amp pages | Sakshi

నిధులు నీళ్లపాలు !

Published on Fri, 08/12/2016 - 23:58

మంగపేట :మండల కేంద్రంలోని గోదావరి పుష్కరఘాట్‌ వద్ద ఏర్పడిన ఒర్రెను పూడ్చేందుకు వెచ్చించిన లక్షల రూపాయల ప్రజాధనం గోదావరి పాలయింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పుష్కరఘాట్‌కు ఎగువ ప్రాంతమైన పొదుమూరు, పంట పొలాల మీదుగా వరదనీరు ప్రవహించడంతో ఘాట్‌ను ఆనుకుని సుమారు 40 నుంచి 50 మీటర్ల వెడల్పుతో భారీ ఒర్రె ఏర్పడింది. రూ.4.22 కోట్ల పుష్కర నిధులతో నిర్మించిన ఘాట్‌ దెబ్బతినడంతో ‘ఘాట్‌కు పొంచి ఉన్న ముప్పు’ అనే కథనాన్ని ‘సాక్షి’ జూలై 22న వెలుగులోకి తెచ్చింది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాన్ని ఐటీడీఏ పీఓ, మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు సందర్శించి యుద్ధప్రాతిపదికన ఒర్రెను పూడ్చే చర్యలు చేపట్టారు.
 
ఒర్రెలో ఒండ్రు మట్టితో కూడిన ఇసుక బస్తాలను ఒడ్డు వెంట వేశారు. గోదావరి పొంగి ప్రవహిస్తే ఒడ్డుతో పాటు ఇసుక బస్తాలు సైతం కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో గమనించిన ‘సాక్షి’ ముందుగానే ‘వరద ఉధృతికి ఇసుక బస్తాలు నిలిచేనా’ అనే కథనాన్ని ప్రచురించింది. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరగడంతో ఆ తాకిడికి అన్నీ కొట్టుకుపోయాయి. ఒడ్డు వెంట రాళ్లతో కానీ, సిమెంట్‌ కాంక్రిట్‌తో కానీ వాల్‌ నిర్మించాల్సి ఉండగా, పలువురు మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు, రాజకీయ పలుకుబడి కలిగిన ఓ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై టెండర్‌ నిర్వహించకుండా డిపార్ట్‌మెంట్‌ పేరుతో నాసిరకంగా పనులు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లే నిధులు నీళ్లపాలయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ పీఓ స్పందించి నాసిరకంగా పనులు చేసిన వారి బిల్లులు నిలిపివేయాలని, ఒడ్డువెంట కరకట్ట నిర్మించేలా చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై మైనర్‌ ఇరిగేషన్‌ డీఈఈ యశ్వంత్‌ను వివరణ కోరగా పనులు ఇంకా పూర్తి కాలేదని, ఒక్క రూపాయి బిల్లుకూడా చెల్లించలేదని అన్నారు. పని చేసినంతమేరకే బిల్లు చెల్లిస్తామని చెప్పారు.  

Videos

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

Photos

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)