amp pages | Sakshi

మోడల్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానం

Published on Mon, 01/16/2017 - 22:24

మోడల్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
వచ్చేనెల 26న ప్రవేశ పరీక్ష


కథలాపూర్‌ (వేములవాడ): రాష్ట్రంలోని మోడల్‌స్కూళ్లలో వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌  జారీచేసింది. జిల్లాలో 13  మోడల్‌స్కూళ్లు ఉన్నాయి. 2017–18 విద్యాసంవత్సరానికి గాను ఆరోతరగతిలో ఒక్కో స్కూల్‌లో 100 సీట్ల చొప్పున 1,300 సీట్లును భర్తీ చేసేందుకు  ఉత్తర్వులు జారీచేశారు. వీటితోపాటు ఆయా పాఠశాలల్లో   7,8,9,10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ  చేయనున్నారు. ఈనెల 17 నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారని కథలాపూర్‌ మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌ నరేశ్‌ పేర్కొన్నారు. 7,8,9,10 తరగతుల్లో ఖాళీల వివరాలు ఆయా స్కూళ్ల నోటీస్‌బోర్డుపై అంటిస్తారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు సైతం ఆన్‌లైన్‌లోనే జారీచేస్తారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు  ఫిబ్రవరి 26న ప్రవేశపరీక్ష ఉంటుంది.

దరఖాస్తులు చేసుకోవడం ఇలా...
ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్‌ తీసుకోవాలి. కలర్‌ పాస్‌పోర్టు సైజు ఫొటో, ఆధార్‌కార్డు, కులం, నివాసం, ఆదాయం సర్టిఫికెట్లతో ఆన్‌లైన్‌లో  దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు జిరాక్స్‌ కాపీని పరీక్ష రాయబోయే స్కూల్‌లో సమర్పించాలి. ఈనెల 17 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 26న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆరోతరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు 7,8,9,10 తరగతుల్లో చేరే విద్యార్థులకు ప్రవేశపరీక్ష ఉంటుంది. మార్చి నెల 9న మెరిట్‌ లిస్టు, 10న ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రదర్శన, 17, 18 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty : గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌