amp pages | Sakshi

అన్ని జిల్లాల్లో కాపు జేఏసీలు

Published on Sun, 07/24/2016 - 21:40

కిర్లంపూడి :
ప్రతి జిల్లాలోను కాపు జేఏసీలను నియమిస్తున్నట్టు కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. ఆదివారం పలువురు కాపు నాయకులతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్వగృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. తొలివిడతగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నియోజకవర్గానికి పది మంది చొప్పున కాపు జేఏసీని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. రెండో విడతలో ఈ నెల 26న కడప, 27న కర్నూలు, 28న అనంతపురం, 29న కృష్ణా జిల్లాల్లో పర్యటించి, కాపు జేఏసీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరో రెండు విడతల్లో అన్ని జిల్లాల్లో కాపు జేఏసీల ఏర్పాటు పూర్తిచేస్తామని తెలిపారు. భవిష్యత్తులో చేపట్టబోయే ఆందోళనలకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు వేణుగోపాల్, గోపు చంటిబాబు, గౌతు  స్వామి, గౌతు సుబ్రహ్మణ్యం, సానా బోసు, చిడిపిరెడ్డి సత్తిబాబు, సూరత్‌ సత్యన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
 

 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)