amp pages | Sakshi

భర్త వదిలేస్తాడని: గర్భిణి కడుపు కోసి..

Published on Sat, 06/06/2020 - 15:34

మెక్సికో : గర్భంతో ఉన్న ఓ యువతిని దారుణంగా హత్య చేయటమే కాకుండా.. కడుపులోని శిశువును బయటకు తీసి అతి క్రూరంగా ప్రవర్తించిందో మహిళ. ఈ సంఘటన మెక్సికోలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం మెక్సికో, సోలిడరిడాడ్‌కు చెందిన జునైతా అనే మహిళ అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల గర్భిణిని తన ఇంటికి పిలిచింది. అనంతరం యువతిని బంధించి, బండరాయితో తలను పగులగొట్టింది. ఆ తర్వాత కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపి, కడుపులోని ఏడు నెలల బిడ్డను బయటకు తీసింది. ఆ వెంటనే పసికందును ఆసుపత్రికి తీసుకెళ్లింది. ( వైజాగ్‌ యువతిది హత్యే! )

ఆ బిడ్డ తన బిడ్డేనని అక్కడి వారికి అబద్ధం చెప్పింది. నెలలు నిండని పసికందు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం అందించి రక్షించారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ బిడ్డ ఆమెది కాదని అనుమానించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. జునైతాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. పిల్లలు పుట్టని తనను భర్త వదిలేస్తాడేమోనన్న భయంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపింది. పోలీసులు హత్యానేరం కింద ఆమెపై కేసు నమోదు చేశారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)