amp pages | Sakshi

కులాల వారీగా అభిప్రాయాలు తెలపాలి

Published on Thu, 03/23/2017 - 23:30

రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ    ∙
పలు గ్రామాల్లో పర్యటన
రంగంపేట : స్థానిక సమస్యలు, కులాల వారీగా అభిప్రాయాలు తెలపాలని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ కోరారు. చైర్మన్‌ మంజునాథ, సభ్యులు ఆచార్య వెంకటేశ్వర సుబ్రమణ్యం, ఆచార్య మల్లెల పూర్ణచంద్రరావు, ఆచార్య శ్రీమంతుల సత్యనారాయణలు గురువారం జిల్లాలోని పలు గ్రామాలను సందర్శించి ఆయా పంచాయతీ కార్యాలయాల వద్ద సమావేశాలు నిర్వహించారు. స్థానిక సమస్యలు, భౌగోళిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగంపేట మండలం పాత కోటపాడులో ఆయా కులాల నుంచి వినతులు స్వీకరించారు. అన్ని తరగతులలోను ప్రథమ శ్రేణి మార్కులు వచ్చినా ఉద్యోగావకాశాలు లేవని ఎంబీఏ పట్టభద్రుడు గవరసాని వీరబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసినా  ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెల్లమేకల దుర్గాప్రసాద్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ –1 రాధాకృష్ణ, ఆర్డీవో విశ్వేశ్వరరావు, సర్పంచ్‌ బత్తిన వీరయమ్మ, ఎంపీటీసీ సభ్యుడు ఐతి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 
వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసమే 
రావులపాలెం : మంజునాథ కమిషన్‌ కేవలం కాపులను బీసీల్లో చేర్చేందుకు వేసిన కమిషన్‌ కాదని రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన కులాల స్థితిగతులను అధ్యయం చేయడం కోసమేనని జస్టిస్‌ మంజునాథ స్పష్టం చేశారు. గురువా రం క్షేత్ర పర్యటనలో భాగంగా రావులపాలెం మండలం ఈతకోట గ్రామా నికి వచ్చిన ముగ్గురు సభ్యులతో కూడిన మంజునాథ బృందం ప్రజలతో ముఖాముఖి చర్చ నిర్వహించింది. కులాల మధ్య ఉన్న సఖ్యత, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన సరోజిని అనే కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ మాట్లాడుతూ తన తండ్రి మద్యానికి బానిస కావడంతో తమ కుటుంబ ఆర్థికంగా చితికిపోయిందని  తాను ఉన్నత విద్యను అభ్యసించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మంజునాథ మాట్లాడుతూ తండ్రి ఎన్నో ఏళ్ళుగా మద్యానికి బానిసైతే ఎందుకు వ్యతిరేకించి మానిపించలేకపోయావని ప్రశ్నించారు. ప్రయత్నించి విఫలం అయ్యానని ఆమె చెప్పడంతో ఏ సమస్య అయినా వ్యక్తిగా పరిష్కరించుకోలేనప్పుడు సంఘటితంగా పోరాడాలని సూచించారు. సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ చినబాబు, సర్పంచ్‌ మాసాబత్తుల సుమతి, తహసీల్దార్‌ ఉదయభాస్కర్, సీఐ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ లంక అంకయ్య ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. 
గురజనాపల్లిలో  క్షేత్రస్థాయి పరిశీలన
కరప : గురజనాపల్లి గ్రామంలో జస్టిస్‌ మంజునాథ, సభ్యులు పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. మంజునాథ మాట్లాడుతూ గ్రామ జనాభా ఎంత, సాగు విస్తీర్ణం ఎంత, ఎన్నికులాలు ఉన్నాయి. కులాలవారీగా వారి సామాజిక స్థితిగతులు, అక్షరాస్యత, నిరక్షరాస్యత, చదుకున్నవారు ఏఏ డిగ్రీలు చదివారు, వారి పరిస్థితుల అంశాలను వివరించాలని కోరారు. కరప సర్పంచ్‌ పంపన కన్నారావు, కార్యదర్శి సీహెచ్‌ ఇందిరలు గ్రామం వివరాలు తెలిపారు. మాజీ సర్పంచ్‌ పెంటపాటి సత్తిబాబు, పబ్బినీడి కృష్ణలు మాట్లాడుతూ గ్రామంలో ఎక్కువగా ఉప్పు కార్మికులుంటారని, వీరికి ఆరు నెలలు పనులుంటే, ఆరు నెలలు ఖాళీగా ఉంటారన్నారని, వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఉపాధి పథకం ద్వారా ఎంతమంది ఉపాధి పొందుతున్నదీ అడిగి తెలుసుకున్నారు. వివిధ కులాలవారు తమ సమస్యలను, బాధలను కమిషన్‌కు వివరించారు. ఉప్పు కార్మికులను దగ్గరకు పిలిపించి వారి ఆరోగ్య సమస్యలు అడిగితెలుసుకున్నారు. ఆర్డీవో ఎల్‌.రఘుబాబు, తహసీల్దార్‌ బూసి శ్రీదేవి, ఇన్‌చార్జి ఎంపీడీవో, భీమశంకరరావు, 
కులాలవారీగా సమీక్ష
పెద్దాపురం : సామాజిక వెనుకబాటుపై స్పందించి అన్ని కులాలకు న్యాయం చేయాలని బీసీ కమిషన్‌ చైర్మన్‌ మంజునాథకు పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కట్టమూరులో కులాల వారీగా జస్టిస్‌ మంజునాథ సమీక్ష జరిపారు. గ్రామానికి చెందిన రంగనాథం శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు సుందరపల్లి శివనాగరాజు, మాదిరెడ్డి సత్తిబాబు, పెంటా విజయ్‌కుమార్, ఎంపీటీసీ సభ్యుడు గంగాధరం, సర్పంచ్‌ దిమ్మల పుష్పరత్నంలు తమ తమ కులాలు వెనుకబడి ఉన్నాయని, అన్ని కులాల్లో కూడా సామాన్య  కుటుంబాలు ఉన్నాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని సామాజిక వెనుకబాటును గుర్తుంచుకుని రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీవో విశ్వేశ్వరరావు, తహసీల్దార్‌ వరహాలయ్య, ఎంపీడీవో వసంతమాధవి, ఈవోపీఆర్డీ హిమమహేశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ముద్రగడ దూత స్వామి వినతిపత్రం అందజేత
గ్రామానికి వచ్చిన బీసీ కమిషన్‌ చైర్మన్‌ మంజునాథకు కాపు జేఏసీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనుచరుడు, కాపు నాయకులు గౌతు స్వామి ఆధ్వర్యంలో జేఏసీ నియోజకవర్గ కన్వీనర్‌ మలకల చంటిబాబు, పట్టణ కన్వీనర్‌ జిగిని రాజుబాబుల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కాపులను బీసీల్లో చేర్చాలని, కాపు కులస్తులు చాలా కుటుంబాలు ఇప్పటికీ వెనుకబాటుతనంలో ఉన్నాయన్నారు. కమిషన్‌ వాటిని గుర్తించాలని వారు కోరారు.  
 

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)