amp pages | Sakshi

చంద్రబాబు ఆశించినా మా జాతిలో పుట్టలేడు

Published on Sat, 02/13/2016 - 20:37

- అట్రాసిటీ చట్టం ప్రకారం ఏపీ సీఎంను అరెస్టు చేయాలి
- దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి పద్మారావు


తెనాలి:
తాను దళితుడిగా పుట్టాలనుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తల్లకిందులుగా తపస్సుచేసినా  అది సాధ్యం కాదని, రిజర్వేషన్ పొందుతున్న కులాలపై ద్వేషంతో ఎదిగిన ఆయనకు దళితుడిగా పుట్టే మహత్తర అవకాశం ఎన్నటికీ రాదని దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి పద్మారావు అన్నారు. ఎస్సీలను ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేసినరోజే సీఎంను అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేయాల్సిఉందని, అయితే పోలీస్ వ్యవస్థ అందుకు తయారుగాలేదని పద్మారావు అన్నారు.

గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ), దళిత మహాసభ, అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ‘అంబేడ్కర్-వ్యక్తిత్వ నిర్మాణం’ అంశంపై ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. బీటీఏ వ్యవస్థాపక కార్యదర్శి బట్టు వెంకయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లెక్చర ఇచ్చిన పద్మారావు.. చంద్రబాబు తీరును ఎండగట్టారు.

తన రాజకీయ జీవితంలో అంబేద్కర్ ఎన్నడూ అవినీతికి తావివ్వలేదని వల్లించే చంద్రబాబు.. తన కొడుకు చేత అవినీతి దుకాణం తెరిపించాడని, శ్రమశక్తి నుంచి ఉద్భవించిన దళితులను పన్ను వసూళ్ల నుంచి పుట్టిన ఇతరులు విమర్శించే అర్హతలేదని పద్మారావు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులు రిజర్వేషన్  పొందుతున్న కులాలపై ద్వేషంతోనే ఎదిగారని, రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీఇచ్చి, సొంత కులానికి చెందిన రైతులనే వెన్నుపోటుపొడిచిన చరిత్ర బాబుదని పద్మారావు విమర్శించారు.

Videos

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌