amp pages | Sakshi

పథకం ప్రకారమే?

Published on Tue, 12/01/2015 - 08:26

కఠారి దంపతుల హత్య నుంచి చింటూ లొంగుబాటు వరకు..
వ్యవహారాన్ని  నడిపించిందెవరు..?

 
చిత్తూరు మేయర్ దంపతుల హత్యకేసు సోమవారం కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు చింటూ చిత్తూరు కోర్టులో లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో మొత్తం 11 మంది నిందితుల్లో చింటూ కారు డ్రైవర్ తప్ప మిగిలిన వారందరూ అరెస్టు అయ్యారు. ఇదిలా ఉండగా.. ఈ కేసు వ్యవహారం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.
 
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతులను హత్య చేయడం నుంచి చింటూ లొంగుబాటు వరకు అంతా పథకం ప్రకారమే జరిగి నట్లు తెలుస్తోంది. ఈ నెల 17న చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ కార్పొరేషన్ కార్యాలయంలో తుపాకీ గుళ్లు, కత్తిపోట్లకు బలయ్యారు. ఈ హత్యను తామే చేశామంటూ వెంకటాచలపతి, మంజునాథ్ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. మరో వ్యక్తి జయప్రకాష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

18వ తేదీన ఈ కేసులో ప్రధాన నిందితుడు కఠారి మోహన్ మేనల్లుడు చింటూనేనని పోలీసులు తేల్చారు. సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు హత్యను ఖండిస్తూ, నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. 19న మేయర్ దంపతుల అంత్యక్రియలు నిర్వహించారు. 20వ తేదీన రాష్ట్ర శాంతిభద్రతల అదనపు డీజీపీ ఠాకూర్ చిత్తూరుకు చేరుకున్నారు. చింటూను పట్టుకోవడానికి పది బృందాలను ఏర్పాటు చేశామని, అతని ఆచూకీ చెబితే రూ.లక్ష రివార్డు ఇస్తామని ప్రకటించారు.

24న మేయర్ హత్య కేసులో లొంగిపోయిన వెంకటాచలపతి, మంజునాథ్, జయప్రకాష్ అరెస్టు. 25న ఈ కేసులో యోగ, శశిధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 27న రాష్ట్ర సీఐడీ అదనపు డీజీపీ ద్వారక తిరుమలరావు చిత్తూరు చేరుకుని కేసుపై సమీక్షించారు. ఇదే రోజు చింటూ తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ లేఖ రాశాడు. 28న రాష్ట్ర డీజీపీ రాముడు చిత్తూరు చేరుకుని కేసును సమీక్షించారు. చింటూ కోసం మొత్తం గాలిస్తున్నామని, అతన్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు. చింటూ రాసిన ఉత్తరం చూస్తే ఇతను కోర్టులో లొంగిపోయే అవకాశం ఉందని చెప్పారు.

30వ తేదీ ఉదయం 11.05 గంటలకు పోలీసు అతిథి గృహంలో ఎస్పీ ప్రెస్‌మీట్ ప్రారంభించారు. కేసులో మురుగ, పరంధామ, హరిదాస్ అరెస్టు  చూపించారు. హత్యలో వారి పాత్రను వివరించారు. చింటూ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 11.33 గంటలకు ప్రెస్‌మీట్ పూర్తయ్యింది. అదేరోజు ఉదయం 11.37 గంటల ప్రాంతంలో చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలోకి ఓ ఆల్టో కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఓ వ్యక్తి గొడుగు వేసుకుని, చేతిలో రెండు పేపర్లు ఉంచుకుని నాలుగో అదనపు న్యాయస్థానంలోకి ప్రవేశిస్తూ గొడుగు తీసేశాడు. అక్కడున్న వారంతా ఒక్కసారిగా అతన్ని ఆశ్చర్యంగా చూశారు. వచ్చిన వ్యక్తి చింటూ. తనకు ఈ కేసులో సంబంధం లేదని పిటిషన్‌ను న్యాయమూర్తికి అందించాడు.

చింటూ న్యాయస్థానంలోనే దాదాపు మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూర్చున్నాడు. ఇప్పటికే చింటూపై పోలీసులు కేసు నమోదు చేసి ఉండడం, చింటూను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ వేయడంతో న్యాయమూర్తి 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి, 15 రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం అతన్ని అత్యంత భద్రత నడుమ కడప జైలుకు తరలించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను చింటూ వెనుకవైపు ఉన్న వ్యక్తులు పక్కా ప్రణాళికతో నడిపించారు. చింటూతో పాటు అతని డ్రైవర్ వెంకటేష్ కూడా లొంగిపోతే ఇద్దరికీ కేసులో సంబంధం ఉన్నట్లు తెలిసిపోతుందని గ్రహించిన చింటూ తాను ఒక్కడే లొంగిపోయినట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు.
 
దొరకాల్సింది ఒక్కడే
మేయర్ హత్య కేసులో ఇప్పటి వరకు పోలీసులు 11 మందిపై ప్రాథమికంగా కేసులు నమోదు చేశారు. ఇందులో తొలుత ఇద్దరు నిందితులు లొంగిపోగా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రధాన నిందితుడు చింటూ న్యాయస్థానంలో లొంగిపోయాడు. ఇక ఈ కేసులో మరో నిందితుడు మొగిలి పోలీసుల అదుపులో ఉండగా, చింటూ డ్రైవర్ వెంకటేష్ ఒక్కడే దొరకాల్సి ఉంది. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా చింటూ లొంగుబాటు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ జనాలు గుమిగూడినా ఈ విషయం చుట్టూనే చర్చలు సాగాయి.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)