amp pages | Sakshi

రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

Published on Sun, 05/21/2017 - 02:56

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి చందూలాల్‌
సాక్షి, యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలు, టూరి జం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌ కోరారు. శుక్రవారం రాష్ట్ర యువజన సర్వీ సులు, సాంస్కృతిక పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జూన్‌ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలపై సమీక్షించారు. ప్రతి  సంవత్స రం మాదిరిగానే ఈసారి కూడా వేడుకలను 31జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని సూచిం చారు.

తెలం గాణ అమరవీరులకు నివాళులర్పించి అవతరణ వేడుకలకు నాంది పలకాలన్నారు. రాష్ట్ర యువజన సర్వీసులు, టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని గుర్తించి జిల్లా స్థాయి కమిటీ ద్వారా ఎంపిక చేసి జిల్లా స్థాయిలో సత్కరిం చాలని కోరారు.పది రంగాల్లో జిల్లా స్థాయిలో ఎంపి క చేసిన వారిని రూ.51,116 నగదు పురస్కారం, శాలువా, మెమోంటోలతో  సత్కరించాలన్నారు. అ భ్యర్థుల ఎంపిక ప్రక్రియ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలో జరుగుతుందన్నారు.

జిల్లాలకు గతంలో అవతరణ వేడుకలకు కేటాయించిన నిధులకు సంబంధించి యూసీలను ఈనెల 24లోగా  సమర్పించా లని కలెక్టర్లను కోరారు.  ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని, కళాకారులతో పెద్ద ఎత్తున సాంస్కృతిక సంబరాలు నిర్వహించాలని పేర్కొన్నా రు. జనవరిలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌కు ప్రతిపాదనలు పంపాలని, అదే విధంగా అక్టోబర్‌లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు తెలంగాణ రాష్ట్రం అంకుర్పారణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ అనితారామచంద్రన్, డీఆర్‌ఓ మహేందర్‌రెడ్డి, ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి, పౌర సంబంధాల అధికారి జగదీశ్, అడిషనల్‌ పీఆర్‌ఓ పీసీ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. 

Videos

బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు

చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?

ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)