amp pages | Sakshi

నిరసనల హోరు

Published on Thu, 03/02/2017 - 23:12

- వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసు నమోదుపై
  వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల ఆగ్రహం
- జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు
- చంద్రబాబు తీరును ఎండగట్టిన వైనం
  
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని పార్టీ శ్రేణులు గురువారం జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తారు. తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు, ప్రధాన రాస్తారోకోలు, ర్యాలీలతో అట్టుడికించారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు.  కృష్ణా జిల్లా ముళ్లపాడు బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. 10 మంది చనిపోయి, 32 మంది గాయపడానికి కారణమైన దివాకర్‌ ట్రావెల్స్‌ను కాపాడడానికి ప్రభుత్వం ప్రయత్నించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రాక్షస పాలన నుంచి ప్రజలను కాపాడాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ఎండగట్టారు. 
- కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)
 
 
కర్నూలు
కర్నూలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లారు. ప్రమాద బాధితులను పరామర్శిస్తే కేసులు పెట్టేందుకు సీఎం చంద్రబాబునాయుడు దిగజారరంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని హఫీజ్‌ఖాన్‌ పేర్కొన్నారు. 
 
నంద్యాల
నంద్యాల, గోస్పాడు మండల్లాలో భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొని ధర్నాలు నిర్వహించారు. నంద్యాలో జరిగిన ధర్నా కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి రాజగోపాల్‌ పాల్గొని చంద్రబాబునాయుడు తీరును తప్పుబట్టారు. 
 
ఆదోని
- ఆదోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలు ఆ పార్టీ నాయకులు గోపాల్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, ప్రసాదరావు, మునిస్వామి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 
 
పత్తికొండ  
తుగ్గలిలో పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ చెరుకులపాడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. పత్తికొండలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, న్యాయవాదులు నరసింహయ్య ఆచారి, కారం నాగరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీతో వచ్చి ధర్నా చేశారు. రెవెన్యూ సీనియర్‌ అధికారి టిఎండీ ఉశేన్‌కు వినతి ప్రతం అందజేశారు. మద్దికెరలో పార్టీ మండల కన్వీనర్‌ మురళీధర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు రాజశేఖర్‌రావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 
 
మంత్రాలయం 
మంత్రాలయంలో సర్పంచ్‌ తెల్లబండ్ల బీమయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కౌళాలంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. 
 
ఆలూరు 
- ఆలూలు నియోజకవర్గంలోని ఆలూరు, దేవనకొండ, ఆస్పరి, హోళగుంద, చిప్పగిరి తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు నిర్వహించారు, ఆలూరులో నిర్వహించిన కార్యక్రమంలో మండల కన్వీనర్‌ చిన్న ఈరన్న, ఎంపీపీలు బసప్ప, బీమప్ప, యూత్‌ నాయకుడు విక్రంత్‌ పాల్గొన్నారు.
 
డోన్‌ 
డోన్‌లో జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, ప్యాపిలిలో బోరెడ్డి శ్రీరామ్‌రెడ్డి, బేతంచెర్లలో ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఆయా మండలాల్లో తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. 
 
ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరులో నిర్వహించిన ధర్నాలో ఆ పార్టీ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. నందవరం, గోనెగొండ్ల తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట కూడా వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. 
 
నందికొట్కూరు 
నందికొట్కూరు, పాములపాడులో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య పాల్గొని చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరామర్శకు వెళ్లిన వారిపై కేసులు పెట్టడం దారుణమని విమర్శించారు. కార్యక్రమంలో మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి పాల్గొన్నాడు. 
  
బనగానపల్లె 
బనగానిపల్లె, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల మండల్లాలో నిర్వహించిన ధర్నా కార్యక్రమాల్లో భారీ ఎత్తున వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బనగానిపల్లెలో జిల్లా అధికార ప్రతినిధి రామ్మోహన్‌రెడ్డి, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 
 శ్రీశైలం:
ఆత్మకూరులో జరిగిన ధర్నా కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి పాల్గొన్నారు. బండిఆత్మకూరు, మహానంది, సున్నిపెంటలో జరిగిన ధర్నాలో పలువురు కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. 
 
ఆళ్లగడ్డ 
ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమర్రి, శిరివెళ్ల మండలాల తహసీల్దార్‌ కార్యాలయలు వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ధర్నాలు, నిరసనలతో హోరెత్తాయి. ఆళ్లగడ్డలో జరిగిన కార్యక్రమంలో నాయకులు పండిట్‌ చంద్రుడు, శంకరరెడ్డి, గుండా మణి, జఫార్‌రెడ్డి పాల్గొన్నారు. 
 
పాణ్యం
కల్లూరు, ఓర్వకల్, గడివేముల మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు తమ పార్టీ అధినేతపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని ధర్నాలతో హోరెత్తించారు. కల్లూరులో జరిగిన ధర్నాలో అర్బన్‌ కన్వీనర్‌ బెల్లం మహేశ్వరరరెడ్డి, లీగల్‌ సెల్‌రాష్ట్ర కమిటీ సభ్యుడు పుల్లారెడ్డి, మైనార్టీసెల్‌ ఫైరోజ్‌ పాల్గొన్నారు.      

Videos

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)