amp pages | Sakshi

మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలలు

Published on Thu, 06/22/2017 - 01:37

టీచర్లు లేక.. వలంటీర్లు రాక బడులకు తాళం
టీచర్లు ఉంటే విద్యార్థులు ఉండరు..
విద్యార్థులున్న చోట  టీచర్లు కరువు!
ఇదీ అల్లాదుర్గం మండలంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి


అల్లాదుర్గం(మెదక్‌): నాణ్యమైన విద్య, సకల సదుపాయాలతో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా విద్యనందిస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం చెప్పే మాటలు.. ఆచరణలో అమలు కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో  టీచర్లు ఉంటే విద్యార్థులు లేకపోవడం.. విద్యార్థులు ఉన్న పాఠశాలలో టీచర్లు లేకపోవడం.. అల్లాదుర్గం మండలంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి.

మండలంలో 33 ప్రభుత్వ పాఠశాలలు
అల్లాదుర్గం మండలంలో 33 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ప్రాథమిక పాఠశాలలు 22, జెడ్పీ పాఠశాలలు 5, ప్రాథమికోన్నత పాఠశాలలు 6 ఉన్నాయి. మండలంలో 10 పాఠశాలలకు టీచర్లే లేరు. విద్యా వలంటీర్లతోనే నెట్టుకొస్తున్నారు. 10 పాఠశాలల్లో 6 పాఠశాలల్లో మాత్రమే ఒక్కో వలంటీర్‌ విధుల్లో చేరారు. సీతానగర్‌ తండా, అప్పాజిపల్లి తండా, చౌటాక్‌తండా, నీలకంఠిపల్లి ప్రాథమిక పాఠశాలలకు వలంటీర్‌ పోస్టులు మంజూరైనా ఎవరూ జాయిన్‌ కాలేదు. దీంతో ఆయా పాఠశాలలు మూతపడ్డాయి. ఏడుగురు విద్యావలంటీర్లు జాయిన్‌ కాలేదు. మండల పరిధిలోని పల్లెగడ్డ పాఠశాలలో ఐదు తరగతులకు ఇద్దరే విద్యార్థులు ఉన్నారు. ఒకటో తరగతిలో 1, మూడో తరగతిలో 1 విద్యార్థి ఉన్నారు. బుధవారం ఇద్దరు విద్యార్థులు రాకపోవడంతో ఉపాధ్యాయుడు మాత్రమే విధులకు హాజరయ్యారు. నీలకంఠిపల్లి ప్రాథమిక పాఠశాలలో టీచర్‌ లేకపోవడంతో విద్యార్థులు రావడం లేదు.

రెడ్డిపల్లిలో ప్రస్తుతం 20 మందే..
రెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదేళ్ల క్రితం 200 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లతో కళకళలాడింది. నేడు ఒక విద్యావలంటీర్, 20 మంది విద్యార్థులతో అధ్వానంగా మారింది. సీతానగర్‌ పాఠశాలలో 50 మందిపైగా విద్యార్థులు ఉండగా ఒక్క టీచర్‌ కూడా లేరు. ఒక వలంటీర్‌ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికైన ప్రభుత్వ పాఠశాలల్లో అమసరం మేరకు టీచర్లు, విద్యావలంటీర్లను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)