amp pages | Sakshi

ఎమ్మెల్యే భూమి పూజ.. స్థానికుల ఆందోళన

Published on Tue, 12/06/2016 - 18:11

హైదరాబాద్ : వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 1 వెంగల్‌రావు పార్కు వెనుకాల దోబీఘాట్ బస్తీలో వ్యాయామశాల నిర్మాణానికి మంగళవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి భూమి పూజ చేశారు. అయితే ఇక్కడ వ్యాయామశాల నిర్మాణం వద్దంటూ స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. పనులను తక్షణం నిలిపివేయాలంటూ స్థానికులంతా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే వారందరినీ శాంతింపజేసి ఇక్కడ వ్యాయామశాల నిర్మాణం వల్ల ప్రయోజనాలను తెలియజేశారు.

పార్కు పక్కన ఉన్న పార్కింగ్ స్థలం నుంచి వ్యాయామశాలకు రోడ్డు నిర్మిస్తామని దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. ఇక్కడ వ్యాయామశాల నిర్మాణం వల్ల దళిత యువకులకు ప్రయోజనం ఉంటుందన్నారు. సుఖ్‌దేవ్‌నగర్, రామకష్ణానగర్, బాలాపురబస్తీ, గాందీపుర బస్తీ, దేవరకొండ బస్తీ, ఇలా అన్ని ప్రాంతాల యువకులు వినియోగించుకోవడానికి వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు కిషన్, అభిలాష్, రవి, శివ, ప్రవీన్, వీరాస్వామి, చంద్రశేఖర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)