amp pages | Sakshi

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా

Published on Mon, 10/24/2016 - 21:45

కాకినాడ సిటీ :
మధ్యాహ్న భోజన పథక కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్మికులు సుమారు రెండుగంటలపాటు కలెక్టరేట్‌ గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనం రూ.5వేలు ఇవ్వాలని, బిల్లులు, వేతనాలు ప్రతినెలా ఐదో తేదీలోపు చెల్లించాలని, గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని, వారంలో మూడు గుడ్లు వేయాలనే వేధింపులు ఆపాలని, పథకం అమలుకు సదుపాయాలు కల్పించాలని, కార్మికులకు ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని, ధరల పెరుగుదలకు అనుగుణంగా బడ్జెట్‌ పెంచాలని డిమాండ్‌ చేశారు. యూనియ¯ŒS గౌరవాధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ధరలు పెరుగుతూ ఉంటే ప్రభుత్వం బడ్జెట్‌ను తగ్గిస్తోందన్నారు. వంట చేసే కార్మికులకు బిల్లులు సకాలంలో అందక సరుకుల కోసం అప్పు తెచ్చి వండే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యూనియ¯ŒS జిల్లా అధ్యక్షురాలు ఎం.పద్మ, కార్మికులు పాల్గొన్నారు. 
 

Videos

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)