amp pages | Sakshi

పంటినొప్పి నెపంతో వచ్చి వైద్యురాలిపై దాడి

Published on Thu, 09/05/2019 - 08:21

సాక్షి, చిత్తూరు : పంటి నొప్పికి ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలంటూ వచ్చిన ఓ మాయలేడి దంపతులు దంతవైద్యురాలి నుంచి బంగారు గొలుసు లాక్కుని ఉడాయించారు. చిత్తూరులో మూడు నెలల క్రితం సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎట్టకేలకు పోలీసులు ఆ మాయలేడిని పట్టుకుని అన్ని నొప్పులకూ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు.  బుధవారం పోలీసు అతిథి గృహంలో  డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి సీఐలు భాస్కర్, రమేష్‌ మీడియాకు తెలిపిన వివరాలు..స్థానిక చర్చివీధిలో దంతవైద్యురాలిగా పనిచేస్తున్న ఎస్‌.పి.సుమతి వద్దకు మూడు నెలల క్రితం దంపతుల్లా ఇద్దరు వచ్చారు.

తాము పంటినొప్పితో బాధపడుతున్నామని, చికిత్స చేయాలని కోరారు. నిజమేనని నమ్మిన ఆ వైద్యురాలు వారితో మాట్లాడుతుండగా హఠాత్తుగా  ఆమెపై దాడిచేసి మెడలో ఉన్న 40 గ్రాముల బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు. దీంతో వైద్యురాలు  ఫిర్యాదు చేయడంతో క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిత్తూరు రూరల్‌ మండలం లక్ష్మీపురానికి చెందిన గోవిందస్వామి, ఎం.సుగుణ (38) దంత వైద్యురాలి వద్ద బంగారు గొలుసు లాక్కుపోయినట్లు చర్చి వీధిలోని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. ఇక క్లూ లభించడంతో కేసును ఛేదించారు. సుగుణను అరెస్టు చేసి ఆమె నుంచి రూ.1.50 లక్షల విలువైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

వాస్తవానికి వీరిద్దరూ దంపతులు కాదని, గ్రామంలో పక్క పక్కనే ఇళ్లల్లో వీరు ఉంటున్నారని, వీరిద్దరికీ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ ఘటన తరువాత పశువులను చోరీ చేసిన కేసులో గోవిందస్వామిని చిత్తూరు తాలూక పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు గుర్తించారు.  ఇతడిని త్వరలోనే పీటీ వారెంటుపై అదుపులోకి తీసుకోనున్నట్లు డీఎస్పీ చెప్పారు. కాగా నిందితులను గుర్తించడంలో ఎస్‌ఐలు నెట్టికంఠయ్య, మనోహర్, చంద్రమౌళి, సిబ్బంది జయకుమార్, మురళి, రఘులను ఆయన అభినందించారు. త్వరలోనే వీరికి ఎస్పీ చేతుల మీదుగా రివార్డును అందజేస్తామన్నారు. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)