amp pages | Sakshi

చంద్రబాబు అవినీతిలో నిప్పు

Published on Sat, 09/24/2016 - 17:41

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ :
ఏపీ సీఎం చంద్రబాబు తన అవినీతిలో నిప్పు అనే శాసన మండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. శనివారం ఇందిరా భవన్‌లో  ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తన గుణాల అవినీతిని బయటికి పొక్కకుండా తనకు తానే నిప్పు అని సర్టిఫికెట్‌ ఇచ్చుకోవడం మంచిది కాదన్నారు. ఓటుకు నోటు కేసులో రూ 50 లక్షలు తన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేత ఇస్తూ పట్టుబడి తానే తప్పు చేయలేదని గొప్పలు చెప్పుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఓటుకు నోటు కేసులో అవినీతికి పాల్పడకుంటే హై కోర్టులో స్టే ఎందుకు తెచ్చుకున్నారో ప్రజలకు తెలియజేయాలన్నారు. అసెంబ్లీలో తన పార్టీకి సంబంధించిన స్పీకరు ఉన్నారు కాబట్టే నీ ఇష్టం వచ్చినట్లు అసెంబ్లీని నడిపిస్తున్నావని ప్రజాస్వామ్యం నీ ప్రభుత్వంలో ఎక్కడ ఉందో తెలపాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సీఎం రాజశేఖర్‌రెడ్డి చేసిన అభివృద్ధిలో ఒక్క శాతం కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా కేంద్రం నిధులతో నిర్మింస్తుంటే తామే నిర్మిస్తున్నట్లు  గొప్పలు చెప్పుకోవడం దారుణమన్నారు. ౖÐð ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాలువలు తవ్వుతుంటే  తప్పుబట్టిన చంద్రబాబు నేడు అదే కాలువల ద్వారా నీటిని తీసుకెళ్లడం కనబడటం లేదా అని విమర్శించారు. క్రిష్ణా నీటికి సంబంధించి డిల్లీలో కౌన్సిల్‌ సమావేశం రెండు రాష్ట్రాలకు జరిగితే అక్కడ వారితో ఏమీ మాట్లాడకుండా బయటికి రావడంలో అర్థమేమిటని విమర్శించారు. దీనికి ప్రదాన కారణం ఓటుకు నోటు కేసులో  తెలంగాణా ప్రభుత్వం చేతులో ఇరుక్కున్నావు కాబట్టే ఏమీమాట్లాడలేక చేతులు ఎత్తేసి ప్రజలను సర్వనాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు.  తెలంగాణా ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టి ఏపీకి నీరు రాకుండా చేస్తుంటే ఒక్క మాట కూడా వారిని ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. తెలుగు దేశం ప్రభుత్వం సొంతంగా ఏనాడు అధికారంలోకి రాలేదని 1999లో వాజ్‌పేయి హయాంలో 2014 మోడీ హయాంలో  అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్, పీసీసీ జనరల్‌ సెక్రటరీ సత్తార్, పీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసులు, జిల్లా సేవాదళ్‌ ఛైర్మన్‌ చీకటి చార్లెస్‌ పాల్గొన్నారు.
 



 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)