amp pages | Sakshi

కూరగాయల సాగుపై దృష్టి

Published on Thu, 06/22/2017 - 19:53

– కళ్యాణదుర్గం కేవీకే కోఆర్డినేటర్‌ జాన్‌సుధీర్‌
అనంతపురం అగ్రికల్చర్‌ : ఖరీఫ్‌ ప్రారంభం కావడం, వర్షాలు కురుస్తున్నందున సీజన్‌లో పందిరి జాతి కూరగాయల పంటలను రైతులు సాగు చేసుకోవచ్చని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. కాకర, బీర, సొర, దోస, గుమ్మడి పంటలు ఎంపిక చేసుకుని సాగు చేసుకోవచ్చన్నారు.

తీగ జాతి కూరగాయల పంటలు
+ కాకర విషయానికి వస్తే పూసాదో మౌసమి, కోయంబతూర్‌ లాంగ్‌ గ్రీన్, కోలాంగ్‌ వైట్, అర్కహరిత, ప్రియ, మైకోగ్రీన్‌ లాంగ్, హైబ్రీడ్‌ ఎంఎస్‌–431, ఎంబీటీహెచ్‌–101, 102, శ్వేత, శ్రేయ, పాలీ విత్తన రకాలు అనువుగా ఉంటాయి.
+ బీరలో అయితే జగిత్యాల లాంగ్, జైపూర్‌ లాంగ్, అర్క సుజాత, హైబ్రీడ్స్‌ ఎంఎస్‌–3, 401, 403 రకాలు ఎంపిక చేసుకోవాలి.
+ సొరలో పూసా మంజరి, కావేరి, శారద, స్వాతి, శ్రామిక విత్తన రకాలు అనువైనవి.
+ దోసలో జపనీస్‌ లాంగ్‌ గ్రీన్, పాసఖీర, కో–1, హైబ్రీడ్స్‌ మైకో–4, మాలిని, సోలాన్‌ హైబ్రీడ్‌–1 రకాలు అనువుగా ఉంటాయి.
+ గుమ్మడిలో శక్తి, కో–1, కో–2 వంటి బూడిద గుమ్మడి రకాలు ఎంపిక చేసుకోవాలి.

విత్తే సమయం : అనప, దోస, కాకర పంటలు జూన్, జూలై చివరి వరకు.. అలాగే జనవరి రెండో పక్షం నుంచి ఫిబ్రవరి ఆఖరు వరకు విత్తుకోవచ్చు. గుమ్మడి, పొట్ల పంటలు జూన్, జూలై, డిసెంబర్, జనవరిలో వేసుకోవచ్చు. బీర, బూడిద గుమ్మడి జూన్‌ నుంచి ఆగస్టు మొదటి వారం.. అలాగే డిసెంబర్‌ రెండో పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. దొండ పంట జూన్, జూలై వరకు నాటుకోవచ్చు.

విత్తే పద్ధతి : భూమిపై పాకించే పాదులకు, వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగునీరు పోయేందుకు రెండు మీటర్ల దూరంలో కాలువలు చేయాలి. వేసవిలో వేసే పాదులకు పొలం అంతటా నీటి పారుదల కోసం బోదెలు చేయాలి. అన్ని రకాల పాదుల్లో 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో మూడు విత్తనాలు పెట్టాలి. దొండ విషయానికి వస్తే చూపుడు వేలు లావు ఉన్న నాలుగు కణుపుల కొమ్మలు రెండేసి నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలు వర్షాధార పంటలకు 15 X 10 సెంటీమీటర్లు కొలతలు ఉన్న పాలిథీన్‌ సంచుల్లో విత్తుకుని 15 నుంచి 20 రోజులు పెరిగిన తర్వాత అదను చూసుకుని పొలంలో నాటుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్, 5 గ్రాముల ఇమిడిక్లోప్రిడ్‌ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తే ముందు ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు, 32 నుంచి 40 కిలోల భాస్వరం, 16 నుంచి 20 కిలోల పొటాష్‌ ఎరువులు వేయాలి. 32 నుంచి 40 కిలోల నత్రజని ఎరువును రెండు భాగాలుగా చేసుకుని విత్తిన 25 నుంచి 30 రోజుల సమయంలో చల్లాలి. అనంతరం పూత, పిందె దశలో రెండో సారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరగా ఎరువులు వేయకూడదు. ఎరువులు వేసిన వెంటనే నీటి తడులు ఇవ్వాలి.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)