోట్‌ షికారుతో ఎస్‌ యానాం తీరాన్ని టూరిజంలో అభివృద్ధి చెయ్యాలని గత ఏడాది ఉప ముఖ్యమంత్రి రాజప్పతో శంకుస్థ్ధాపన కూడా చేశారని ఎమ్మెల్యే కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌కు వివరించారు. అమలాపురం నుంచి ఉన్న హైవే దారికి ఎస్‌.యానాం దగ్గరవుతుందని, పర్యాటకులకు ఈ మార్గం అనుకూలంగాను, దగ్గరగా ఉంటుందన్నారు. బీచ్‌ వరకూ సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుందని, తీరంలో రక్షణ గట్టు అభివృద్ధికి రూ.10లక్షలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే గ్రామంలో సీఎస్‌ఆర్‌ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్‌ పరిశీలిం చారు. పంచాయతీరాజ్‌ ఈఈ బి.సత్యనారాయణరాజు, డీఈజే మురళీకృష్ణలతో ఆయన మాట్లాడారు. ఇ¯ŒSచార్జి సర్పంచ్‌ పినిశెట్టి నరసింహరావు, ఎంపీటీసీ సభ్యుడు పలచోళ్ల వీరరాఘవుల నాయుడు, నీటిసంఘ చైర్మ¯ŒS దంగేటి చిట్టిబాబు, గ్రామ పెద్దలు ఉన్నారు. 
ఉపాధికి గండి పడుతుంది
ఉప్పలగుప్తం : సముద్రపు పర్ర ప్రాంతం అన్యాకాంతం కావడంతో చేపల వేటకు గండిపడి ఉపాధికి గండి పడుతున్నదని కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌కు మత్స్యకార సొసైటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మత్స్యకార నాయకుడు, ఎస్‌.యానాం మాజీ సర్పంచ్‌ లంకే భీమరాజు, సొసైటీ సభ్యులు పి.పోతురాజు, ఎం.భైరవ స్వామిలు వినతి పత్రం ఇచ్చి ఇక్కడ పరిస్థితులను వివరించారు. 
 

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)