amp pages | Sakshi

తిరుగుడే తిరుగుడు

Published on Wed, 04/19/2017 - 02:18

పన్నుల వసూలుకు మిస్తున్న పంచాయతీ సిబ్బంది
ఈనెల 30 వరకు గడువు పెంచడంతో కలెక్షన్‌కు చర్యలు
మిగిలిన రూ.3.19 కోట్ల వసూలుకు ప్రత్యేక ప్రణాళిక
వంద శాతం లక్ష్యంగా అధికారుల కృషి


వరంగల్‌ రూరల్‌: ఆర్థిక సంవత్సరం గతనెల 31వ తేదీతో ముగిసింది. అయినప్పటికీ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో వసూలు కావాల్సిన పన్నులు ఇంకా మిగిలిపోయాయి. ఇదే పరిస్థితి రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉండడంతో ప్రభుత్వం పన్నుల వసూళ్లకు ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఇందులో భాగంగా జిల్లాలో మిగిలిపోయిన రూ.3.19 కోట్ల వసూలుకు అధికా రులు కృషి చేస్తు న్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువును సద్వినియోగం చేసుకోవాలన్న భావనతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని జిల్లా పంచాయతీ అధికారి నుంచి కారోబార్‌ వరకు పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు.

72.55 శాతం వసూళ్లు..
జిల్లాలోని 15 మండలాల్లో 269 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా జీపీల్లో కలిపి గత ఆర్థిక సంవత్సరం (2016–17) రూ.11,64,00,173 మేరకు ఆస్తి, నీటి పన్నులు వసూలు చేయాల్సి ఉంది. అయితే గడువు ముగిసిన మార్చి 31వ తేదీ వరకు రూ.8,44,47,385(72.55శాతం) పన్నులే వసూలయ్యాయి. అంటే ఇంకా రూ.3.19 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఆ నగదు బకాయిగా పేరుకుపోతుందని భావించారు. అయితే, ఈ పరిస్థితి చాలా జిల్లాల్లో ఉండడంతో ఈనెల 30వ తేదీ వరకు పన్నుల వసూళ్లకు  ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు బకాయిలు వంద శాతం పూర్తి చేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి పిండి కుమారస్వామి ‘సాక్షి’కి తెలిపారు.

నోట్లు రద్దుతోనే..
కొత్తగా ఏర్పడిన వరంగల్‌ రూరల్‌ జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. దీంతో ఆస్తి, నీటి పన్నుల వసూళ్లలో ఉద్యోగులకు ఇబ్బం దులు ఎదురయ్యేవి. కానీ గత ఆర్థిక సంవత్సరం మధ్యలో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం రద్దయిన నోట్లతో పన్నులు చెల్లించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో రూ.11.64 కోట్ల వరకు ఉన్న పన్నుల్లో రూ. 8.44 కోట్ల వరకు వసూలయ్యాయి. అంటే నోట్ల రద్దు అంశం పన్నులు భారీగా వసూలయ్యేందుకు ఉపకరించిందని చెప్పొచ్చు.

అందరి సహకారంతో ముందుకు..
జిల్లాలో ఆస్తి, నీటి పన్నులు రూ.3 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉంది. మార్చి 31వ తేదీ వరకు వసూలైన పన్నులు లెక్కిస్తే ఈ బాకీ తేలింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు పన్నుల స్వీకరణకు అవకాశం కల్పించగా అప్పటి నుంచి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పన్నులు వసూలు చేస్తున్నాం. అన్ని గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఈఓ పీఆర్‌డీల సహకారం తీసుకుంటూ కార్యదర్శులు పన్నులు వసూళ్లలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఇచ్చిన గడువు సద్వినియోగం చేసుకుని వంద శాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)