amp pages | Sakshi

ఇది ప్రభుత్వ నిర్వాకమే!

Published on Fri, 04/21/2017 - 23:58

- మంచినీటి సమస్యపై శంకరనారాయణ
పెనుకొండ : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పెనుకొండతోపాటు జిల్లాలోని అనేక మండలాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నమైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ విమర్శించారు. సోమందేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రధానంగా తాగునీటి సమస్యే కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందన్నారు. పెనుకొండ ఎమ్మెల్యే బీకే.పార్థసారథికి అధికారంపైనే వ్యామోహమని, ప్రజా సమస్యలపై శ్రద్ధ లేదని అన్నారు.

ప్రజలు తాగునీటికి విలవిలలాడుతుంటే కనీసం వారి సమస్యలను వినే పరిస్థితిలో కూడా లేరన్నారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తానని పామిడిలో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు గొల్లపల్లి రిజర్వాయర్‌కు గడువులోగా నీరు తీసుకొస్తామని ఇచ్చిన హామీని ఎంతమాత్రం నెరవేర్చారో చెప్పాలన్నారు. ఈ రిజర్వాయర్‌కు నీరు తీసుకురావడంలో విఫలమైన ఆయన తెప్పోత్సవం వంటి మాటలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న తాగునీటి పథకాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో రూ.4వేల కోట్ల పంట నష్టం సంభవించి రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం ఇన్‌పుట్‌ సబ్సిడీ కానీ, బీమా కానీ అందించిన పాపాన పోలేదన్నారు. ప్రజలు జగన్‌ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా? అని ఎదురు చూస్తున్నారని, టీడీపీకి బుద్ధి చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన్‌ నాగలూరు బాబు, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, నారాయణరెడ్డి, కన్వీనర్లు వెంకటరత్నం, శ్రీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, ఫక్రోద్దీన్, జిల్లా అధికార ప్రతినిధి రొద్దం చంద్రశేఖర్, ఎంపీటీసీ రామ్మోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)