amp pages | Sakshi

కదలని రింగ్‌ రోడ్డు!

Published on Mon, 01/16/2017 - 22:20

కార్యరూపం దాల్చని ఎంపీ ప్రతిపాదనలు
తీరని ట్రాఫిక్‌ సమస్య


జగిత్యాల: జిల్లా కేంద్రంలో రింగ్‌రోడ్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అధికారులు ప్రతిపాదనలు రూపొందించాలని ఎంపీ కల్వకుంట్ల కవిత 2016 డిసెంబర్‌ 28న కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు. అయినా అధికారుల నుంచి స్పందన కరువైంది.  ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనలు రూపొందించడంలేదు. జగిత్యాలలో రింగ్‌రోడ్డు పూర్తయితే   జిల్లా కేంద్రం రూపురేఖలు మారుతాయి. చిన్నరోడ్లతో ఇప్పటికే జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. 1983లో అమలులోని మాస్టర్‌ప్లాన్‌లోని రోడ్లే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి అయిన యావర్‌రోడ్‌లో ఎన్‌హెచ్‌–63 విస్తరించి ఉంది. కానీ.. ఈ రోడ్లు కనీసం 100 ఫీట్లు కూడా లేవు. ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో పాటు ప్రధాన ప్రాంతమైన టవర్‌సర్కిల్, గంజ్‌రోడ్డు, న్యూబస్టాండ్, ధర్మపురి రోడ్లంతా చిన్నవిగా ఉన్నాయి. వెడల్పు కార్యక్రమానికి గతంలో ప్రతి అధికారి ప్రతిపాదనలు తయారుచేశారే తప్ప మోక్షం దాల్చలేదు. ట్రాఫిక్‌ను తగ్గించాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాల క్రితం జగిత్యాల పక్క నుంచి బైపాస్‌రోడ్డు సైతం నిర్మించారు. ప్రస్తుతం ఈ బైపాస్‌ సిటీలోనే కలిసిపోయి ట్రాఫిక్‌ సమస్యగా ఏర్పడింది. ప్రస్తుతం బైపాస్‌రోడ్‌లోసైతం జనాలు ఎక్కువగా ఉండటంతో పెద్దపెద్ద వాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు పార్కింగ్‌ సమస్యతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

రింగ్‌రోడ్డుతో కళ
జగిత్యాల జిల్లా కేంద్రంలో రింగ్‌రోడ్‌ నిర్మిస్తే జగిత్యాల రూపురేఖలే మారనున్నాయి. ఇప్పటి కే ధరూర్‌ నుంచి గొల్లపల్లి రోడ్‌లోఉన్న డం పింగ్‌రోడ్‌ వరకు ఒక బైపాస్‌రోడ్డు నిర్మించారు. అలాగే ధరూర్‌ నుంచి కాకతీయ కెనాల్‌ పక్కనుంచి చల్‌గల్‌ వరకు సైతం బైపాస్‌రోడ్‌ నిర్మిం చారు.వీటితో పాటు మరో రింగ్‌రోడ్‌ను ఏర్పా టు చేస్తే ప్రజలకు కూడా ఎంతో వినియోగకరంగా ఉంటుంది. ట్రాఫిక్‌ నియంత్రణలో ఉం టుంది. జగిత్యాల జిల్లా జనాభా ప్రతిపాదికనఅతి పెద్ద జిల్లాగా విస్తరించింది. చుట్టు జిల్లా కేంద్రంలోని 18 మండలాలతోపాటు మూడు మున్సిపాలిటీలతో చుట్టూ జిల్లాలైనా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌ నుంచి సైతం జగిత్యాలకు వస్తుంటారు. ప్రస్తుతం రింగ్‌రోడ్డు అయితే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌