amp pages | Sakshi

వేర్వేరుగానే టెట్, డీఎస్సీ

Published on Tue, 12/01/2015 - 01:40

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లను వేర్వేరుగానే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) 2010, 2011 సంవత్సరాల్లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించనుంది.  ఉపాధ్యాయ విద్యా కోర్సుల చివరి సంవత్సరం (ఫైనలియర్) విద్యార్థులకు టెట్ రాసే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇప్పటికే ప్రకటించిన టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టవచ్చా, లేదా అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌కు సర్కారు లేఖ రాసింది.

ఈసీ నుంచి రెండు మూడు రోజుల్లో సానుకూల వివరణ వస్తే... వెంటనే దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని నిర్ణయించింది. సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా టెట్, డీఎస్సీలను కలిపి ఒకే పరీక్షగా (ఉపాధ్యాయ అర ్హత, నియామక పరీక్ష-టెర్ట్) నిర్వహించాలన్న డిమాండ్ నేపథ్యంలో దాని సాధ్యాసాధ్యాలపై చర్చించి.. పలు నిర్ణయాలు తీసుకున్నారు.

 వేసవి సెలవుల్లోనే డీఎస్సీ
 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులను డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) అభ్యర్థులకే పరిమితం చేయడంతో పాటు ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు వారు మాత్రమే అర్హులని ఎన్‌సీటీఈ 2010లోనే స్పష్టం చేసింది. ఇక బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థులు 6 నుంచి 8వ తరగతి వరకున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధించే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే అర్హులని పేర్కొంది. కాబట్టి టెట్‌లో డీఎడ్ అభ్యర్థులు పేపర్-1, బీఎడ్ అభ్యర్థులు పేపర్-2 రాసి, అర్హత సాధించాలని స్పష్టం చేసింది. ఈ అర్హత సర్టిఫికెట్‌కు ఏడేళ్ల చెల్లుబాటు సమయం (వ్యాలిడిటీ) ఉండాలని, ప్రైవేటు పాఠశాలల్లో బోధించేందుకూ టెట్‌లో అర్హత సాధించి ఉండాలని పేర్కొంది.

ఈ నేపథ్యంలో అవసరాల మేరకు ఎప్పుడో ఒకసారి నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్షకు, టెట్‌కు సంబంధం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. టీచర్ పోస్టుల నియామకాల్లో టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీని కొనసాగించాలని నిర్ణయించింది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాగానే టెట్ దరఖాస్తులకు చర్యలు చేపట్టనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను వచ్చే ఏప్రిల్ నెలాఖరు(వేసవి సెలవులు)లో జారీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు విద్యాశాఖ జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరిస్తోంది. అవి రాగానే ప్రభుత్వ ఆమోదం కోసం ఫైలు పంపించనుంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)