amp pages | Sakshi

విమానాశ్రయంలో విస్తరణ పనులు

Published on Tue, 08/23/2016 - 23:44

  • ఇప్పటికే పద్దెనిమిది లక్షలకుపైనే ప్రయాణాలు
  • కొత్తగా దేశీయ ప్రయాణికులకు ఇంకో టెర్మినల్‌...మరో రోడ్డు మార్గం
  • విమానాల నిలుపుదలకు ఆరు బేల నిర్మాణం
  • గోపాలపట్నం: ఒకప్పుడు విశాఖ ఎయిరోడ్రోమ్‌...తర్వాత విశాఖ విమానాశ్రయం...మరి నేడు అంతర్జాతీయ విమానాశ్రయం...ఒకప్పుడు ఏటా వేల సంఖ్యలో ప్రయాణాలు కాస్తా నేడు దాదాపు పంతొమ్మిది లక్షల ప్రయాణాలయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణాలు కూడా అనూహ్యంగా పెరుగుతుండడం, దీనికి తగ్గట్టు విమానసర్వీసులూ పుంజుకోవడంతో అప్రాన్‌పై విమానాల నిలుపుదలకు కష్టమవుతోంది. ఈవిమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్ధాయిలో ఊహించి టెర్మినల్‌ భవనం కట్టినా ఇదీ చాల్లేదు. అందుకే విమానాశ్రయాన్ని ఆధునీకరణకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ఏర్పాట్లు చేస్తోంది. రానున్న రోజుల్లో దేశీయ ప్రయాణికులకు ఒక టెర్మినల్‌ భవనం, అంతర్జాతీయ ప్రయాణికులకు ఇంకో టెర్మినల్‌ భవనం ఏర్పాటు కానున్నాయి.  భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అభివద్ధి ప్రచారం నేపధ్యంలో కేంద్రం ఇక్కడి విమానాశ్రయ అభివద్ధిపై దష్టి సారింస్తుండడంపై ప్రయాణికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. 
    రూ60కోట్లతో ఆరు బేలు...
    ఇక్కడి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల మాదిరిగా రూపురేఖలు మార్చడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం దాదాపు రూ60కోట్లు వెచ్చించింది. దాదాపు ఆరెకరాల స్థలంలో ఈపనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఒకప్పుడు చెరువులా ఉన్న ప్రాంతంలో రెండు మీటర్లలోతున పూడికలు తీశారు. ఇపుడు గ్రావెల్‌ ఫిల్లింగ్‌ చేపడుతున్నారు. ఇక్కడ ఇప్పటికే తొమ్మిది బేలు ఉండగా, మరో ఆరుబేలు (ఆరు విమానాలు నిలుపుదలకు) ప్రణాళిక చేశారు. ఆప్రకారం ఇక్కడ మరో టెర్మినల్‌ భవనం ఏర్పాటుకు ప్లాన్‌ చేశారు. దీన్ని దేశీయ టెర్మినల్‌ భవనంగా రూపుదిద్దుతారు. ఇక్కడి నుంచి మరో మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఇలా జాతీయ రహదారి నుంచి దేశీయ టెర్మినల్‌ భవనంకి చేరేలా మార్గాన్ని రూపొందిస్తున్నారు. ఈమొత్తం పనులు మరో ఏడాదిలోగా పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్, దానికి ఉన్న రోడ్డు మార్గం రానున్న కాలంలో అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్ధేశిస్తారు. 
    మరిన్ని దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు...
    విశాఖ విమానాశ్రయానికి దేశీయ, అంతర్జాతీయ విమానసర్వీసులు మరిన్ని రానున్నాయి. డిసెంబరు 15 నుంచి దుబాయ్‌కి ఫై ్లదుబాయ్‌ విమానసంస్ధ విశాఖకు ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తుండగా, మలిందో విమానం కౌలాలంపూర్‌కి  తిరిగి డిసెంబరు 25 నుంచి పునరుద్దరణకు సన్నాహాలు చేసింది. వచ్చేనెల సెప్టెంబరు 1 నుంచి విజయవాడకు ఎయిర్‌కోస్తా, నవంబరు ఒకటి నుంచి కోల్‌కతాకి,   సై ్పస్‌జెట్‌ , ట్రూజెట్‌ హైదరాబాద్, విజయవాడకు సర్వీసులు అందించనున్నాయి. ఇలా విమానాల ట్రాఫిక్‌ పెరిగిన నేప«థ్యంలో విమానాశ్రయ అభివృద్ధి ఇంకా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
     
     

Videos

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌