చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమల రెండో ఘాట్‌రోడ్డు మూసివేత
Published on Wed, 10/07/2015 - 09:42
తిరుమల : తిరుమల రెండో ఘాట్ రోడ్డు వద్ద మరమ్మతులు చేస్తున్న కారణంగా బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. నిపుణుల సమక్షంలో ఘాట్ రోడ్డులో మరమ్మత్తులు చేపట్టారు. దీంతో లింక్ రోడ్డు నుంచి మొదటి ఘాట్ రోడ్డులోకి వాహనాలు మళ్లిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
మంగళవారం ఉదయం తిరుమల రెండో ఘాట్ వద్ద బండరాళ్లు విరిగి రోడ్డుపై పడ్డ విషయం అందరికి విదితమే. బుధవారం తెల్లవారుజామున కూడా కొండచరియలు విరిగిపడటంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు క్రేన్ సహాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దతాత్కాలికంగా రెండో ఘాట్ రోడ్డును మూసివేశారు.
#
Tags