amp pages | Sakshi

పంచాయతీల కరెంటు బిల్లు రూ.16 కోట్లు

Published on Sat, 04/30/2016 - 05:06

రాబట్టేందుకు రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ
శంషాబాద్ మండలంలో వీధి దీపాల కనెక్షన్ల తొలగింపు

 వీధి దీపాలు, నీటి సరఫరాకు సంబంధించిన కరెంటు కనెక్షన్ల బకాయిలు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. శంషాబాద్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో కలిపి మొత్తం 16.67 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో బకాయిలను వసూలు చేసేందుకు ట్రాన్స్‌కో అధికారులు నడుం బిగించారు. వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తున్నారు.    -శంషాబాద్

 శంషాబాద్ ట్రాన్స్‌కో డివిజన్ పరిధిలోని ఎయిర్‌పోర్టు కాలనీ, నర్కూడ, బహదూర్‌గూడ, చెర్లగూడ, హమీదుల్లానగర్ , దొడ్డి, కాచారం, కవ్వగూడ, కొత్వాల్‌గూడ, పోశెట్టిగూడ, రాళ్లగూడ, రషీద్‌గూడ, రాయన్నగూడ, సంఘీగూడ, శంషాబాద్, శంకరాపురం, సుల్తాన్‌పల్లిలో వీధిదీపాల బకాయిలు రూ. 4.77 కోట్లు వసూలు కావాల్సి ఉంది. పీడబ్ల్యూఎస్‌కు సంబంధించిన బకాయిలు రూ. 6.98 కోట్లు పేరుకుపోయాయి. మొత్తం కలిపి రూ. 11. 75 కోట్లు  డివిజన్ పరిధిలో చెల్లించాల్సి ఉంది.

పెద్దషాపూర్ డివిజన్ పరిధిలోని బోటిగూడ, గండిగూడ, ఘాంసిమీయాగూడ, జుకల్, కవేలిగూడ, కిషన్‌గూడ, మదన్‌పల్లి, మల్కారం, ముచ్చింతల్, ననాజీపూర్, పాలమాకుల, పెద్దతూప్ర, పిల్లోనిగూడ, రామాంజపూర్, పెద్దషాపూర్, తొండుపల్లి, ఊట్‌పల్లి తదితర గ్రామాల్లో  వీధి దీపాలకు సంబంధించి విద్యుత్ బకాయిలు రూ. 1.58 కోట్లు ఉండగా పీడబ్ల్యూఎస్‌కు సంబంధించిన   మొత్తం రూ. 3.33 కోట్లు విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా ఇటీవల సంబంధిత ట్రాన్స్‌కో అధికారులు నోటీసులు జారీ చేసినా స్పందనరాలేదు. దీంతో ఎలాగైనా విద్యుత్ బిల్లులు రాబట్టేందుకు విద్యుత్ అధికారులు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో వీధి దీపాలకు సంబంధించిన కనెక్షన్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

రెండురోజుల క్రితం టీఎస్ పీడీసీఎస్ ప్రత్యేకాధికారి తిరుపతయ్యగౌడ్ తన సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు. విద్యుత్ బకాయిలను రాబట్టేందుకు ఆయా గ్రామ సర్పంచ్‌లను కలిసి పరిస్థితి వివరించారు. బిల్లులు వెంటనే చెల్లించాలని సూచించారు.  ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వీధి దీపాలకు సంబంధించిన కనెక్షన్లను తొలగించారు. దీంతో బకాయిలు వసూలయ్యేంత వరకు గ్రామాల్లో చీకట్లు కమ్ముకునే పరిస్థిలు నెలకొనడంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు తీరు సరికాదని కొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 బకాయిలు చెల్లించాల్సిందే: రాజేంద్రనగర్ డీఈ సోమిరెడ్డి
వీధి దీపాలు, పీడబ్ల్యూఎస్‌కు సంబంధించి పంచాయతీలు వినియోగించిన విద్యుత్ బిల్లులు చెల్లించాలని రాజేంద్రనగర్ డీఈ సోమిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శంషాబాద్ మండల పరిధిలో మొత్తం రూ. 16 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయా బిల్లులను ప్రభుత్వం గ్రామ పంచాయతీల నుంచి వసూలు చేయాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. బకాయిలు చెల్లించని కారణంగానే వీధి దీపాల కనెక్షన్లు తొలగిస్తున్నాం.

Videos

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)